MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: తాగిన మత్తులో సామ్రాట్ కార్ బ్రేకులు పీకేసిన నందు.. సామ్రాట్, తులసిలకు యాక్సిడెంట్!

Intinti Gruhalakshmi: తాగిన మత్తులో సామ్రాట్ కార్ బ్రేకులు పీకేసిన నందు.. సామ్రాట్, తులసిలకు యాక్సిడెంట్!

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 17వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం... 

3 Min read
Author : Navya G
Published : Sep 17 2022, 10:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... సామ్రాట్, నందు తో, అయినా మీరే తన మాజీ భర్త అని చెప్పకపోవడమే మంచిది అయింది. లేకపోతే నేను తులసిని కూడా అందరిలాంటి అమ్మాయి అని అనుకునే వాడిని. తులసి వాళ్ళ మాజీ భర్త,తులసి జీవితం నాశనం చేశాడు అని అనుకున్నాను కానీ ఇప్పుడు తెలుస్తుంది, మీ జీవితం మీరే నాశనం చేసుకున్నారని. మీరు వదులుకున్నది ఇంకొకరు పట్టుకుంటారు అని అంటాడు సామ్రాట్. ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నారు సార్ అని నందు అడగగా, ఏమీ లేదు ఉత్తినే.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

నేను మరి ఎక్కువ దూరం వెళ్ళిపోతున్నట్టున్నాను అని అంటాడు సామ్రాట్.ఇంతలో తులసి,లాస్య లు అక్కడికి వస్తారు. అప్పుడు సామ్రాట్, తులసితో, రేపు మనకి ఒక ప్రాజెక్ట్ మీటింగ్ ఉన్నది దానికి బయలుదేరాలి, ఇంటి దగ్గర తయారవ్వమని చెప్తాడు. అప్పుడు లాస్య, మేము కూడా వస్తాము అని అనగా, మీరు ఆఫీస్ లోనే ఉండండి చాలు అని అంటాడు సామ్రాట్. దానికి నందు లాస్య లు ఇద్దరు కుళ్ళుకుంటారు. ఆ తర్వాత సీన్లో రాత్రికి నందు పూర్తిగా మందు తాగి రోడ్డుమీద అరుస్తూ, నేను ఏమీ నా జీవితం నాశనం చేసుకోలేదు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఆవిడే అన్ని తంతాలు పడుతుంది.
 

37

 నేను పూలరంగడు లా బానే ఉన్నాను. అయినా నన్ను అనడానికి ఆయనకి ఎంత ధైర్యం. బాస్ అని ఆఫీసులో ఊరుకున్నాను అయినా మొన్న వైజాగ్ లో మందు తాగినప్పుడు ఏదో అన్నారు నాతో. ఏంటి అబ్బా అని నందు అనుకునే లోగా సామ్రాట్, తులసిలు అక్కడికి వచ్చినట్టు నందు ఊహించుకుంటాడు. అప్పుడు సామ్రాట్ తులసితో, మిమ్మల్ని, మీ ఇంట్లో వాళ్లని, చూసినప్పుడు ఆ ప్రేమానురాగాలకు నాకు చాలా ఈర్ష వచ్చింది.మీ ఇంట్లో వాళ్ల లో  నేను భాగం అవ్వాలి అనుకున్నాను. నీ జీవిత భాగస్వామి అవ్వాలనుకుంటున్నారు మీరు ఒప్పుకుంటున్నారా అని తులసితో సామ్రాట్ అనగా తులసి ఒప్పుకుంటుంది.
 

