MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ఆ మూవీ బాలీవుడ్ లో డిజాస్టర్.. ఎందుకో చెబుతూ నాని షాకింగ్ కామెంట్స్

తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ఆ మూవీ బాలీవుడ్ లో డిజాస్టర్.. ఎందుకో చెబుతూ నాని షాకింగ్ కామెంట్స్

తెలుగులో సంచలన విజయం సాధించిన ఒక చిత్రం బాలీవుడ్ లో డిజాస్టర్ గా నిలిచింది. అలా ఎందుకు జరిగిందో చెబుతూ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 06 2025, 08:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nani

Nani

నేచురల్ స్టార్ నాని 2019లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ చిత్రంలో తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్సులలో ఒకటిగా నిలిచే నటనను అందించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంది. తెలుగులో విడుదలైన తర్వాత రెండేళ్లకు అదే దర్శకుడు హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేసినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Nani

Nani

ఇటీవల హిట్: ది థర్డ్ కేస్ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా, నాని ఓ ఇంటర్వ్యూలో హిందీ వెర్షన్ ఎందుకు సక్సెస్ కాలేదో వివరించారు. "అప్పుడు కోవిడ్ అయిపోయింది. జనం బయటికి రావడం మొదలు పెట్టారు. కానీ అప్పటికే లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోనే మంచి కంటెంట్ చూసే అలవాటు పడిపోయారు. వాళ్లు థియేటర్స్‌కు వెళ్లాలంటే మసాలా, ఎనర్జీ కావాలసింది. జెర్సీ ఒక గొప్ప సినిమా. హిందీలో కూడా గొప్పగానే ఉంది. కానీ ప్రేక్షకుల మూడ్ మారిపోయింది" అని నాని అన్నారు.

 

35
Jersey (2022)

Jersey (2022)

అంతేకాదు, అదే సమయంలో KGF వంటి హై ఎనర్జీ సినిమాలు విడుదలవుతున్నాయని నాని పేర్కొన్నారు. "అప్పుడు ప్రజలు థియేటర్‌కు వెళ్తే వాళ్లకు ఎమోషన్ కంటే థ్రిల్, పవర్‌ఫుల్ మూమెంట్స్ కావాలి. అదే సమయంలో జెర్సీ విడుదలైంది. టైమింగ్, ప్లేస్‌మెంట్ వల్లే సినిమా ఫ్లాప్ అయింది. షాహిద్ ఒక అద్భుతమైన నటుడు. కానీ టైమింగ్ అనేది కీలకం," అని నాని వ్యాఖ్యానించారు.

 

45

ఈ హిందీ రీమేక్‌కు దర్శకత్వం గౌతమ్ తిన్ననూరి అందించగా, నిర్మాణ బాధ్యతలు నాగ వంశీ చేపట్టారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించారు. సినిమా బడ్జెట్ దాదాపు ₹80 కోట్లుగా ఉండగా, వసూళ్ల పరంగా ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.

 

 

55
Nani

Nani

ఇక నాని ప్రొఫెషనల్ ఫ్రంట్ చూస్తే, ఇటీవల శ్రీనిధి శెట్టితో కలిసి నటించిన హిట్: ది థర్డ్ కేస్ సినిమాలో కనిపించారు. మే 1న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. నాని ఖాతాలో మరో హిట్ పడ్డట్లు తెలుస్తోంది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
నాని (నటుడు)
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi 27 Days Collections: థియేటర్లో రవితేజ మాస్‌ జాతర.. 27వ రోజూ ఇరుముడికి సంచలన వసూళ్లు.. ఇక ఓటీటీ వంతు
Recommended image2
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image3
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Related Stories
Recommended image1
బన్నీ, ఎన్టీఆర్ తో ఐటెం సాంగ్స్..15 ఏళ్ళ వయసులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ఆస్తి 2000 కోట్లు అని తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved