MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bimbisara Twitter Review:బింబిసార ట్విట్టర్ రివ్యూ, ఈ సారైనా కల్యాణ్ రామ్ కు కలిసొస్తుందా...?

Bimbisara Twitter Review:బింబిసార ట్విట్టర్ రివ్యూ, ఈ సారైనా కల్యాణ్ రామ్ కు కలిసొస్తుందా...?

నందమూరి కల్యాణ్ రామ్ ఈ సారి సాలిడ్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యి ఉన్నాడు. అందుకే భారీ బడ్జెట్ తో.. హిస్టారికల్ స్టోరీతో, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా.. పక్కా ప్లానింగ్ తో బింబిసార చేశాడు. ఈ రోజు రిలీజ్ అవ్వనున్న ఈసినిమా ప్రిమియర్ చూసిన ట్విట్టర్ జనాలు ఏం చెపుతున్నారో తెలుసుకుందాం..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 05 2022, 08:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కల్యాణ్ రామ్ హీరోగా, కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా కొత్త దర్శకుడు శ్రీవశిష్ఠ్ డైరెక్షన్ లో బింబిసార  సినిమా తెరకెక్కింది. దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో చారిత్రక నేపథ్యాన్ని కథగా చేసుకుని  ఈ సినిమాను తెరకెక్కించారు. క్రీ.పూ. 5వ శతాబ్దానికి చెందిన మగధ సామ్రాజ్యాధిపతి, గౌతమ బుద్ధుడి సమకాలీడైన బింబిసార జీవిత కథ ను..  టైమ్ ట్రావెలింగ్ పాయింట్‌తో జత చేసి ఈ సినిమాను నిర్మించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

ఇక బింబిసారుడు ఈరోజు ( 05 అగష్ట్) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యాడు. అయితే రిలీజ్ కంటే ముందు ప్రీమియర్ చూసిన ఫారెన్ ప్రేక్షకులు ట్విట్టర్ లో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మరి ఈ  సినిమాకు ట్విట్టర్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...

38

కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే బింబిసార బిగ్గెస్ట్ హిట్ అంటూ కొంత మంది నెటిజన్లు  ట్విట్టర్‌ లో హడావిడి చేస్తున్నారు. ఫస్టాఫ్, సెకండాఫ్ రెండూ అద్భుతంగా ఉన్నాయంటున్నారు. ఆసక్తికరంగా సాగే టైమ్ ట్రావెలింగ్ కంటెంట్ మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందని రివ్యూస్ ఇస్తున్నారు ట్విట్టర్ జనాలు. 

48

బింబిసార ఫస్టాఫ్ అదిరిపోయింది. ముఖ్యంగా  ఒళ్ళు జలజరించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కల్యాణ్ రామ్ ఎంట్రీ సూపర్.. కల్యాణ్ రామ్  కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీ. వాటే స్టోరీ.. అంటూ మరో నెటిజన్ సినిమాగురించి తెగ పొగుడుతూ రివ్యూ ఇచ్చాడు. అంతే కాదు కల్యాణ్ రామ్ కు పటాస్ తరువాత అంతలా సాలిడ్ హిట్ ఇచ్చే సినిమా ఇది అంటూ కొంత మంది అభిప్రాయం వ్యాక్తం చేస్తున్నారు.  

58

మరికొంత మంది మాత్రం  బింబిసారకు నెగెటీవ్ రివ్యూ ఇస్తున్నారు. ఈ సినిమా  యావరేజ్‌గా ఉందని అంటున్నారు. గ్రాఫిక్స్ బాగున్నాయి.. కాని సినిమాలో ఏదో మిస్ అయ్యిందటూ కొందరు ట్వీట్ చేశారు. ఇక మరికొందరు అయితే.. కల్యాణ్ రామ్ యాక్టింగ్ ను కామెంట్ చేస్తూ.. రివ్యూ ఇచ్చారు.

68

బింబిసారి సినిమాకు ప్రాణంలాంటిది సంగీతం. సినిమా పాటలతో పాటు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి రకరకాల రివ్యూస్ కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ ప్రాణం పోసిందని కొందరు అంటుంటే.. కీరవాణి ఇలా మ్యూజిక్ చేసాడేంటి.. ఏమైంది కీమ్ కు అంటూ మరికొందరు నెగెటీవ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. 

78

అటు కల్యాణ్ రామ్ యాక్టింగ్ పై కూడా డిఫరెంట్ గా స్పందిస్తున్నారు నెటిజన్లు. కొందరు ఆహా ఓహో.. అంటుంటే.. మరికొందరు మాత్రం కొత్తగా చేసిందేమి లేదు అంటున్నారు. మరికొందరు మాత్రం మధ్యస్తంగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఈసారి కల్యాణ్ రామ్ సాధించాడు.. నందమూరి ఫ్యాన్స్ కు పండగే అంటున్నారు. 
 

88

ఇక ఈరోజు థియేటర్లలో సందడి చేయబోతున్న బింబిసారుడు ఓవర్ ఆల్ గా ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి. ఎన్టీఆర్ ప్రీరిలీజ్ లో చెప్పినట్టు... ఈసినిమా అద్భుతంగా ఉంది అంటున్నారు ట్విట్టర జనాలు కొంత మంది. మరి టోటల్ గా సినిమారిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song: రియల్ లైఫ్ ప్రేమజంట పాటకు యూట్యూబ్ లో 5 కోట్ల వ్యూస్, పాట వింటే స్టెప్పులేయాల్సిందే
Recommended image2
Vijay Thalapathy: సీఎం విజయ్ కి ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా? అతనే ఎందుకంత ఇష్టం?
Recommended image3
Venkatesh: ఆ హీరోయిన్ తో 100% స్ట్రైక్ రేట్ కొట్టిన వెంకటేష్.. 6 సినిమాలు చేస్తే అన్నీ బ్లాక్ బస్టర్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved