MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మాజీ మంత్రికి కూతురు వరస కెజిఎఫ్ ప్రశాంత్ నీల్ కి స్వయానా అక్క... నరేష్ వైఫ్ రమ్యది మామూలు బ్యాగ్రౌండ్ కాదు! 

మాజీ మంత్రికి కూతురు వరస కెజిఎఫ్ ప్రశాంత్ నీల్ కి స్వయానా అక్క... నరేష్ వైఫ్ రమ్యది మామూలు బ్యాగ్రౌండ్ కాదు! 

నటుడు నరేష్ కేంద్రంగా మూడు ముక్కలాట నడుస్తుంది. ఆయన జీవితంలోకి వచ్చిన ఇద్దరు మహిళల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. నరేష్, పవిత్ర లోకేష్ ఒకవైపు రమ్య రఘుపతి మరొకవైపు చేరి వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు. గత రెండు మూడు రోజులుగా ఈ ముగ్గురు వ్యవహారం రచ్చ రచ్చగా మారింది.

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 02 2022, 05:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Naresh

Naresh

నటి పవిత్ర లోకేష్ ని నరేష్(Naresh) నాలుగో వివాహం చేసుకుంటున్నారనే వార్తలతో వివాదాలు మొదలయ్యాయి. ఒకప్రక్క పెళ్లి వార్తలు వస్తున్న నేపథ్యంలో పవిత్ర లోకేష్, నరేష్ మహాబలేశ్వర్ జంటగా వెళ్లారు. ఈ క్రమంలో వారికి రహస్య వివాహం జరిగిందన్న కథనాలకు బలం చేకూరింది. చివరకు మౌనం వీడి నరేష్, పవిత్ర ఒక క్లారిటీ ఇచ్చారు. పవిత్ర లోకేష్ నటుడు నరేష్ తో సహజీవనం చేస్తున్నట్లు వెల్లడించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27


ఇదే క్రమంలో మూడవ భార్య రమ్య రఘుపతి(Ramya Raghupathi)పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె సరిగా ఉంటే నరేష్ తో కలిసి ఉండేది. ఆమె ప్రవర్తన సరిగా లేని కారణంగానే వదిలేశారంటూ పవిత్ర లోకేష్ తెలియజేశారు. నరేష్ సైతం రమ్య తన వద్ద డబ్బులు తీసుకున్నట్లు , ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేశారు. ఇంకా ఘోరమైన వ్యక్తిగత విషయాలు బయటపెట్టడం జరిగింది. 

37

నరేష్, పవిత్ర లోకేష్ వరుస దాడుల నేపథ్యంలో రమ్య సీరియస్ అయ్యారు. ఆమె తిరిగి నరేష్, పవిత్ర లోకేష్(Pavitra Lokesh) లను టార్గెట్ చేయడం జరిగింది. వారిద్దరి క్యారెక్టర్స్ పై ఆమె కొన్ని ఆరోపణలు చేశారు. ఆ పరస్పర ఆరోపణలు ఆగడం లేదు. కన్నడ పరిశ్రమలో కూడా ఇది పెద్ద రచ్చ అయి కూర్చుంది. రమ్య కన్నడ మీడియాతో పలుమార్లు మాట్లాడారు. 
 

47

ఈ క్రమంలో అసలు ఈ రమ్య ఎవరని ఆరాతీస్తే ఆమెకు చాలా పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది. రమ్య స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా, మడకశిర మండలం, మణికంఠ పురం అనే గ్రామం. కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి  రమ్య తండ్రి వరుసకు అన్నదమ్ములు అవుతారు. రమ్య కుటుంబానికి బెంగుళూరులో పెద్ద హోటల్ కూడా ఉంది. రమ్య ఫాదర్, కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) ఫాదర్ స్వయానా అన్నదమ్ములు.

57
ramya

ramya

ప్రశాంత్ నీల్ కి రమ్య సొంత సిస్టర్ అవుతారు. రమ్య తండ్రితో పాటు ప్రశాంత్ నీల్ కుటుంబం ఎప్పుడో బెంగుళూరులో స్థిరపడ్డారు. ఈ కుటుంబానికి సినిమా నేపథ్యం ఉంది. ఈ క్రమంలో రమ్య, నరేష్ మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా పెళ్ళికి దారితీయడం జరిగింది. కొన్నాళ్ళు కలిసున్న ఈ జంట మనస్పర్థలతో విడిపోయారు.

67

ఇక ఓ ఏడాది క్రితం రమ్య రఘుపతి ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొన్నారు. కృష్ణ కుటుంబ సభ్యురాలిగా ఆమె పలువురి వద్ద డబ్బులు వసూలు చేశారని కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారం పెద్ద న్యూస్ కావడంతో నరేష్ మీడియాకు వివరణ ఇచ్చారు. రమ్య ఆర్ధిక నేరాలకు నాకు సంబంధం లేదు. ఆమెతో విడిపోయి చాలా కాలం అవుతుందని వివరణ ఇచ్చారు.

77

నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లి వార్తలతో రమ్య పేరు మరలా వార్తలకు ఎక్కింది. మరోవైపు పవిత్ర లోకేష్ మొదటి భర్త సుచేంద్ర ప్రసాద్ ఆమెపై తీవ్ర ఆరోపణలు చేయడం విశేషం. పవిత్ర లోకేష్ కి చాలా మందితో సంబంధాలు ఉన్నాయి. నరేష్ తో కూడా ఆమె ఎక్కువ కాలం ఉండదంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇక పవిత్ర సుచేంద్ర నేను సహజీవనం చేశాను, వివాహం చేసుకోలేదని వెల్లడించిన విషయం తెలిసిందే. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రశాంత్ నీల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ashu Reddy: అష్షు రెడ్డి ఎంగేజ్మెంట్ లో బిగ్ ట్విస్ట్.. తెరమీదకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్, విషయం ఏంటంటే?
Recommended image2
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image3
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved