MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నవీన్‌ పొలిశెట్టి కమ్‌ బ్యాక్‌.. `అనగనగా ఒక రాజు` ప్రీ వెడ్డింగ్ టీజర్ ఎలా ఉందంటే?

నవీన్‌ పొలిశెట్టి కమ్‌ బ్యాక్‌.. `అనగనగా ఒక రాజు` ప్రీ వెడ్డింగ్ టీజర్ ఎలా ఉందంటే?

కామెడీ హీరో నవీన్‌ పొలిశెట్టి ఇటీవల చేతికి గాయంతో బ్రేక్‌ తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కమ్‌ బ్యాక్‌ అవుతున్నాడు. మరోసారి జాతిరత్నం అనిపించుకోబోతున్నారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 26 2024, 11:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కామెడీ హీరోల్లో సరికొత్త సంచలనంగా మారారు నవీన్‌ పొలిశెట్టి. `జాతిరత్నం`తో టాలీవుడ్‌లోనే పాపులర్‌ అయ్యారు. నిజంగానే తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక జాతిరత్నం దొరికిందని అంతా ఫీలయ్యారు. గతేడాది `మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`తో అలరించారు. లేడీ సూపర్‌ స్టార్‌ అనుష్క శెట్టికి జోడీగా నటించి మెప్పించాడు. తనదైన కామెడీతో నవ్వించడంతోపాటు, ఎమోషనల్ గా కట్టిపడేశాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే ఆ మధ్య అనుకోకుండా ప్రమాదానికి గురయ్యారు. తన చేయికి గాయమైనట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. కొంత కాలం బ్రేక్‌ తీసుకున్నట్టు తెలిపారు. రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రాబోతున్నట్టు వెల్లడించారు. ఇటీవల మళ్లీ కమ్‌ బ్యాక్‌ అయ్యారు. పలు ఈవెంట్లలోనూ మెరిశాడు నవీన్‌ పొలిశెట్టి. ఇక ఇప్పుడు హీరోగానూ కమ్‌ బ్యాక్‌ అవుతున్నారు. తాజాగా తన ఆగిపోయిన సినిమాని మళ్లీ పట్టాలెక్కించాడు. ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. తన నూతన చిత్రం 'అనగనగా ఒక రాజు'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు.

35

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. నవీన్ పొలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్‌ను నిర్మాతలు ఆవిష్కరించారు. నవీన్ పొలిశెట్టి మాదిరిగానే ఈ వీడియో ఎంతో ప్రత్యేకంగా, పూర్తి వినోదాత్మకంగా ఉంది.
 

45

ప్రీ వెడ్డింగ్ వీడియోలో నవీన్ పొలిశెట్టి పోషించిన రాజు పాత్ర తన వివాహానికి సిద్ధమవుతున్నట్లు చూపించారు. రాజు గారి పెళ్ళి అంటే ఎలా ఉండాలి? అంటూ భోజనాల దగ్గర చమ్మక్ చంద్ర చేసిన హడావుడి నవ్వులు పూయించింది.

ఇక అనంత్ అంబానీ వివాహానికి హాజరైన హాలీవుడ్ ప్రముఖుల ఫోన్ నెంబర్ల కోసం, నవీన్ ఏకంగా ముఖేష్ అంబానీకి ఫోన్ చేసి మాట్లాడినట్లు చూపించడం కడుపుబ్బా నవ్వించింది. అలాగే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ సమయంలో వధువుగా మోస్ట్ హ్యాపెనింగ్ నటి మీనాక్షి చౌదరి కనిపించారు. ఈ ఫోటోషూట్ సమయంలో కూడా నవీన్ పోషించిన రాజు పాత్ర నవ్వులు పంచింది.
 

55

రాజుగా నవీన్ పొలిశెట్టి మార్క్ హాస్యం, విజువల్స్, సంగీతం ఈ ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్ లో హైలైట్‌గా నిలిచాయి. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ముఖ్యంగా నవీన్ కామెడీ టైమింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే ఫోటోషూట్ సమయంలో మీనాక్షి చౌదరితో నవీన్ కెమిస్ట్రీ బాగా కుదిరింది.  `అనగనగా ఒక రాజు` చిత్రానికి నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 2025లో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.  

read more: `పుష్ప 2` కలెక్షన్ల ప్రకటన, రేవంత్‌ రెడ్డికి కౌంటరా? వివాదంలో కొత్త కోణం, వెర్రి పుష్పం ఎవరంటే?

also read: పొలిటికల్ గేమ్‌లో అల్లు అర్జున్‌ బలిపశువా? వాటిని డైవర్ట్ చేయడం కోసమే రేవంత్‌ రెడ్డి గేమ్‌ ? తెరవెనుక నిజాలు

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha Baby Bump: బేబీ బంప్ ఫోటోతో సిక్స్ ప్యాక్‌ కి గుడ్ బై చెప్పిన సమంత.. మళ్లీ రెండేళ్లు బ్రేక్‌
Recommended image2
Anushka: ఇకపై టాలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్‌ సమంత.. మా ఇంటి బంగారంతో అనుష్క రికార్డ్‌ బ్రేక్‌
Recommended image3
Lenin Trailer Review: సాలిడ్‌ కంటెంట్‌తో వస్తోన్న అఖిల్‌, ఫస్ట్ హిట్‌ పక్కా.. లెనిన్‌ ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved