17 ఏళ్లుగా నాని భద్రంగా దాచుకున్న జ్ఞాపకం ఏంటో తెలుసా? షాక్ అవుతారు
టాలీవుడ్ యంగ్ హీరో నాని సహజ నటుడిగా గుర్తింపు సాధించాడు. కింద స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగిన నాని గత 17 ఏళ్లుగా ఓ జ్ఞాపకాన్ని భద్రంగా దాచుకున్నాడు. ఇంతకీ ఏంటా వస్తువు?

న్యాచురల్ స్టార్ నాని, నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. డిఫరెంట్ క్యారెక్టర్స్ ను ట్రై చేస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా హిట్ 3 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని, ప్రస్తుతం 'ది ప్యారడైజ్' మూవీతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాని ఫుల్ బిజీబిజీగా ఉండి కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన లైఫ్ కు సబంధించి కొన్ని విషయాలను శేర్ చేసుకున్నాడు. రీసెంట్ గా జగపతి బాబు హోస్ట్ చేస్తోన్న టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ నానిలో గెస్ట్‌గా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అనేక ఆసక్తికర విషయాలను నాని వెల్లడించారు. ముఖ్యంగా ఒక పాత టీ షర్ట్ గురించి జరిగిన సంభాషణ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. షోలో జగపతి బాబు, నాని కి చెందిన ఓ పాత టీ షర్ట్‌ను చూపించారు. అది చూసిన నాని ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఆ టీ షర్ట్ వెనక ఉన్న కథను షేర్ చేశారు. నాని మాట్లాడుతూ, "ఇది నా ఫస్ట్ ఫోటోషూట్ షర్ట్. 'అష్టాచెమ్మా' సినిమా ఆడిషన్ కోసం ఫొటోలు కావాలంటే, జూబ్లీహిల్స్‌లోని ఓ పార్కులో ఈ టీ షర్ట్ వేసుకొని తక్షణమే ఫొటోలు తీసి పంపించాను. అది నా సినీ ప్రయాణంలో తొలి అడుగు." అని నాని గుర్తుచేసుకున్నారు.
అంతటితో ఆగకుండా, ఆ టీ షర్ట్ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంత ముఖ్యమైందో వివరించారు. "అంజును (నాని భార్య) మొదటిసారి కలవడానికి కూడా ఇదే టీ షర్ట్ వేసుకున్నాను. అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకం. అంజు ఈ షర్ట్‌ను ఎంతో జాగ్రత్తగా దాచింది. అదే మీకు ఇచ్చిందేమో!" అని జగపతి బాబుతో నవ్వుతూ మాట్లాడారు.ఈ షర్ట్‌తో 17 ఏళ్లకు పైగా ఉన్న అనుబంధాన్ని నాని పేర్కొన్నారు. ఇప్పటికీ ఆ షర్ట్‌ను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. తన స్టూడెంట్ లైఫ్ గురించి చెప్తూ.. యావరేజ్ స్టూడెంట్ అని తెలిపాడు. హైదరాబాద్ సెయింట్ ఆల్ఫాన్స్ స్కూల్ లో చదివానని, తన ఫేవరేట్ టీచర్ సుందరమ్మ. ఆవిడ నన్ను బాగా కేర్ చేసేది, ఎగ్జామ్స్ టైంలో ఇంటికి ఫోన్ చేసి మరీ చదివానా లేదా కనుక్కునేది అని తెలిపాడు.
ప్రస్తుతం నాని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాని ఫ్యాన్స్ ఈ విషయం తెలుసుకుని ఎంతో ముచ్చటపడుతున్నారు. ఈ వీడియోను మరింతగా వైరల్ చేస్తున్నారు. నాని మొదట సినీ పరిశ్రమలోకి డైరెక్టర్ అవుదామని వచ్చిన సంగతి తెలిసిందే. పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసి అవకాశం రావడంతో హీరోగా మారాడు నాని. ఇప్పుడు న్యాచురల్ స్టార్ గా ఎదిగి వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.