దుబాయ్ లో ఆ హీరోతో నయనతార న్యూ ఇయర్ సెలబ్రేషన్, వైరల్ అవుతున్న ఫోటోలు
నటి నయనతార, 2025 నూతన సంవత్సరాన్ని ప్రముఖ నటుడితో దుబాయ్‌లో జరుపుకుంటున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ లేడీ నయనతార, వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఇటీవల నయనతార- ధనుష్‌ల మధ్య జరిగిన గొడవ తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. కొందరు ప్రముఖులు ధనుష్‌కు వ్యతిరేకంగా, నయనతారకు మద్దతుగా నిలిచారు. మరికొందరు నయనతారకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది, నయనతార తన సినిమా కొత్త చిత్రాల షూటింగ్స్ పూర్తి చేయడంలో నిమగ్నమైంది. ఈ సంవత్సరం నయనతార నటించిన 75వ చిత్రం 'అన్నపూర్ణ' విడుదలైంది. వచ్చే ఏడాది నయనతార ఫుల్ బిజీ. ఎందుకంటే ఆమె చేతిలో దాదాపు 8 సినిమాలు ఉన్నాయి. వాటిలో 'టెస్ట్', 'మన్నాంగట్టి సిన్స్ 1960' చిత్రాల షూటింగ్ కంప్లీట్ అయ్యింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఎంత బిజీగా ఉన్నా, భర్త, పిల్లలతో కలిసి తరచూ విదేశాలకు వెళ్లి తన సెలవులను ఆస్వాదిస్తున్న నయన్, ఈ ఏడాది నూతన సంవత్సరాన్ని ప్రముఖ నటుడి కుటుంబంతో కలిసి జరుపుకోనుంది. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు బయటకు వచ్చాయి. నటుడు మాధవన్, ఆయన భార్యతో కలిసి నయనతార, విఘ్నేష్ శివన్ ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. ఈసారి నూతన సంవత్సరం వేడుకలు నయనతార దుబాయ్‌లో జరుపుకోనుంది. కాగా మాధవన్, నయనతార 'టెస్ట్' చిత్రంలో కలిసి పనిచేశారు.
టెస్ట్ తో పాటు మలయాళంలో నటిస్తున్న 'డ్యూస్ స్టూడెంట్స్', కన్నడలో నటుడు యష్‌కు అక్కగా నటించిన 'టాక్సిక్' చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇవి కాకుండా తమిళంలో ఇంకా పేరు పెట్టని చిత్రం, 'రాక్కాయి', 'MMMN' చిత్రాలలో నటిస్తోంది. ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో 'మూకుతి అమ్మన్ 2' చిత్రం ప్రకటన వచ్చినప్పటికీ, ఈ సినిమాలో నయనతార నటిస్తున్నారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. మూకుతి అమ్మన్ పార్ట్ వన్ మంచి విజయం సాధించింది.
ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూ.. మరోవైపు కొన్ని కొత్త వ్యాపారాల్లోనూ నయనతార రాణిస్తుంది. అదే విధంగా తన భర్త దర్శకత్వం వహిస్తున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' చిత్రాన్ని కూడా నయనతార తన రౌడీ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మించింది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ప్రియుడు విగ్నేష్ శివన్ ని నయనతార 2022లో వివాహం చేసుకుంది. సరోగసి పద్దతిలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.