MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి 'విశ్వంభర' గ్లింప్స్ వచ్చేసింది.. వామ్మో ఆ గ్రాఫిక్స్ చూశారా, అప్పుడు ట్రోల్ చేశారు కానీ

చిరంజీవి 'విశ్వంభర' గ్లింప్స్ వచ్చేసింది.. వామ్మో ఆ గ్రాఫిక్స్ చూశారా, అప్పుడు ట్రోల్ చేశారు కానీ

మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర నుంచి లేటెస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది. ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు కానుకగా ముందుగానే చిత్ర యూనిట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 21 2025, 06:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విశ్వంభర మూవీ లేటెస్ట్ గ్లింప్స్ 
Image Credit : UV Creations

విశ్వంభర మూవీ లేటెస్ట్ గ్లింప్స్ 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం నుంచి అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ అయింది. చిరంజీవి బర్త్ డే కానుకగా ఈ గ్లింప్స్ ని తీసుకువచ్చారు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రం ఆలస్యం అవుతుండడానికి కారణాన్ని స్వయంగా చిరంజీవి వివరించారు. సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫిక్స్ ఉంటాయని, వాటిని అద్భుతంగా తీర్చిదిద్దడం కోసమే టైం పడుతోంది అని చిరంజీవి తెలిపారు. ఈ క్రమంలో విశ్వంభర గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గ్రాఫిక్స్ ని సీరియస్ గా తీసుకున్న టీమ్ 
Image Credit : UV Creations

గ్రాఫిక్స్ ని సీరియస్ గా తీసుకున్న టీమ్ 

 చెప్పినట్లుగానే కొద్దిసేపటి క్రితమే విశ్వంభర గ్లింప్స్ రిలీజ్ అయింది. గతంలో విశ్వంభర టీజర్ రిలీజ్ అయినప్పుడు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దానిని చిత్ర యూనిట్ బాగా సీరియస్ గా తీసుకున్నట్లు ఉన్నారు. లేటెస్ట్ గ్లింప్స్ లో గ్రాఫిక్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి. విశ్వంభర లోకాన్ని డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ చూపిస్తున్న విధానం అదిరిపోయింది. 

35
విశ్వంభర లోకంలో అసలేం జరిగింది ?
Image Credit : UV Creations

విశ్వంభర లోకంలో అసలేం జరిగింది ?

విశ్వంభర లోకంలో అసలేం జరిగింది అని చిన్న పాప అడిగే వాయిస్ ఓవర్ తో గ్లింప్స్ మొదలవుతుంది. వెంటనే విశ్వంభర లోకంలో భారీ తేలు లాంటి ఆకారాన్ని చూపించారు. విజువల్ గా ఆ షాట్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. విశ్వంభరలో జరిగిన అరాచకాన్ని ఓ వ్యక్తి వివరించే ప్రయత్నం చేస్తాడు. ఒకడి స్వార్థం అంతులేని యుద్ధంగా మారిందని, మరణశాసనాన్ని రాసిందని, భయాన్ని కలిగించిందని తెలుపుతాడు. 

45
వీరుడి కోసం ఎదురుచూపులు 
Image Credit : UV Creations

వీరుడి కోసం ఎదురుచూపులు 

 ఆ లోకంలో ఒక సమూహం ఒక వీరుడి కోసం ఎదురుచూస్తున్నారని.. ఆగని యుద్ధాన్ని అతడొచ్చి ముగిస్తాడని నమ్మకంతో ఉన్నారని చెబుతాడు. ఎవరతను అని పాప అడిగినప్పుడు చిరంజీవి ఎంట్రీ ఉంటుంది. ముందు నుంచి చూప్పిస్తున్న హనుమాన్ విగ్రహం వద్ద చిరంజీవి శత్రువులతో పోరాడుతూ ఊచకోత కోస్తున్నాడు. 

55
నెగిటివిటీ తొలగిపోయేలా గ్లింప్స్ 
Image Credit : UV Creations

నెగిటివిటీ తొలగిపోయేలా గ్లింప్స్ 

ఓవరాల్ గా ఈ గ్లింప్స్ తో దర్శకుడు వశిష్ఠ కథ గురించి హింట్స్ ఇచ్చేశారు. విశ్వంభర లోకానికి వెళ్లి చిరంజీవి చేసే పోరాటమే ఈ చిత్రం. అయితే అక్కడికి ఎందుకు వెళ్ళాడు ? ఎలా వెళ్ళాడు అనేది కథలో ఆసక్తికరం. గతంలో విశ్వంభర టీజర్ వల్ల వచ్చిన నెగిటివిటీ తొలగిపోయేలా ఈ గ్లింప్స్ ఉంది. కీరవాణి అందించిన బీజీయం కూడా చాలా బావుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. త్రిష ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మౌని రాయ్ స్పెషల్ సాంగ్ లో నటించింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
చిరంజీవి ప్రాణాలకు తెగించారు.. రాజీవ్ కనకాల హార్ట్ బీట్ పెంచేసిన మెగాస్టార్, టాలీవుడ్ లో గ్రూపులపై ఇలా
Recommended image2
చిరంజీవి దండకారణ్యంలోకి వెళ్లారు, నాకు దొరికిన గొప్ప హీరోలు వాళ్లిద్దరే.. లెజెండ్రీ లిరిసిస్ట్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved