MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ధనుష్ నిజస్వరూపం బట్టబయలు, 3 పేజీల బహిరంగ లేఖతో దుమ్మెత్తి పోసిన నయనతార.. సంచలన వివాదం ఎందుకంటే

ధనుష్ నిజస్వరూపం బట్టబయలు, 3 పేజీల బహిరంగ లేఖతో దుమ్మెత్తి పోసిన నయనతార.. సంచలన వివాదం ఎందుకంటే

నటుడు ధనుష్ పై మరో వివాదం చెలరేగింది. ఈసారి చెలరేగిన వివాదం మరింత సంచలనంగా మారొచ్చు. ఎందుకంటే ఈ వివాదంలో ఇన్వాల్వ్ అయింది ఎవరో కాదు లేడి సూపర్ స్టార్ నయనతార. నయనతార, ధనుష్ గతంలో కొన్ని చిత్రాల్లో నటించారు.

3 Min read
Author : Tirumala Dornala
Published : Nov 16 2024, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
nayanthara

nayanthara

నటుడు ధనుష్ పై మరో వివాదం చెలరేగింది. ఈసారి చెలరేగిన వివాదం మరింత సంచలనంగా మారొచ్చు. ఎందుకంటే ఈ వివాదంలో ఇన్వాల్వ్ అయింది ఎవరో కాదు లేడి సూపర్ స్టార్ నయనతార. నయనతార, ధనుష్ గతంలో కొన్ని చిత్రాల్లో నటించారు. ధనుష్ నిర్మాణంలో కూడా నయన్ నటించింది. తాజాగా నయనతార.. ధనుష్ పై దుమ్మెత్తి పోస్తూ, అతడి నిజస్వరూపం ఇదే అంటూ 3 పేజీల బహిరంగ లేఖతో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ లేఖలో ధనుష్ క్యారెక్టర్ ని తప్పు బడుతూ నయనతార తీవ్రమైన ఆరోపణలు చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది ? వివాదం ఏంటి ?

అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది ? వివాదం ఏంటి ?

2015లో నయనతార ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీ దాన్ అనే చిత్రంలో నటించింది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయన్ జంటగా నటించారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత కాలంలో నయన్, ధనుష్ మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి. రీసెంట్ గా నయనతార తన పెళ్లి, కెరీర్, లైఫ్ గురించి బయోపిక్ తరహాలో డాక్యుమెంటరీ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నారు. 'నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే టైటిల్ తో డాక్యుమెంటరీ చిత్రాన్ని నవంబర్ 18న రిలీజ్ చేస్తారు. ఇటీవల దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. 

 

37

ఈ ట్రైలర్ నుంచి విభేదాలు మొదలయ్యాయి. ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని పాటకి సంబంధించిన 3 సెకండ్ల వీడియో ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. తన అనుమతి లేకుండా ఆ వీడియో ఉపయోగించడం ధనుష్ కి నచ్చలేదు. నయనతారపై కోర్టులో ఏకంగా 10 కోట్ల కాపీ రైట్ కేసు నమోదు చేశాడు. కొన్ని రోజుల పాటు నయన్, ధనుష్ మధ్య ఈ వ్యవహారంలో చర్చలు జరిగినట్లు టాక్. రాజీ కుదరకపోవడంతో నయన్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ధనుష్ పై ఏకంగా 3 పేజీల లేఖతో విరుచుకుపడింది. 

47
నయనతార లేఖలో ఏముంది ?

నయనతార లేఖలో ఏముంది ?

నయనతార ఈ లేఖలో ధనుష్ ని ఉద్దేశిస్తూ.. చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖ వ్యక్తి కొడుకుగా, ప్రముఖ డైరెక్టర్ సోదరుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపు పొందావు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఒంటరి పోరాటం చేస్తూ నేను ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నా. నాపై నీకు గతం నుంచి పగ ఉందని తెలుసు. కానీ ఈ స్థాయిలో నీ నీచ బుద్ధిని బయటపెడతావని అనుకోలేదు. నాకు సంబంధించిన నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చిత్రం రిలీజ్ కోసం నా సన్నిహితులు, అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ రూపొందించడం వెనుక చాలా మంది సాయం, కష్టం ఉంది. 

