- Home
- Entertainment
- ఈ ఘనత సాధ్యమైంది ఎన్టీఆర్ కొడుకుని కాబట్టి కాదు, నేను డూప్లికేట్ యాక్టర్ ని కాదు.. బాలయ్య సెటైర్లు వైరల్
ఈ ఘనత సాధ్యమైంది ఎన్టీఆర్ కొడుకుని కాబట్టి కాదు, నేను డూప్లికేట్ యాక్టర్ ని కాదు.. బాలయ్య సెటైర్లు వైరల్
నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో సన్మానం జరిగింది. ఈ ఈవెంట్ లో బాలయ్య ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలపై సెటైర్లు వేశారు.

బాలయ్యకి సన్మానం
గోవాలో గురువారం 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకలకు దేశం నలుమూలల నుంచి సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణకి అరుదైన గౌరవం లభించింది. ఈ ఈవెంట్ లో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి మురుగన్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. బాలకృష్ణని సన్మానించారు. బాలయ్య నటుడిగా 50 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సన్మానం జరిగింది.
ఈ ఘనత సాధ్యమైంది ఎన్టీఆర్ కొడుకుని కాబట్టి కాదు
ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాలో టెక్నాలజీ డామినేషన్, విజువల్ ఎఫెక్ట్స్ వాడకం, ఈ తరం ఆర్టిస్టుల గురించి బాలయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. తనని తాను ఒరిజినల్ యాక్టర్ గా అభివర్ణించారు. బాలయ్య మాట్లాడుతూ.. ''నేను ఇండస్ట్రీలో నటుడిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నాను. ఇది ఎన్టీఆర్ కి తాను కొడుకు కావడం వల్ల సాధ్యం కాలేదు. ఇది నేను క్యారీ చేస్తున్న లెగసీ, సినిమా పట్ల నాకున్న నాలెడ్జ్ వల్లే సాధ్యం అయింది'' అని బాలకృష్ణ అన్నారు.
నేను ఒరిజినల్ యాక్టర్ ని..
బాలకృష్ణ ఇంకా మాట్లాడుతూ.. ''సినిమా పట్ల నాకున్న అవగాహనకి గర్వపడుతున్నాను. కానీ ప్రస్తుతం సినిమా మేకింగ్ విధానం పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీ డామినేషన్ వచ్చేసింది. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వాడుతున్నారు. నా సినిమాలు లార్జర్ దేన్ లైఫ్ గా ఉంటాయి. కాబట్టి నేను ఎంచుకునే కథలు చాలా కీలకం. నా సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కేవలం అవసరమైన చోటు మాత్రమే వాడతాం. కొన్ని సినిమాల్లో ప్రతిదానికీ విజువల్ ఎఫెక్ట్స్ వాడేస్తున్నారు. కనీసం హీరోలు సెట్స్ కి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది హీరోలు గ్రీన్ మ్యాట్స్ మధ్యలో నటించి వెళ్లిపోతున్నారు. కానీ నేను అలా కాదు. నేను ఒరిజినల్ యాక్టర్ ని. డూప్లికేట్ కాదు'' అని బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భార్యకి కృతజ్ఞతలు చెప్పిన బాలయ్య
అదేవిధంగా బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి గురించి కూడా మాట్లాడారు. మా తల్లి మరణం తర్వాత బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి సహకరించిన తన భార్య, ఇతర కుటుంబ సభ్యులకు బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు.
బాలకృష్ణ సినిమాలు
బాలకృష్ణ తన 50 ఏళ్ళ కెరీర్ లో రౌడీ ఇన్స్పెక్టర్, మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, భైరవ ద్వీపం, ఆదిత్య 369 లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించారు. గురువారం ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు నవంబర్ 28 వరకు కొనసాగుతాయి.