47

 అప్పుడు సామ్రాట్ నేను ఈ మాటే నీతో మొన్న అన్నాను. తులసి గారు ఒప్పుకున్నారు ఇంక మేము ఆనందంగా ఉంటాము.మమ్మల్ని ఎవ్వరూ విడగొట్టారు అని అనగా నందు మందు బాటిల్ నీ వాళ్ళ మొఖం మీదకి విసురుతాడు. అప్పుడు వాళ్లు మాయమైపోతారు. మీరు ఎంత అనుకున్నా నేను మీ ఇద్దరినీ విడదీస్తాను. నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు నాకన్నా పడుకున్నావని రెచ్చిపోతున్నావా అని అరుస్తారు నందు. అప్పుడు నందు తాగుతూ కారు నడుపుతూ సామ్రాట్ ఇంటి వైపు వెళ్తూ, నీ వైపు వస్తున్నాను రా పొడుగొడా అని అంటాడు. 
 

57

ఇంతలో కార్ ఆగిపోతుంది ఈ కారు కూడా నన్ను సరిగా పట్టించుకోవట్లేదు అని అనుకోని నందు, కార్ రిపేర్ కి ఫోన్ చేస్తాడు.అప్పుడు వాడు వచ్చి కార్ బిగించి ఈ సమయంలో మందు తాగి కార్ నడపడం ఎందుకు సార్? మళ్లీ ఆక్సిడెంట్లు అవుతాయి అని అనగా, యాక్సిడెంట్లు అవుతాయా? నువ్వు నాకు ఒక సహాయం చేయగలవా, ఒకలి కార్ కి బ్రేకులు తీయాలి అని అనగా ఎవరి కార్ సార్ అని అడుగుతాడు వాడు. సామ్రాట్ గారి కారు అని అనగా, సామ్రాట్ గారి కారా! నేను ఆయన కారు జోలికి వెళ్ళను అని పారిపోతాడు. అప్పుడు ఎందుకు నేనే వచ్చి బ్రేక్లు పీకేస్తాను అని సామ్రాట్ ఇంటికి వెళ్లి కార్ కి బ్రేకులు తీసేస్తాడు.
 

67

రేపు నువ్వు మీటింగ్కి ఎలా వెళ్తావో నేను చూస్తాను రా పోడుగొడా అని అనుకుంటాడు. ఆ తర్వాత రోజు ఉదయం తులసీ సామ్రాట్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు సామ్రాట్,నేను మీ ఇంటికి వస్తాను అన్నాను కదండీ ఇక్కడికి ఎందుకు రావడం అని అనగా, పర్లేదు లెండి, నేను జాగ్రత్తగా ఉండాలి కదా అని అనగా మీరు జాగ్రత్త పడాల్సింది నా ముందు కాదు, మీ మాజీ భర్త ముందు అని అంటాడు సామ్రాట్. అప్పుడు తులసి మొహం మాడుస్తుంది. నేను ఊరికే అన్నాను అండి కోప్పడొద్దు, ఈ ఒకసారి కి నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ అలా అనను అని అనగానే తులసి మళ్ళీ నవ్వుతుంది.
 

77

అప్పుడు తులసి,సామ్రాట్ లో ఇద్దరు కారు మీద వెళ్తూ నవ్వుతూ మాట్లాడుకుంటారు. ఇంతలో కార్ కి బ్రేకులు పడవు, ఇద్దరూ అరుస్తూ ఉంటారు. అప్పుడు కారు వెళ్లి ఒక చెట్టుకు ఢీ కొంటుంది.ఇంతలో నందు, "తులసి"! అని నిద్ర లెగుస్తాడు.ఇదంతా కలా! అని  అనుకుంటాడు.ఇంతలో లాస్య అక్కడికి వచ్చి, నువ్వు తులసి అన్నట్టు వినిపించింది అని అనగా లేదు లాస్య, నేను నీ పేరే చెప్పాను అని అంటాడు నందు. అప్పుడు లాస్య వెళ్తూ వెనక్కి తిరిగి నీకు తులసిగానీ కలలోకి రాలేదు కదా అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Malavika Mohanan: రజనీ, మోహన్‌లాల్, విజయ్... ఆ ముగ్గురు సూపర్ స్టార్ల సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
Recommended image2
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Recommended image3
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved