నయనతార కవలపిల్లలను చూశారా..
వారి కవల అబ్బాయిలు ఉయిర్ రుద్రోనీల్ ఎన్ శివన్, ఉలాగ్ దైవిక్ ఎన్ శివన్ ఈ పేర్లలో ఎన్ అంటే నయనతార పేరు వచ్చేలా పెట్టారు.

నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు తమ కవలపిల్లలతో క్రిస్టమస్ ను సంతోషంగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
నయనతార, విఘ్నేష్ శివన్ జంట 2022, జూన్ 9న మహాబలిపురంలో వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 2022లో, ఈ జంట సరోగసీ ద్వారా ఉయిర్, ఉలగం అనే తమ కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు.
వారి కవల అబ్బాయిలు ఉయిర్ రుద్రోనీల్ ఎన్ శివన్, ఉలాగ్ దైవిక్ ఎన్ శివన్ ఈ పేర్లలో ఎన్ అంటే నయనతార పేరు వచ్చేలా పెట్టారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి అవసరం లేదు. దర్శకుడు విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది.
ఆ తరువాత సరోగసి విధానంలో కవలలకు జన్మనిచ్చింది. ఇది కూడా వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. దీనిమీద కోర్టులో వివాదం కూడా నడిచింది.
నయనతార అసలు పేరు డయానా మరియన్ కురియమ్. మొదటి సినిమా మనసీనక్కరే. ఆ సినిమా డైరెక్టరే డయానా పేరును నయనతారగా మార్చారట. ఆ సినిమా ప్లాఫ్ అయ్యింది.
అవకాశాలు లేకపోవడంతో లోకల్ టీవీలో యాంకర్ గా కూడా పనిచేసింది. ఆ తరువాత గజిని సినిమాతో దశ తిరిగింది. ఆ తరువాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
తాజాగా హిందీలో షారూఖ్ ఖాన్ తో చేసిన జవాన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది నయనతార. ఇన్నేళ్లైనా తనలో గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని... యాక్షన్ సన్నివేశాలూ తనకు కొట్టిన పిండని నిరూపించుకుంది. బాలీవుడ్ లోనూ క్రేజ్ సంపాదించుకుంది.