MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nani: రష్మిక, విజయ్ ప్రైవేట్ పిక్ లీక్ వివాదం.. ఇద్దరూ నా ఫ్రెండ్సే, క్షమాపణలు చెప్పిన నాని

Nani: రష్మిక, విజయ్ ప్రైవేట్ పిక్ లీక్ వివాదం.. ఇద్దరూ నా ఫ్రెండ్సే, క్షమాపణలు చెప్పిన నాని

అసలు అది మాకు తెలియకుండా జరిగింది. ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు చాలా మంది పనిచేస్తుంటారు. ఎవరు ఎందుకు చేశారు అనేది క్లారిటీ లేదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 03 2023, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న'. నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ తో పాటు ఆకట్టుకునే ప్రేమ కథతో కూడా ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఈ నేపథ్యంలో నాని ముందుండి జోరుగా ప్రచార కార్యక్రమాలు నడిపిస్తున్నారు. మాస్ కథలని పక్కన పెట్టి ఇలాంటి ఎమోషనల్ డ్రామాలు ఎందుకు చేస్తున్నానో కూడా నాని వివరిస్తున్నారు. మాస్ కథలు మాత్రమే కాదని అన్ని రకాల కథలు చేయడం నటుడిగా తన బాధ్యత అని చెబుతున్నారు. 

 

36

అయితే ఇటీవల జరిగిన హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తప్పిదం జరిగిన సంగతి తెలిసిందే. బుధవారం రోజు వైజాగ్ లో హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.హాయ్ నాన్న ఈవెంట్ లో యాంకర్ సుమ స్క్రీన్ పై కొన్ని ఫోటోలు చూపిస్తూ వాటిపై స్పందించాల్సిందిగా మృణాల్ ఠాకూర్ ని కోరింది. నాని, నజ్రియా, దుల్కర్ సల్మాన్ ఫోటోలు చూపించారు. తనకి తోచిన విధంగా మృణాల్ కామెంట్ చేసింది. కానీ ఒక్కసారిగా స్క్రీన్ పై రష్మిక, విజయ్ దేవరకొండ పర్సనల్ ప్రైవేట్ పిక్స్ ప్రత్యక్షం అయ్యాయి. 

46

వాళ్లిద్దరూ బాలిలో వెకేషన్ లో గడిపిన దృశ్యాలని కలిపి ఉన్న ఫోటో స్క్రీన్ పై ఉంచారు. దీనితో అంతా ఒక్కసారిగా షాక్. యాంకర్ సుమ కూడా ఏం జరుగుతుందో అర్థం కాక తడబడింది. మృణాల్ ఠాకూర్ కూడా ఏంటిది అంటూ ఎలా స్పందించాలో తెలియక ఇబ్బంది పడింది.  ఈ సంఘటనపై నానిపై కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తన సినిమా ప్రచారం కోసం ఇతర హీరోయిన్ల ప్రైవసీకి భంగం కలిగించేలా వారి ఫోటోలు వాడుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ దృశ్యాలని వైరల్ చేస్తూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

56

తాజాగా ఇంటర్వ్యూలో ఈ వివాదం గురించి ప్రశ్నించగా.. అసలు అది మాకు తెలియకుండా జరిగింది. ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు చాలా మంది పనిచేస్తుంటారు. ఎవరు ఎందుకు చేశారు అనేది క్లారిటీ లేదు. బహుశా ఎగ్జైట్ మెంట్ లో ఆ పిక్ వేసి ఉండొచ్చు. 

66

విజయ్, రష్మిక ఇద్దరూ నాకు ఫ్రెండ్స్. వాళ్ళ ఫోటోలు బహిరంగం చేయాలని మేము ఎందుకు అనుకుంటాం ? ఆ సంఘటన వల్ల బాధపడిన వాళ్ళకి క్షమాపణ చెబుతున్నా అని నాని తెలిపాడు. ఆ పిక్ పెట్టిన వ్యక్తిని ఇప్పుడు నిందించి లాభం లేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ ఉద్యోగం పోతుందేమో అనే టెన్షన్ లో ఉంటాడు అని నాని తెలిపారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
నాని (నటుడు)
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Madhuri Dixit: గర్భవతి, పైగా జ్వరం.. అయినా 13 గంటలు డ్యాన్స్ చేసిన హీరోయిన్
Recommended image2
Janhvi Kapoor: 8 ఏళ్లలో 15 సినిమాలు చేసిన పెద్ది హీరోయిన్.. చివరి 5 సినిమాల్లో ఒక్కటి మాత్రమే హిట్
Recommended image3
Mirchi Madhavi: హీరోయిన్ కాకపోతే ఆంటీనేనా? ప్రభాస్ కామెంట్స్, వేధింపులపై నోరు విప్పిన మిర్చి మాధవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved