నయనతార నుంచి కృతి సనన్ వరకు.. వెండితెరపై సీతగా అలరించిన హీరోయిన్లు వీళ్లే.. డిటేయిల్స్
రామాయణం ఆధారంగా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న చిత్రం ‘ఆదిపురుష్’. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ అలరించబోతున్నారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు వెండితెరపై సీతగా నటించిన ఆరుగురు హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.
అలనాటి నటి, తెలుగు తొలి సినిమా నటీమణి సురభి కమలాబాయి (Surabhi Kamalabai) తెలుగు ప్రేక్షకులకు సీత పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. 1932లో వచ్చిన ‘రామ పాదుక పట్టాభిషేకం’ చిత్రంలో సీతాదేవిగా జీవించి ప్రేక్షకులను మెప్పించారు. యడవల్లి సూర్యనారాయణ రాముడిగా నటించారు. తెలుగు ప్రేక్షకులకు తొలి సీతారాములుగా గుర్తింపు దక్కించుకున్నారు.
తెలుగు, తమిళ చిత్రాలతో వెండితెరపై అలరించిన అలనాటిని పుష్పవల్లి (Pushpavalli) కూడా సీతాదేవి పాత్రలో మెప్పించారు. 1936లో వచ్చిన ‘సంపూర్ణ రామయణం’ చిత్రంలో బాల సీతగా నటించారు. ఆధ్యాత్మిక పాత్రలో ఒదిగిపోయి అప్పటి ప్రేక్షకులను అలరించారు. బాలీవుడ్ ఐకాన్ నటి రేఖాకు ఈమె తల్లి.
జానకీ పాత్రలో నటించిన మరో అలనాటి నటి త్రిపుర సుందరి (Tripura Sundari). 1994లో వచ్చిన ‘శ్రీ సీతా రామ జననం’తో వెండితెరపై అలరించారు. చక్కటి నటనతో అప్పటి ప్రేక్షకులను మెప్పించారు. ఘంటశాల బలరామయ్య దర్శకుడు. ఈ చిత్రంలో రాముడిగా అక్కినేని నాగేశ్వర్ రావు నటించారు.
సీనియర్ నటి జయప్రద తెలుగు ఇండస్ట్రీలో ఎంతటి పేరు సంపాదించుకున్నారో తెలిసిందే. Jaya prada కూడా సీతాదేవి పాత్రలో నటించి మెప్పించారు. బాపు దర్శకత్వంలో 1976లో వచ్చిన ‘సీతా కళ్యాణం’ చిత్రంలో జానకీ పాత్రలో అలరించారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
ఈ తరం హీరోయిన్లలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) సీతాదేవి ప్రాతలో నటించిన విషయం తెలిసిందే. ఈ జనరేషన్ కు సీతాగా వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2011లో వచ్చిన ‘శ్రీ రామ రాజ్యం’ చిత్రంలో నందమూరి బాలకృష్ణతో కలిసి చక్కటి నటనతో మెప్పించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నటించింది. ఇప్పటి వరకు నయనతారను ఎవరూ బీట్ చేయలేకపోయారు.
ప్రస్తుతం ‘ఆదిపురుష్’ Adipurush తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) అలరించబోతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాఘవుడిగా నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే సీతాదేవిగా కృతి మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. రేపు థియేటర్లలో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి. మరికొద్ది గంటల్లో హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.