అట్లీ దర్శకత్వంలో నయనతార ఇక నటించదా ?.. దీపికా వల్లే ఇద్దరికీ చెడిందా , కరివేపాకు లాగా వాడుకుని..
కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. పఠాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడంతో జవాన్ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది.
కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. పఠాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడంతో జవాన్ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. తొలి షో నుంచే అట్లీ, షారుఖ్, నయనతార చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ మొదలయ్యాయి. క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూలు ఇవ్వడంతో జవాన్ చిత్రం అనేక రికార్డులు తిరగరాస్తోంది.
ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో నటించారు. నయనతార హీరోయిన్ గా నటించగా.. షారుఖ్ లక్కీ లేడీ దీపికా కీలక పాత్రలో నటించింది. అయితేఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడా నయనతార కనిపించలేదు. దీపికా మాత్రం షారుఖ్ తో ఆఫ్ స్క్రీన్ లో కూడా కెమిస్ట్రీ పండిస్తూ తెగ సందడి చేసింది.
దీనితో ఈ చిత్రంలో అసలు హీరోయిన్ నయనతార లేక దీపికా పదుకొనెనా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సినిమా రిలీజ్ కి ముందు దీపికా పాత్ర గెస్ట్ రోల్ అని చెప్పారు. కానీ ఈ చిత్రంలో దీపికా రోల్ బాగా ఎలివేట్ అయింది. ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ మీరే అని నయనతారని అట్లీ ఒప్పించారట. కానీ ప్రాధాన్యత మొత్తం దీపికాకే ఇచ్చారని నయనతార బాగా అప్సెట్ అయినట్లు జాతీయ మీడియాలో సైతం ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అంతే కాదు నయనతార.. అట్లీ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. షారుఖ్ చిత్రం కాబట్టి సౌత్ తరహాలోనే నార్త్ లో కూడా జవాన్ మూవీ తనకి తిరుగులేని క్రేజ్ తీసుకువస్తుంది అని నయనతార భావించింది. తీరా చూస్తే నయనతారని అట్లీ కేవలం కూరలో కరివేపాకు తరహాలో వాడుకుని దీపికాని హైలైట్ చేసారంటూ నయనతార ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
దీపికా పాత్రని హైలైట్ చేయడం కోసం తాను నటించిన కీలక సన్నివేసాలని కూడా అట్లీ ఎడిట్ చేసేశారట. దీనితో నయనతార ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై అట్లీ దర్శకత్వంలో నటించకూడదని అట్లీ నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కోపంతోనే నయనతార సినిమా రిలీజ్ కి ముందు ఆ తర్వాత ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు.
ప్రతి ఈవెంట్ లో షారుఖ్ పక్కన దీపికాకే పెద్దపీట వేశారు. అట్లీ ఈ విధంగా చేస్తాడని అసలు ఊహించలేదని నయనతార సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. నార్త్ లో అయితే ఇది షారుఖ్ దీపికా చిత్రం అని మాట్లాడుకునేంతగా నయనతారని సైడ్ చేసేసినట్లు తెలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో నయన్ జవాన్ తో