- Home
- Entertainment
- ఉదయనిధి పెళ్ళిలో వంట మనిషిగా పనిచేసిన నేషనల్ అవార్డు విన్నర్, గుండె బరువెక్కించే విషయాలు
ఉదయనిధి పెళ్ళిలో వంట మనిషిగా పనిచేసిన నేషనల్ అవార్డు విన్నర్, గుండె బరువెక్కించే విషయాలు
ఆయన దేశం మెచ్చిన నటుడు. యాక్టింగ్‌లో విశేష ప్రశంసలు అందుకున్నారు. ఏకంగా జాతీయ అవార్డు అందుకున్నారు. అలాంటి నటుడు హీరో, మంత్రి ఉదయనిధి స్టాలిన్ పెళ్లిలో వంటలు వండటం విశేషం.

అప్పు కుట్టి
మంత్రి, హీరో ఉదయనిధి స్టాలిన్ ఇంట్లో వంటలు చేసిన జాతీయ నటుడు ఎవరో కాదు అప్పుకుట్టి. మరి వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ఉదయనిధి స్టాలిన్ పెళ్లిలో ఎందుకు వంటలు చేయాల్సి వచ్చింది? అసలేం జరిగింది? ఆ కథేంటి అనేది తెలుసుకుందాం.
అప్పుకుట్టి అసలు పేరు శివ బాలన్. తూతుకుడి జిల్లా నాథన్ కినరు గ్రామంలో జన్మించారు. సినిమాల్లోకి వచ్చాక అప్పుకుట్టిగా మారారు. `మరుమలర్చి` ఆయన తొలి చిత్రం అయినప్పటికీ, `దీపావళి` సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తర్వాత `ఒన్బతు రూపాయ్ నోటు`, `నీ నాన్ నిలా` వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.
`వెన్నెల కబడి కుజు` సినిమా సూరికి పరోటా సూరి అనే గుర్తింపు తెచ్చిపెట్టినట్లే శివబాలన్‌కు అప్పుకుట్టిగా గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలో అప్పుకుట్టి పాత్రలో నటించారు. ఈ సినిమా విజయంతో వరుసగా సినిమాల్లో నటించారు. కామెడీ పాత్రలే కాకుండా హీరోగా కూడా నటించారు. `అజగర్సామియిన్ కుతిరై` చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు.
వీటితోపాటు అజిత్ తో `వీరం`, `వేదాళం` చిత్రాల్లో కూడా నటించారు. తమిళంతో పాటు మలయాళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన నటించిన `పుట్టింటనాళ్ వాళ్తుక్కళ్` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అప్పుకుట్టి ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాహంలో వంటలకు సహాయంగా వంట మాస్టర్‌గా పనిచేశానని చెప్పి షాకిచ్చారు.
చెన్నైకి వచ్చిన కొత్తలో హోటల్‌లో సర్వర్‌గా పనిచేశాను. అక్కడి నుంచి క్యాటరింగ్ సర్వీస్‌కు వెళ్లాను. ఉదయనిధి స్టాలిన్ పెళ్ళిలో నేను వంటల మాస్టర్‌గా పనిచేశాను. అక్కడ జనం ఎక్కువగా వస్తుండడంతో నా వల్ల కాదని చెప్పాను. కానీ నువ్వే వండాలని చెప్పారు. అది అప్పుడు కష్టం అయినా, ఒక మెమొరీగా నిలిచింది.
అప్పు కుట్టి గురించి ఆసక్తికర విషయాలు
ఆ తర్వాతే సినిమా అవకాశం వచ్చింది. అదీ పెద్దగా ఏమీ కాదు. కొన్ని సన్నివేశాలు మాత్రమే. `మరుమలర్చి`, `సొల్ల మరంత కథై`, `గిల్లి`, `మాయావి`, `అజగియ తమిళ్ మగన్`, `దీపావళి` వంటి చిత్రాల్లో నటించాను. కానీ, `వెన్నిలా కబడి కుళు` మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో అత్తగారి మట్టను విరిచే సన్నివేశం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న నేను నటించిన `మరుమలర్చి` సినిమా చూశారు. కానీ, పెద్దగా రియాక్ట్ కాలేదు` అని చెప్పారు. ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదనే ప్రశ్నకు సమాధానమిస్తూ, ఇంకా సమయం రాలేదు. అమ్మాయిని చూస్తున్నానని అప్పుకుట్టి చెప్పారు.
read more: బాలకృష్ణ ఫస్ట్ టైమ్ మల్టీస్టారర్ చేయబోతున్నారా? పూనకాలు తెప్పించే వార్త వైరల్
also read: పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లోడింగ్? డిప్యూటీ సీఎం ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి?