- Home
- Entertainment
- Chiranjeevi: రామ్ చరణ్ తండ్రిని మించిపోయాడా? కష్టంగా ఉందంటూ చిరంజీవి సంచలన కామెంట్స్..
Chiranjeevi: రామ్ చరణ్ తండ్రిని మించిపోయాడా? కష్టంగా ఉందంటూ చిరంజీవి సంచలన కామెంట్స్..
రామ్ చరణ్ చిరంజీవిని మించిపోయాడా? చాలా కాలంగా వినిపిస్తున్న ఈ కామెంట్స్ పై మెగాస్టార్ స్పందన ఏంటి? ఈ కామెంట్స్ పై ఫస్ట్ టైమ్ స్పందించిన చిరు ఏమన్నాడు?

రామ్ చరణ్ రచ్చ మామూలుగా లేదు..
నటుడిగా రామ్ చరణ్ ఒక్కో మెట్టు ఎక్కుతూనే ఉన్నాడు. కమర్షియల్ సినిమాలకు మాత్రమే కమిట్ అవ్వకుండా.. యాక్టర్ గా తనను తాను కొత్తగా నిరూపించుకుంటూనే ఉన్నాడు. రంగస్థలం సినిమా నుంచి కొత్త చరణ్ ను అభిమానులు చూస్తున్నారు. రీసెంట్ గా పెద్ది సినిమాలో మెగా పవర్ స్టార్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా కోసం హీరోలు ఇంత కష్టపడతారా అని సగటు ప్రేక్షకుడు కూడా అర్ధం చేసుకునేలా ఉంది..ఈ సినిమాలో చరణ్ పాత్ర.
కొత్తగా కనిపిస్తున్న మెగాపవర్ స్టార్..
హీరోలంటే రెండు ఫైట్లు, నాలుగు పాటలు, హీరోయిన్ తో రొమాన్స్ అన్న రోజులు పోయాయి. ఆడియన్స్ ను ఎంత ఆకట్టుకోగలిగితేనే హీరోగా ఎదిగేది. పైగా ఈ విషయంలో హీరోల మధ్య పోటీని కూడా గమనించవచ్చు. ఈక్రమంలో రామ్ చరణ్ అంతకంతకు కొత్తగా కనిపిస్తున్నాడు. చిరంజీవి వారసత్వం తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చినా.. హీరోగా తనను తాను నిరూపించుకుని.. సినిమా కోసం తండ్రిని మించి కష్టపడుతున్నాడు చరణ్.
రామ్ చరణ్ తండ్రిని మించిపోయాడా?
ఒకప్పుడు చిరంజీవి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. తనను తాను నిరూపించుకున్నాడు. పోటీని తట్టుకుంటూ.. స్టార్ హీరోగా ఎదిగాడు. తనకు పోటీగా ఉన్న సినిమా వారసులను కూడా దాటుకుని మెగాస్టార్ గా ఎదిగాడు. కానీ చిరంజీవి టాలీవుడ్ కు మాత్రమే పరిమితం అయ్యాడు. కానీ రామ్ చరణ్ ఇప్పుడు అంతకు మించి సాధించాడన్న కామెంట్స్ చాలా కాలంగా వినిపిస్తున్నాయి. రంగస్థలం, ఆర్ఆర్ఆర్, పెద్ది ఈ సినిమాల్లో చరణ్ మెశ్చ్యూర్డ్ యాక్టింగ్, పాన్ ఇండియా రేంజ్ లో అతనికి పెరిగిన అభిమానులు, దేశ వ్యాప్తంగా మెగా పవర్ స్టార్ ఇమేజ్, ఇవన్నీ చూసి తండ్రిని మంచిన తనయుడు రామ్ చరణ్ అని అంతా అంటున్నారు.
తండ్రిని మించిన తనయుడు కామెంట్స్ పై చిరు ఏమన్నాడు?
అయితే ఈ విషయంలో చిరంజీవి ఏమంటాడన్న డౌట్ అందరిలో ఉంది. ఇక రీసెంట్ గా ఈ విషయంపై తన మనసులో మాట బయట పెట్టారు చిరంజీవి. పెద్దిసినిమా సక్సెస్ తరువాత పలు ఇంటర్వ్యూలలో మెగాస్టార్ కూడా పాల్గొంటున్నారు. ఈక్రమంలోనే రామ్ చరణ్ నటన, సినిమా కోసం అతను పడుతున్న కష్టాన్ని అభినందించారు చిరు.. ''అందరు చిరంజీవిని మించిపోయాడు చరణ్ అంటున్నారు. అది నిజమే నేను మనస్పూర్తిగా ఒప్పుకుంటున్నాను. తండ్రిగా ఈ విషయంలో ఎంతో గర్వపడుతున్నాను. కానీ నటుడిగా మాత్రం కాస్త కష్టంగా ఒప్పుకోవలసి వస్తుంది. చాలా బాగా చేశావ్ రా చరణ్.. లవ్ యూ'' అని అన్నారు.
ఆపరిస్థితుల్లో చూసి బాధేసింది..
పెద్ది సినిమా కోసం చరణ్ కష్టపడటం చూసి చాలా సంతోషమనిపించిందని చిరంజీవి అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ.. '' ఈ సినిమా షూటింగ్ టైమ్ లో ఒక సారి చేతికి, మరోసారి కంటికి గాయం అయినప్పుడు మాత్రం తట్టుకోలేకపోయాను. కన్నుకు దెబ్బతగిలి రక్తం వచ్చినప్పుడు భయమేసింది.. కాస్త పైన తగిలి కంటికి ఏమైనా అయితే ఎలా అని భయం వేసింది. కానీ చరణ్ తో మాత్రం నా బాధను చెప్పుకోలేదు. మా నాన్న అప్పట్లో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. చరణ్ ను చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంది.''అని మెగాస్టార్ అన్నారు.

