ముహూర్తం బాగలేదు, అందుకే నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ వైరల్
అఖండ, వీరసింహారెడ్డి లాంటి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తర్వాత బాలయ్య నటించిన చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన తొలి చిత్రం ఇదే.
అఖండ, వీరసింహారెడ్డి లాంటి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తర్వాత బాలయ్య నటించిన చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన తొలి చిత్రం ఇదే. శ్రీలీల బాలయ్య కుమార్తెగా నటించగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.
ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ మెప్పిస్తున్న భగవంత్ కేసరి మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో అనిల్ రావిపూడి ఆడపిల్లల గురించి ఇచ్చిన మెసేజ్ అందరికీ చేరువవుతోంది. శ్రీలీల నటనకి ప్రశంసలు దక్కుతున్నాయి.బాలకృష్ణ తొలిసారి తెలంగాణ స్టైల్ లో డైలాగులు చెప్పారు.
ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా శ్రీలీల బాలకృష్ణ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. శ్రీలీల ఈ ఇంటర్వ్యూలో బాలయ్యని అనేక ప్రశ్నలు అడిగింది. అందులో శ్రీలీల బాలయ్యని కొన్ని ఆసక్తికర ప్రశ్నలు ఉన్నాయి. మీ చిత్రాల్లో మీకు నచ్చని సినిమాలు ఏంటి అని శ్రీలీల అడగగా బాలయ్య ఆసక్తికరంగా స్పందించారు. నేరుగా ప్రశ్నకు బదులివ్వకుండా తన అభిప్రాయం చెప్పారు.
ఒక నటుడిగా నచ్చిన సినిమా ఏది, నచ్చని సినిమా ఏది అని చెప్పడం కష్టం. అన్ని సినిమాలకు ఒకే విధంగా కష్టపడతా. అందులో కొన్ని ఆడుతాయి కొన్ని ఆడవు. ఇక్కడ బాలకృష్ణ ముహూర్త బలం, జ్యోతిష్యం ప్రస్తావన తీసుకువచ్చారు. జ్యోతిష్యం విషయంలో బాలయ్యకి నమ్మకం ఎక్కువ. ప్రతి విషయంలో బాలయ్య జ్యోతిష్యాన్ని ఫాలో అవుతుంటారని ఇండస్ట్రీలో టాక్.
అఖండకి ముందు బాలయ్య నటించిన చిత్రాలు సరిగా ఆడలేదు. నేను నటించిన కొన్ని చిత్రాలు ఫ్లాప్ కావడానికి ముహూర్త బలం సరిగా లేకపోవడం కారణం అని బాలయ్య అన్నారు. ఆడవు అనుకున్న చిత్రాలు కూడా ఆడాయి.. ఇది ఖచ్చితంగా హిట్ అనుకున్న మూవీ కూడా ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. ముహూర్త బలం కలసి రావాలి అని బాలయ్య అన్నారు.
ముహూర్తాల విషయంలో బాలయ్య చాలా ఖచ్చితంగా ఉంటారని వినికిడి. గతంలో అఖండ రిలీజ్ కోసం బాలయ్య.. సీఎం జగన్ ని కలిసేందుకు కూడా సిద్ధం అయినట్లు పేర్ని నాని తెలిపారు. అపాయింట్ మెంట్ ఓకె అయితే ముహూర్తం చూసుకుని కలుస్తారని బాలయ్య చెప్పినట్లు గతంలో పేర్ని నాని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ముహూర్తాల విషయంలో బాలయ్య ఇష్టం మరోసారి బయటపడింది.