- Home
- Entertainment
- పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్.. కూలీ చూశాను, వార్ 2 చూడలేదు.. వైరల్ అవుతున్న క్రేజీ హీరో కామెంట్స్
పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్.. కూలీ చూశాను, వార్ 2 చూడలేదు.. వైరల్ అవుతున్న క్రేజీ హీరో కామెంట్స్
నారా రోహిత్ నటించిన సుందరకాండ చిత్రం త్వరలో రిలీజ్ అవుతోంది. దీనితో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న నారా రోహిత్ తన పొలిటికల్ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నారా రోహిత్ సుందరకాండ మూవీ
నారా రోహిత్ నటించిన సుందరకాండ చిత్రం ఆగష్టు 27న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నారా రోహిత్ వరుసగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రమోషనల్ ఈవెంట్స్ లో నారా రోహిత్ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి చెప్పిన నారా రోహిత్ తాజాగా తన పొలిటికల్ ఎంట్రీపై కామెంట్స్ చేశారు.
KNOW
వార్ 2 చూడలేదు అని కామెంట్స్
ఎన్టీఆర్ వార్ 2 మూవీపై నారా రోహిత్ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. తాను కూలీ చిత్రం చూశానని, వార్ 2 చూడలేదని ఓపెన్ గా చెప్పేశారు. నారా రోహిత్ అంటే నందమూరి ఫ్యామిలీతో బంధుత్వం ఉన్న వ్యక్తే. స్వయానా నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామమూర్తి నాయుడు కొడుకే నారా రోహిత్. అలాంటి నారా రోహిత్ వార్ 2 చూడలేదని కామెంట్స్ చేస్తే సహజంగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కూలీ మూవీ పర్వాలేదు
నారా రోహిత్ మాట్లాడుతూ.. తాను కూలీ మూవీ చూశానని, అక్కడక్కడా నచ్చింది అని తెలిపారు. ఓవరాల్ గా మూవీ పర్వాలేదు అని అన్నారు. వార్ 2 చూడలేదా అని ప్రశ్నించగా చూడలేదు అని సమాధానం ఇచ్చారు. నా ఫ్రెండ్స్ అంతా కూలీకి వెళదాం అని అన్నారు. అందుకే కూలీ మూవీ చూశాను. టైం దొరికితే వార్ 2 కూడా చూస్తాను అని అన్నారు.
పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్
ఇటీవల తాను ట్రైలర్ నచ్చకపోతే ఆ సినిమాలు చూడట్లేదని అన్నారు. ప్రస్తుతం ట్రోలింగ్ అనేది సహజంగా మారిపోయింది అని, బెస్ట్ అవుట్ పుట్ ఇస్తే ఎలాంటి ట్రోలింగ్ సినిమాని ఏమీ చేయలేదని అన్నారు. ఇక తాను పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న అంశంపై కూడా ఓపెన్ అయ్యారు. తన నియోజకవర్గంలో ప్రజలతో, కార్యకర్తలతో టచ్ లో ఉంటున్నానని నారా రోహిత్ అన్నారు.
రెండూ బ్యాలెన్స్ చేస్తా
తన వద్దకు ఏదైనా ప్రజల సమస్య వస్తే ఎమ్మెల్యేలతో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని నారా రోహిత్ అన్నారు. తాను ఏడాదికి చేస్తున్నది 2 సినిమాలే అని.. కాబట్టి పాలిటిక్స్ ని, మూవీస్ ని రెండింటిని బ్యాలెన్స్ చేయగలనని నారా రోహిత్ అన్నారు. నారా రోహిత్ తండ్రి రామమూర్తి నాయుడు గతంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.