57

నా సినీ జీవితానికి సంబంధించిన క్లిప్స్, అనేక విషయాలు ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచాం. నా శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు కూడా ఉంటాయి. కానీ నా కెరీర్ లో కీలకమైన నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని క్లిప్స్ ని మాత్రం ఉపయోగించలేకపోయాం. దీని గురించి నిన్ను ఎన్నిసార్లు రిక్వస్ట్ చేసినా రిజెక్ట్ చేశావు. ఇది నా మనసుని బద్దలయ్యేలా చేసింది. బిజినెస్ లెక్కలు వేసుకుని, నా పై ఉన్న కక్షతో నువ్వు కేసు వేశావు. నానుమ్ రౌడీ దాన్ చిత్రానికి సంబంధించిన అన్ని క్లిప్స్ ని ఎడిటింగ్ లో తొలగించాం. నువ్వు అనుమతులు ఇవ్వలేదు కాబట్టి అలా చేయక తప్పలేదు. ఈ చిత్రంలోని పాటలు నా కెరీర్ లో ప్రత్యేకం. నా డాక్యుమెంటరీకి ఆ పాటలు బాగా సరిపోతాయి. కానీ తొలగించక తప్పలేదు. 

67

కేవలం షూటింగ్ మధ్యలో మొబైల్స్ లో తీసిన 3 సెకండ్ల క్లిప్ మాత్రం ఉపయోగించాం. అది కూడా BTS క్లిప్ మాత్రమే. మా మొబైల్స్ లో చిత్రీకరించిన క్లిప్ అది. కేవలం 3 సెకండ్ల క్లిప్ కోసం 10 కోట్ల కాపీరైట్ కేసు వేశావంటే నువ్వు ఎంతగా దిగజారిపోయావో అర్థం అవుతోంది. నీ అసలు క్యారెక్టర్ ఏంటో అందరికీ అర్థం అయింది. అభిమానుల ముందు ఒకలా నటిస్తూ లోపల నీ నీచ స్వభావాన్ని అలాగే ఉంచుకున్నావని మాకు తెలుసు. బయటకి ఒకలా, లోపల మరోలా ఉంటూ నీ అభిమానులని, ప్రపంచాన్ని మోసం చేస్తున్నావ్. పదేళ్ల క్రితం విడుదలైన చిత్రానికి సంబంధించిన 3 సెకండ్ల క్లిప్ వాడుకుంటే కేసు వేశావ్.. కనీసం మనసాక్షి అనేది కూడా లేదు. ప్రతిసారి నువ్వు నీ అహాన్ని బయటపెడుతూనే ఉన్నావ్.. నీ సాటి వ్యక్తులు ఎదిగితే జీర్ణించుకోలేని వ్యక్తిత్వం నీది. 

77

ఈ ప్రపంచం చాలా పెద్దది. అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన వ్యక్తుల పట్ల ఓర్వలేని తనం చూపించకూడదు. జరిగిన వాస్తవాలని మార్చేసి నీ ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో కొత్త కథలు అల్లుతావని నాకు తెలుసు అంటూ నయనతార తీవ్రమైన ఆరోపణలు చేసింది.  నయనతార లేఖపై, ఆమె డాక్యుమెంటరీ వివాదంపై ధనుష్ ఎలాంటి సమాధానం ఇస్తాడు అనేది ఆసక్తిగా మారింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను ఎలా కాకా పడతాడో తెలుసా? అసలు సీక్రెట్ రివిల్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..
Recommended image2
Missing Meghana Review: మిస్సింగ్‌ మేఘన మూవీ రివ్యూ.. రామ్‌ కార్తీక్‌, అంకిత్‌ కొయ్య థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Jabardasth: మెగాస్టార్ నే మెప్పించిన జబర్దస్త్ కమెడియన్, ఒక్క ఏడాది 8 సినిమాలు, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న నటుడు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved