- Home
- Entertainment
- వయసులో చిన్నవాడైన విగ్నేష్ ని పెళ్ళాడుతున్న నయనతార... అతని కంటే ఎన్నేళ్లు పెద్దదో తెలుసా!
వయసులో చిన్నవాడైన విగ్నేష్ ని పెళ్ళాడుతున్న నయనతార... అతని కంటే ఎన్నేళ్లు పెద్దదో తెలుసా!
కోలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్ నయనతార, విగ్నేష్ వివాహం నేడు ఘనంగా జరుగుతుంది. బంధువులు సన్నిహితులతో పాటు వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వివాహానికి ఓ ప్రత్యేకత ఉంది. నయనతార వరుడు విగ్నేష్ కంటే వయసులో పెద్దది.

దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న నయనతార-విగ్నేష్ శివన్ నేడు(జూన్ 9) వివాహం (Nayanathara-Vignesh shivan Marriage) చేసుకుంటున్నారు. మహాబలిపురంలో వీరి వివాహ వేడుక జరగనుంది. బంధు మిత్రులతో పాటు చిత్ర ప్రముఖులు పాల్గొననున్నారు. మొదట తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వలన వేదిక మార్చారు.
2015లో విగ్నేష్ శివన్ (Vignesh Shivan) దర్శకత్వంలో నానున్ రౌడీదాన్ మూవీ విడుదలైంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి-నయనతార హీరో హీరోయిన్స్ గా నటించారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటి నుండి వీళ్ళ ప్రేమ ప్రయాణం మొదలైంది. పేరుకు ప్రేమికులే అయినా భార్యాభర్తలుగా మెలిగారు.
పండుగలు, పుట్టినరోజులు కలిసి జరుపుకునేవారు. ప్రత్యేక సందర్భాల్లో బహుమతులు ఇచ్చుకోవడం చేసేవారు. ఇద్దరిలో ఎవరి బర్త్ డే అయినా విహారానికి చెక్కేసేవారు. అలాగే ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించాయి. కొత్త అల్లుడి మాదిరి కేరళలోని నయనతార ఇంటికి పండుగలు, పబ్బాలకు విగ్నేష్ వెళతాడు. అలాగే నయనతార విగ్నేష్ ఇంటికి తరచూ వస్తూ ఉండేవారు.
ఇక గత రెండేళ్లుగా నయనతార(Nayanatara)-విగ్నేష్ పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పలుమార్లు మీడియా ఈ విషయంపై స్పష్టత కోరింది. ఓ సందర్భంలో విగ్నేష్ శివన్ మాట్లాడుతూ... ప్రస్తుతం మేము డేటింగ్ ఎంజాయ్ చేస్తున్నాం. అది బోర్ కొట్టాక పెళ్లి చేసుకుంటాం అని చెప్పాడు. ఆయన కామెంట్స్ నేపథ్యంలో అసలు వీళ్లకు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా లేదా అనే సందేహాలు కలిగాయి.
సదరు అనుమానాలకు తెరదించుతూ నేడు పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. ఇక వీరి బంధంలో మరొక భిన్నమైన విషయం చోటు చేసుకుంది. నయనతార భర్త విగ్నేష్ కంటే వయసులో పెద్దది. 18 సెప్టెంబర్ 1985 విగ్నేష్ పుట్టిన రోజు కాగా, 18 నవంబర్ 1984లో నయనతార జన్మించారు. అంటే దాదాపు ఓ ఏడాది నయనతార విగ్నేష్ కంటే పెద్దది.
గతంలో ప్రియాంక చోప్రా లాంటి హీరోయిన్స్ వయసులో చిన్నవాళ్లను భర్తగా తెచ్చుకున్నారు. ప్రియాంక భర్త నిక్ జోనాస్ ఆమె కంటే ఏకంగా పదేళ్లు చిన్నవాడు కావడం విశేషం. ప్రియాంకతో పోల్చుకుంటే నయనతార జంట చాలా బెటర్.
కాగా గతంలో నయనతార హీరో శింబు, ప్రభుదేవాలను ప్రేమించారు. వీరిద్దరితో ఆమె బంధం పెళ్లి వరకూ వెళ్లి ఆగిపోయింది. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అలా విగ్నేష్ శివన్ తో నయనతారకు ఎప్పుడో రాసి పెట్టి ఉంది. అందుకే ఆమె వివాహం నేడు ఎలా నిశ్చయించబడినది.