- Home
- Entertainment
- ఎన్టీఆర్ ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా ? పెళ్ళికి రెడీ అయిన టైంలో పారిపోయింది
ఎన్టీఆర్ ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా ? పెళ్ళికి రెడీ అయిన టైంలో పారిపోయింది
ఎన్టీఆర్ తనతో కలిసి 25 చిత్రాల్లో నటించిన ఓ హీరోయిన్ ని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించారట. ఆమెని పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడ్ అయ్యారు. కానీ చివరికి ఏం జరిగిందో ఈ కథనంలో తెలుసుకోండి.

ఎన్టీఆర్ తో 25 చిత్రాల్లో నటించిన హీరోయిన్
నందమూరి తారక రామారావు వివాహం చేసుకున్న తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సినీ రంగంలోకి రాగానే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. జానపద చిత్రాలు, పౌరాణిక చిత్రాలతో ఎన్టీఆర్ కి తిరుగులేని గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్టీఆర్ తో కలిసి ఎక్కువ చిత్రాల్లో నటించిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. వారిలో అలనాటి నటి కృష్ణ కుమారి ఒకరు. ఎన్టీఆర్, కృష్ణ కుమారి కలసి ఏకంగా 25 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ తన సొంత బ్యానర్ స్థాపించి నిర్మించిన చిత్రం పిచ్చి పుల్లయ్య. ఈ చిత్రానికి ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు నిర్మాతగా వ్యవహరించారు. హీరోయిన్ గా కృష్ణ కుమారిని తీసుకున్నారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కానీ కృష్ణ కుమారి పాత్ర, ఆమె నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఆమెని ప్రేమించిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ కూడా షూటింగ్ లొకేషన్స్ లో కృష్ణ కుమారి బిహేవియర్ కి ఫిదా అయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరూ 25 సినిమాల్లో కలిసి నటించారు. కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. దీనితో సూపర్ హిట్ పెయిర్ అనే గుర్తింపు కూడా దక్కింది. క్రమంగా ఎన్టీఆర్, కృష్ణ కుమారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది అని సీనియర్ డైరెక్టర్ నందం హరిశ్చంద్ర రావు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 1960 లోకి వచ్చేసరికి ఎన్టీఆర్, కృష్ణ కుమారి మధ్య ప్రేమ బాగా బలపడింది.
కృష్ణ కుమారిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఎన్టీఆర్
ఆ టైంలో ఎన్టీఆర్ కృష్ణ కుమారిని రెండో వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కృష్ణ కుమారి కూడా అంగీకారం తెలిపింది అని నందం హరిశ్చంద్ర రావు అన్నారు. కృష్ణ కుమారి ఎవరో కాదు.. సీనియర్ నటి షావుకారు జానకి సోదరి ఆమె. దీనితో షావుకారు జానకి కూడా కృష్ణ కుమారిని హెచ్చరించారట. ఎన్టీఆర్ కి ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్నారు.. అలాంటి వ్యక్తితో వివాహం ఏంటి నీకు ఓకేనా అని అడిగారట. దీనితో కృష్ణ కుమారి ఎన్టీఆర్ పై ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేసింది.
వార్నింగ్ ఇచ్చిన త్రివిక్రమ రావు
ఎన్టీఆర్ ఏమో తన సోదరుడు త్రివిక్రమ రావుకి ఫోన్ చేసి తాను కృష్ణ కుమారిని ఓ గుడిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. వేరే ఊరిలో ఉన్న త్రివిక్రమ రావు వెంటనే బయలుదేరి వచ్చి నేరుగా కృష్ణ కుమారి ఇంటికి వెళ్లారట. ఆయన కృష్ణ కుమారికి వార్నింగ్ ఇచ్చారట. ఎన్టీఆర్ గారికి ఉన్న గుర్తింపు ఏంటి ? మా ఫ్యామిలీకి ఉన్న ప్రతిష్ట ఏంటి ? ఆయన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చారట.
అన్నీ వదిలేసి బెంగళూరు పారిపోయింది
దీనితో కృష్ణ కుమారి అన్నీ వదిలేసి బెంగళూరు పారిపోయారు అని నందం హరిశ్చంద్ర రావు తెలిపారు. ఆ టైంలో ఆమె నటించాల్సిన 14 చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఎన్టీఆర్ తో ప్రేమ వ్యవహారం పెద్ద గొడవకి దారితీసేలా ఉండడంతో కృష్ణ కుమారి బెంగుళూరు వెళ్లిపోయారు. ఎన్టీఆర్ కూడా .. తన సోదరుడు త్రివిక్రమరావు, సన్నిహితులు చెప్పడంతో కృష్ణ కుమారి విషయంలో వెనక్కి తగ్గినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి అని హరిశ్చంద్ర రావు అన్నారు. ఆ టైంలో కృష్ణ కుమారి అజయ్ మోహన్ అనే జర్నలిస్ట్ ని వివాహం చేసుకున్నారు.