శ్రీశ్రీ నుంచి కాసర్ల శ్యామ్ వరకు జాతీయ అవార్డు సాధించిన గేయ రచయితలు ఎవరో తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమ ఇప్పటి వరకు వివిధ విభాగాలలో ఎన్నో జాతీయ అవార్డులను పొందింది. ఈక్రమంలో తెలుగు పాటలకు మాత్రం 5 సార్లు నేషనల్ అవార్డు వరించింది. ఇప్పటి వరకూ ఈ గౌరవం పొందిన తెలుగు రచయితలు ఎవరో తెలుసా?

జాతీయ అవార్డు సాధించిన తెలుగు రచయితలు
భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఇప్పటి వరకు 71 ఎడిషన్లుగా ప్రకటించబడ్డాయి. కొన్ని సంవత్సరాల్లో ఈ విభాగంలో పురస్కారాలు ఇవ్వకపోయినా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను అవార్డులను ప్రకటించింది. ఈ జాబితాలో తెలుగు సినిమా ‘బలగం’ నుంచి ఒక ప్రత్యేకమైన పాటకు గుర్తింపు లభించింది. ఈ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు..’ పాటకు గేయ రచయిత కాసర్ల శ్యామ్ ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఈ పురస్కారాన్ని అందుకున్న ఐదవ తెలుగు కవిగా ఆయన నిలిచారు. గతంలో ఈ గౌరవాన్ని పొందిన టాలీవుడ్ గేయ రచయితలు ఎవరంటే?
KNOW
శ్రీశ్రీ - అల్లూరి సీతారామరాజు
జాతీయ అవార్డు విన్నర్స్ లో పాటల రచయితలది ప్రత్యేక స్థానం. తెలుగు సినీపరిశ్రమకు ఈ విభాగంలో ఫస్ట్ జాతీయ అవార్డ్ 1974లో వచ్చింది. ఆ ఏడాది సూపర్ స్టార్ కృష్ణ హీరోగా రిలీజ్ అయిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలోని ‘తెలుగు వీర లేవరా..’ పాటకుగాను జాతీయ అవార్డు వచ్చింది. ఈ పాట రచయిత దిగ్గజ కవి శ్రీశ్రీకి ఉత్తమ గేయ రచయిత పురస్కారం దక్కింది.
వేటూరి సుందరరామ్మూర్తి - మాతృదేవోభవ
ఇక ఆతరువాత తెలుగు సినిమా పాలకు 20 ఏళ్ల తరువాత నేషనల్ అవార్డ్ వచ్చింది. మాతృ దేవో భవ’ సినిమాలో రాలి పోయే పువ్వా.. నీకు రాగాలేందుకే..’ అంటూ వేటూరి రాసిన గీతానికి నేషనల్ అవార్డు వరించింది. ఈ గేయ రచయిత సుందరరామ్మూర్తి 1993లో బెస్ట్ లిరిక్ రైటర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు.
సుద్దాల అశోక్ తేజ - ఠాగూర్
వేటూరి తరువాత నేషనల్ అవార్డ్ అందుకున్న మరో రచయిత సుద్దాల అశోక్ తేజ. ఈయన రాసిన ‘నేను సైతం ప్రపంచాగ్నికి..’ పాటకు 2003లో కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గేయరచయితగా జాతీయ పురస్కారం ఇచ్చి గౌరవించింది. చిరంజీవి హీరోగా నటించిన ‘ఠాగూర్’ సినిమాలోని ఈ పాట అప్పట్లో యువతను ఉత్తేజ పరచడం తో పాటు ఉర్రూతలూగించింది.
చంద్రబోస్ - కొండపొలం
ఠాగూర్ సినిమా తరువాత 18 ఏళ్లకు మళ్ళీ తెలుగు పాటకు జాతీయ అవార్డు లభించింది. 2021 లో రిలీజ్ అయిన కొండపొలం’ సినిమాలో చంద్రబోస్ రాసిన ధమ్ ధమ్ ధమ్.. పాటను మెచ్చి, 2021లో ఉత్తమ గేయ రచయితగా జాతీయ పురస్కారాన్ని అందజేశారు. చంద్రబోస్ అంతకు ముందే ప్రపంచ అత్యున్నత ఆస్కార్ పురస్కారం కూడా అందుకున్నాడు. ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటకుగాను చంద్రబోస్ ఆస్కార్ అందుకున్నారు.
కాసర్ల శ్యామ్ - బలగం
ఇక ఈసారి ఎక్కువ గ్యాప్ లేకుండా వెంటనే మరో తెలుగు పాటను జాతీయ పురస్కారం వరించింది. ఏడాది గ్యాప్ తోనే బలగం సినిమాలో ఊరు పల్లెటూరు…పాటకుగాను ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్ 2023 జాతీయ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డులతో తెలుగు గేయ రచయితల ప్రతిభను దేశవ్యాప్తంగా గుర్తించారు. ముఖ్యంగా గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే ‘ఊరు పల్లెటూరు..’ పాట దేశవ్యాప్తంగా ఆదరణ పొందింది. జాతీయ అవార్డుతో కాసర్ల శ్యామ్ కు వచ్చిన ఈ గౌరవం, తెలుగు గీత రచనకు మరో మైలురాయిగా నిలిచింది.
Thank you so much Akka https://t.co/FOcTOEamJU
— Kasarla Shyam (@LyricsShyam) August 2, 2025