- Home
- Entertainment
- నందమూరి హరికృష్ణతో సూపర్ హిట్స్..ఆయన మనవడిని హీరోగా లాంచ్ చేయబోతున్న క్రేజీ డైరెక్టర్
నందమూరి హరికృష్ణతో సూపర్ హిట్స్..ఆయన మనవడిని హీరోగా లాంచ్ చేయబోతున్న క్రేజీ డైరెక్టర్
నందమూరి తారక రామారావు వారసుడైన హరికృష్ణకి అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నందమూరి హరికృష్ణ అత్యంత విషాదకరంగా 2018లో రోడ్డు ప్రమాదంలో మరణించారు.

నందమూరి తారక రామారావు వారసుడైన హరికృష్ణకి అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నందమూరి హరికృష్ణ అత్యంత విషాదకరంగా 2018లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు అత్యంత క్రియాశీలకంగా హరికృష్ణ వ్యవహారించారు. ఆయన మంత్రిగా, ఎంపీగా సేవలందించారు.
హరికృష్ణ చేసింది తక్కువ చిత్రాలే. అయినప్పటికీ ఆయన ముద్ర బలంగా ఉంది. సీతయ్య, లాహిరి లాహిరి లాహిరిలో, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, శివరామరాజు లాంటి చిత్రాల్లో హరికృష్ణ నటించారు. నందమూరి హరికృష్ణ పేరు చెప్పగానే సీతయ్య లాంటి బ్లాక్ బస్టర్ మూవీ గుర్తుకు వస్తుంది. హరికృష్ణతో క్రేజీ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి సీతయ్య, లాహిరి లాహిరి లాహిరిలో లాంటి సూపర్ హిట్స్ తెరకెక్కించారు.
చాలా కాలంగా వైవియస్ చౌదరికి హిట్స్ లేవు. అయితే ప్రస్తుతం ఈ దర్శకుడు హరికృష్ణ మనవడిని హీరోగా నిలబెట్టే బాధ్యత తీసుకున్నారట. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ కూడా 2014లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన కొడుకు ఇప్పుడు యువకుడు అయ్యాడు. జానకి రామ్ కొడుకుని హీరోగా లాంచ్ చేసే బాధ్యతని నందమూరి ఫ్యామిలీ వైవిఎస్ చౌదరికి అప్పగించినట్లు తెలుస్తోంది.
వైవిఎస్ చౌదరికి హరికృష్ణ మనవడి కోసం క్రేజీగా ఉండే లవ్ స్టోరీ రెడీ చేశారట. ఈ చిత్రం త్వరలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ ని కూడా త్వరలో ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైవిఎస్ చౌదరి సినిమా చేసే దాదాపు 9 ఏళ్ళు గడుస్తోంది. సాయిధరమ్ తేజ్ ని హీరోగా లాంచ్ చేసిన రేయ్ చిత్రమే ఆయనకి చివరి చిత్రం.
ఇప్పుడు వైవియస్ చౌదరికి నందమూరి నాల్గవ తరం వారసుడిని లాంచ్ చేసే అవకాశం దక్కింది. డైరెక్షన్ కి 9 ఏళ్ళు దూరంగా ఉన్న వైవిఎస్ చౌదరి ఏం చేస్తాడో చూడాలి మరి.
కొత్త వారిని లాంచ్ చేయడంలో వైవిఎస్ కి ప్రత్యేకత ఉంది. హీరో రామ్ ని దేవదాసు చిత్రంతో లాంచ్ చేసి హిట్ అందించాడు. ఇక హరికృష్ణ తో బ్లాక్ బస్టర్ చిత్రాలు చేశాడనే క్రేజ్ ఎలాగు ఉంది. ఇప్పుడు ఆయన మనవడిని లాంచ్ చేయబోతున్నారు.