MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • నందిని రెడ్డి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా?.. ప్రేమ వ్యవహారాలు కూడా ఉన్నాయా?

నందిని రెడ్డి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా?.. ప్రేమ వ్యవహారాలు కూడా ఉన్నాయా?

నందిని రెడ్డి ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న పాపులర్‌ లేడీ డైరెక్టర్‌. ఆమె ఇప్పటి వరకు మ్యారేజ్‌ చేసుకోలేదు. దానికి అసలు కారణం చెప్పింది నందిని రెడ్డి.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 12 2024, 07:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్‌లో లేడీ దర్శకుల్లో ఒకరు నందిని రెడ్డి. ఆమె `అలా మొదలైంది` చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే దర్శకురాలిగా మెప్పించారు. మంచి ఫ్యామిలీ సినిమాలతో మెప్పించింది. `జబర్దస్త్`, `కళ్యాణ వైభోగమే`, `ఓ బేబీ`, `పిట్ట కథలు`, `అన్ని మంచి శకునములే` చిత్రాలు చేసింది. ఇప్పటికీ దర్శకురాలిగా రాణిస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే నందిని రెడ్డి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. అంతేకాదు ఆమె ఎప్పుడూ అమ్మాయిలా కనిపించదు. ప్యాంట్‌, షర్ట్ లోనే ఉంటుంది. అబ్బాయిగానే కనిపిస్తుంటుంది. ప్యాంట్, షర్ట్ లో తప్ప చీర, చుడీదార్‌లో కనిపించింది లేదు. చాలా అరుదు. మరోవైపు నాలుగు పదులు దాటినా మ్యారేజ్‌ చేసుకోలేదు. మరి ఎందుకు ఆమె ఒంటరిగా ఉంటుంది? ఈ గెటప్‌కి కారణమేంటి? అనేది చూస్తే, 

 

36

నందిని రెడ్డి తన గురించి పలు షాకింగ్‌ విషయాలను, ఆసక్తికర విషయాలను, ఎవరికీ తెలియని ఫ్యాక్ట్స్ ని వెల్లడించింది. మగరాయుడి గెటప్‌ గురించి చెబుతూ, తాను చిన్నప్పట్నుంచి స్పోర్ట్స్ ఆడేదట. ఆ సమయంలోనే ప్యాంట్‌, టీషర్ట్ కంఫర్ట్ గా ఉండేవి, టీనేజ్‌లో అదే తనకు బాగా అలవాటు అయ్యిందట. దాన్నే ఫాలో అవుతున్నట్టు చెప్పింది. లేడీస్‌కి సంబంధించిన చీరలు, స్కర్ట్స్ కూడా తాను ధరించానని, కాకపోతే చాలా అరుదుగానే వాటిని ధరించినట్టు చెప్పింది. ఫంక్షన్లు, ఇంట్లో మాత్రమే వాటిని ధరిస్తానని, కానీ తనకు ఏదైనా కంఫర్ట్ గా ఉంటుందో అవే వేసుకుంటానని చెప్పింది నందిని రెడ్డి. చిన్నప్పట్నుంచి బైక్‌ నడిపేదాన్ని అని, అందుకు కంఫర్ట్ కోసం కూడా ప్యాంట్ షర్ట్ వేసేదాన్ని అని చెప్పింది నందిని రెడ్డి. 
 

46

హెయిర్‌ కట్ చేసుకోవడం గురించి చెబుతూ, తన జుట్టు రింగులుగా ఉంటుందని, చిన్నప్పుడు అమ్మ దువ్వేసమయంలో చిక్కుతీస్తుంటే బాగా నొప్పిగా ఉండేది, దీంతో తానే కట్‌ చేసుకునేదట. అలా షార్ట్ హెయిర్‌కి అలవాటు పడ్డానని, అది తన కంఫర్ట్ అని చెప్పింది. మరోవైపు మ్యారేజ్‌ గురించి చెప్పింది నందిని రెడ్డి. ప్రేమ పెళ్లి గురించి అడగ్గా, తన జీవితంలోనూ లవ్‌ స్టోరీ ఉందని, జెఎన్‌యూలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డానని, కలిసి తిరిగామని చెప్పింది. లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నామని చెప్పింది నందిని రెడ్డి. 

56

ఇక మ్యారేజ్‌ గురించి చెబుతూ, చేసుకోవద్దని అనుకోలేదని, చేసుకోవాలనే ఫీలింగ్‌ కలగలేదని, ఏదీ ప్లాన్‌ చేయలేదని చెప్పింది. తనకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చాయని, కానీ తాను సినిమా రంగంలో ఉన్నాను, తనని అర్థం చేసుకునేవాళ్లు, తన టైమింగ్‌ని అర్థం చేసుకునే వాళ్లు కావాలని, అలాంటి వాళ్లు తనకు ఇండస్ట్రీలో తారసపడలేదని, బయటి వాళ్లు వచ్చినప్పుడు తనకు ఆసక్తిగా అనిపించలేదని చెప్పింది నందిని రెడ్డి. తన మొదటి సినిమాకి ఆరేళ్లు పట్టిందని, ఆ తర్వాత ఒకటి అర ఆఫర్లు వస్తుంటే వాటి చుట్టూ తిరిగానని తెలిపింది. ఇలా టైమ్‌ గడిచిపోయిందని, పెళ్లి ఆలోచన రాలేదని చెప్పింది. ఇప్పటికైనా పెళ్లి చేసుకోవచ్చు ని చెప్పింది. 

66
Nandini Reddy

Nandini Reddy

నందిని రెడ్డి `అలా మొదలైంది` సినిమాని నాని, నిత్యమీనన్‌ జంటగా రూపొందించింది. ఈ సరికొత్త లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మంచి ఆదరణ పొందింది. ఈ మూవీకి తనకు పది లక్షల చెక్‌ పారితోషికంగా ఇచ్చారని, దానితో అమ్మ చేసిన అప్పు తీర్చినట్టు తెలిపింది నందిని రెడ్డి. సినిమాల్లో రాకముందు రేడియో జాకీగానూ పనిచేశానని, 20వేల శాలరీ ఇచ్చేవారని తెలిపింది నందిని రెడ్డి.  

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Recommended image2
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Recommended image3
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved