- Home
- Entertainment
- మైసూర్ అపార్ట్మెంట్ లో నరేష్, పవిత్ర లోకేష్... ఆమెను చెప్పుతో కొట్టబోయిన రమ్య... పోలీసుల ఎంట్రీ!
మైసూర్ అపార్ట్మెంట్ లో నరేష్, పవిత్ర లోకేష్... ఆమెను చెప్పుతో కొట్టబోయిన రమ్య... పోలీసుల ఎంట్రీ!
నరేష్(Naresh), పవిత్ర లోకేష్, రమ్య రఘుపతిల రచ్చ అంతకంతకూ పెరుగుతూ పోతుంది. తాజాగా మైసూర్ వెళ్లిన నరేష్, పవిత్ర లోకేష్ లను రమ్య అటాక్ చేసినట్లు సమాచారం అందుతుంది. ఆమె ఎంట్రీతో గొడవ చోటు చేసుకోగా... పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగినట్లు సమాచారం.

Naresh-Pavitra Lokesh
కొద్దిరోజులుగా పవిత్ర లోకేష్, నరేష్ పెళ్లి వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ జంట క్లారిటీ ఇవ్వడం జరిగింది. పవిత్ర లోకేష్ మాట్లాడుతూ నరేష్ ని నేను వివాహం చేసుకోలేదు. అయితే మేమిద్దరం సహజీవనం చేస్తున్నాము. మా బంధం గురించి కృష్ణ గారికి తెలుసు. ఆయన మద్దతు మాకు ఉంది. కృష్ణగారితో పాటు నరేష్ నేను ఫార్మ్ హౌస్ లో కలిసి ఉంటున్నామని చెప్పారు.
Naresh-Pavitra Lokesh
అలాగే నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి(Ramya Raghupathi)పై ఆమె ఆరోపణలు చేశారు. ఆమె ప్రవర్తన నేను గమనించాను. రమ్య మంచి భార్య అయితే ఆ కుటుంబం ఆమెతో ఉండేది. రమ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో నరేష్ విడిపోయారు. అలాగే నరేష్ చాలా మంచి వ్యక్తి. మోసం చేయడం, అబద్ధాలు ఆడడం ఆయనకు తెలియదు అంటూ ఆమె కన్నడ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు.
Naresh-Pavitra Lokesh
నరేష్ సైతం రమ్య రఘుపతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకంగా ఆమెకు అక్రమ సంబంధాలు ఉన్నాయని, ఆర్ధిక నేరాలకు పాల్పడింది అన్నారు. ఆమెకు రూ. 10 లక్షలు ఇచ్చినట్లు చెప్పాడు. డబ్బుల కోసం కుటుంబాన్ని వేధించింది అన్నారు. ఆమె నుండి నాకు ప్రాణహాని కూడా ఉందని నరేష్ ఆరోపించడం జరిగింది.
Naresh-Pavitra Lokesh
నరేష్, పవిత్ర లోకేష్(Pavitr Lokesh) ఆరోపణలకు రమ్య కౌంటర్లు ఇచ్చారు. పవిత్ర లోకేష్ కారణంగానే నరేష్ తనకు దూరమైనట్లు చెప్పారు. నరేష్, పవిత్రలపై ఆమె వ్యక్తిగత ఆరోపణలు చేయడం జరిగింది. తనకు విడాకులు ఇవ్వలేదని, తనకు ఇవ్వాల్సిన మైంటైనెన్సు విషయంలో అవకతవకలు ఉన్నాయన్నారు.
Naresh-Pavitra Lokesh
నరేష్, రమ్య మధ్య పరస్పర ఆరోపణలు జరుగుతుండగా నేడు మైసూర్ లో నాటకీయ సంఘటన చోటు చేసుకుంది. పవిత్ర లోకేష్, నరేష్ ఓ అపార్ట్మెంట్ లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న రమ్య అక్కడికి వెళ్లారు. వారిద్దరూ బయటికి రావాలంటూ ఆమె డిమాండ్ చేశారు.
Naresh-Pavitra Lokesh
అపార్ట్మెంట్ డోర్ ముందు పవిత్ర బైఠాయించడం జరిగింది. ఈ మధ్యలో మీడియా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అక్కడి నుండి నరేష్, పవిత్రలను బయటికి తీసుకెళ్లారు. రమ్య లోకేష్ ని చూస్తూ నరేష్ విజిల్స్ వేయడం ఆసక్తికరం.
Naresh-Pavitra Lokesh
నరేష్, పవిత్రలపై సీరియస్ అయిన రమ్య చెప్పు తీసుకొని కొట్టబోయింది. నరేష్ స్లొగన్స్ చేస్తూ, విజిల్స్ వేస్తూ వెళ్లిపోయారు. కన్నడ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.