- Home
- Entertainment
- Nani New Look: కొత్త అవతారాలు ఎత్తుతున్ననేచురల్ స్టార్, సినిమాకో కొత్త లుక్ ట్రై చేస్తున్న నాని.
Nani New Look: కొత్త అవతారాలు ఎత్తుతున్ననేచురల్ స్టార్, సినిమాకో కొత్త లుక్ ట్రై చేస్తున్న నాని.
నానీ నిజంగా నేచురల్ స్టార్ అనిపించుకుంటున్నాడు. ప్రయోగాలు బాగా కలిసొస్తున్నాయి. సక్సెస్ లు ఇస్తున్నాయి. అందుకే కథ విషయంలో డిఫరెంట్ గా ఆలోచిస్తున్న నానీ.. గెటప్ ల విషయంలో కూడా ప్రయోగాలు చేస్తున్నాడు. డిఫరెంట్ లుక్స్ తో ఆడియన్స్ ను అలరించాలి అని ప్లాన్ చేశాడు నానీ.

తన ప్రతి సినిమా అంతకు.. ముందు సినిమాకంటే భిన్నంగా ఉండాలని చూస్తున్నాడు నేచురల్ స్టార్ నాని.. పాత్రకి తగిన విధంగా ఎప్పటికప్పుడు కొత్తగా ప్రేక్షకులకు కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. దీన్ని సక్సెస్ ఫార్ములాగా మార్చుకుని దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్.
మొదటి నుంచి కూడా నాని లుక్స్ పరంగా ఎక్స్ పెర్మెట్స్ చేయకుండా నార్మల్ గా చేసుకుంటూ వెళ్ళాడు. పక్కింటి అబ్బాయిలా.. మన కాలనీ కుర్రాడిలా కనిపిస్తూ, కథలో మాత్రమే కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చాడు. నేచురల్ స్టార్ గా ఆడియన్స్ నుంచి మంచి పేరు సంపాధించుకున్నాడు. అయితే అలా చేయడమే ఆయనకు రాను రాను మైనస్ గా మారింది.
మూస ధోరణిలో పడ్డాడు నానీ అంటూ మోనాటనీ స్టార్ అనే పేరు కూడా వినిపించింది. దాంతో తను కూడా మారాలి అని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఈ మధ్య కాలంలో సినిమా సినిమాకి లుక్ మార్చేస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా ఈమధ్య వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నాని చాలా డిఫరెంట్ లుక్ తో డీసెంట్ గా కనిపించాడు.
ఆ సినిమా లో ఆయన లుక్.. ఈ సినిమా సక్సెస్ కు మెయిన్ రీజన్ అయ్యింది అని చెప్పచ్చు. ఇక ఈ సినిమాతో నానీకి బాగా ధైర్యం వచ్చింది. అందుకే సినిమా సినిమాకు లుక్ ను ఛేంచ్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడు నానీ.
దాన్నే సక్సెస్ ఫార్ములాగా మార్చుకున్నాడు. ఇక త్వరలో రాబోతున్నా అంటే .. సుందరానికీ మూవీ లో ఇంతకంలే వింతగా కనిపించబోతున్నాడు. అచ్చమూన బ్రహ్మణ పాత్రలో.. మీసాలు లేకుండా అమాయకత్వంతో కూడిన కొత్త లుక్ తో కనిపించనున్నాడు. అది కూడా పంచె కట్టులో నానీ అదరిపోయే గెటప్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. అంటే సుందరానికి ప్రమో వీడియోతో పాటు.. పోస్టర్ లో నానీ చాలా కొత్తగా వింతగా కనిపించారు.
ఇక నానీ నటిస్తోన్న మరో సినిమా దసరా. ఈ సినిమాలో నానీ తన కెరీర్లో ఎప్పుడూ కనిపించనంత మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు.. లుక్ చూస్తే తెలుస్తోంది. సంబంధించిన పోస్టర్లోను ఆయన లుక్ పూర్తి భిన్నంగా ఉంది. ఊరమాస్ లుక్ తో నానీ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు.
ఈ ఏడాదిలోనే రానున్న ఈ రెండు సినిమాలతో నాని మరోసారి హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఇందులో విశేషం ఏంటీ అంటే.. ఒకటి పక్కా క్లాస్ క్యారెక్టర్ ఒకటి పక్కా మాస్ క్యారెక్టర్. ఇందలో జనాలు ఏ పాత్రను యాక్సప్ట్ చేస్తారో చూడాలి. ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి.
అయితే అంతకు ముందు కృష్ణార్జున యుద్దం సినిమాతో నానీ మాస్ క్యారెక్టర్ ను ట్రై చేశాడు. కాన అది వర్కౌట్ అవ్వలేదు. ఈసారి దసరా సినిమాతో మరోసారి మాస్ ను టచ్ చేస్తున్నాడు. ఈసారి కనుకు ఫలితం తేడా కొడితే.. ఈసారి మాస్ జోలికి వెళ్ళడానికి నానీ ఆలోచిస్తాడు అనడంతో ఏమాత్రం డౌట్ లేదు.