నాగ చైతన్య కోసం వెళ్లి నాగార్జునపై బాలయ్య సెటైర్..అతిరథ మహారథులు ఉండగా అంతమాట అనేశాడు
నాగార్జున, బాలయ్య మధ్య ఏవో విభేదాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో ఒక ప్రచారం ఉంది. అయితే వీళ్ళిద్దరూ ఒకప్పుడు మంచి స్నేహితులు. కానీ ఎప్పుడు ఎలా విభేదాలు మొదలయ్యాయి తెలియదు.
నందమూరి బాలకృష్ణ ముక్కుసూటి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఎలాంటి సందర్భంలో అయినా ఎంతమంది ఉన్నా తాను చెప్పాలనుకున్న విషయం మొహమాటం లేకుండా చెప్పేస్తారు. నాగార్జున, బాలయ్య మధ్య ఏవో విభేదాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో ఒక ప్రచారం ఉంది.
అయితే వీళ్ళిద్దరూ ఒకప్పుడు మంచి స్నేహితులు. కానీ ఎప్పుడు ఎలా విభేదాలు మొదలయ్యాయి తెలియదు. నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య సినీ రంగ ప్రవేశం ఒక రేంజ్ లో జరిగింది. నాగ చైతన్య జోష్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. హైప్ ఏర్పడ్డ స్థాయిలో ఆ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.
జోష్ ఆడియో వేడుకకి సినిమా రంగం నుంచి, రాజకీయ రంగం నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్కినేని కుటుంబ సభ్యులు, దగ్గుబాటి కుటుంబ సభ్యులు మొత్తం పాల్గొన్నారు. ఏఎన్నార్, రామానాయుడు, సురేష్ బాబు ఆడియో వేడుకలో భాగం అయ్యారు. మోహన్ బాబు, వెంకటేష్, రాజమౌళి, శ్రీనువైట్ల లాంటి ప్రముఖులంతా హాజరయ్యారు.
బాలయ్య జోష్ ఆడియో వేడుకలో మాట్లాడుతూ వారసత్వాన్ని నిలబెట్టడం అంటే అనుకరించడం కాదు.. అనుసరించడం అని బాలయ్య అన్నారు. నాగార్జున ఫోన్ చేసి బాల అంటూ ప్రేమగా పిలిచారు. ఈ విధంగా నాగ చైతన్య జోష్ చిత్ర ఆడియో లాంచ్ ఉంది రావాలి అని అడిగాడు. మన కుటుంబంలో వేడుకకి నేను రాకపోవడం ఏంటి వస్తాను అని బాలయ్య చెప్పినట్లు వేదికపై తెలిపారు.
అంత మంది అతిథులుగా ఉండగా బాలయ్య నాగార్జునని ఉద్దేశించి సెటైర్ వేసారు. నాగ చైతన్య తాతగారు అక్కినేని నాగేశ్వర రావు నాకు బాబాయ్ లాంటి వారు. ఈ రోజు నేను నాగ చైతన్యకి ఒక బాబాయ్ గా ఆశీర్వదించాడు వచ్చాను అని అన్నారు.
నాగార్జున వాళ్ళ నాన్నగారిలాగే.. పోలికలన్నీ వచ్చాయి. నాగార్జున పక్కా కమర్షియల్ బిజినెస్ మ్యాన్ అంటూ బాలయ్య సెటైర్ వేశారు. దీనితో నాగార్జున సైతం షాక్ లో నవ్వేశారు. నాగార్జున సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. వ్యాపార రంగంలో నాగార్జున సంపాదన వేల కోట్లలో ఉంటుందని టాక్.