- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Nov 21: సాగర్‌ను ఘోరంగా అవమానించిన నర్మద తండ్రి, అమూల్యను కాపాడిన వల్లి
Illu Illalu Pillalu Today Episode Nov 21: సాగర్‌ను ఘోరంగా అవమానించిన నర్మద తండ్రి, అమూల్యను కాపాడిన వల్లి
Illu Illalu Pillalu Today Episode Nov 21: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో సాగర్ ను నర్మద తండ్రి చాలా అవమానిస్తాడు. ఆ మాటలు తలచుకుంటూ తీవ్రంగా బాధపడతాడు సాగర్. మరోపక్క వల్లి తెలివిగా అమూల్యను కాపాడేసింది

సాగర్ ను అవమానించిన నర్మద తండ్రి
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో సాగర్ బియ్యం బస్తాలను షాపులకు వేయడంతో మొదలవుతుంది. నర్మద రిజల్ట్స్ రాగానే ఫోన్ చేస్తుందని చెప్పింది కదా ఇంకా ఫోన్ చేయలేదేంటి అని సాగర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపు నర్మద తండ్రి చేతిలో పేపర్‌తో సాగర్ దగ్గరికి వస్తాడు. అది చూసిి సాగర్ సంతోషంగా ఫీల్ అవుతాడు. నర్మద తండ్రి వచ్చి ‘నీకు ఈ రైస్ మిల్లు పని కరెక్ట్. నువ్వు ఇలా బస్తాలు మూసుకోవడానికే పనికొస్తావు. జీవితంలో ఇంతకుమించి నువ్వు ఏమి చేయలేవు. ఏదీ సాధించలేవు’ అని పేపర్ సాగర ముఖాన కొడతాడు. ‘విఆర్ఓ పోస్ట్ కి క్వాలిఫై అవ్వలేదు ఫెయిల్ అయ్యావు. కచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొడతానని, అల్లుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని గర్వంగా చెబుతాను అని నాతో ఛాలెంజ్ చేశావు కదా.. ఇదేనా నీ ఛాలెంజ్’ అని సాగర్ ని మరింతగా బాధపడతాడు. ఈలోపు అక్కడికి నర్మద వస్తుంది. నర్మద తండ్రి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు.
అమూల్య గురించే ఆలోచిస్తున్న వేదవతి
ఇక్కడ నుంచి సీన్ వేదవతి దగ్గరికి మారుతుంది. వేదవతి వంటగదిలో ఉండి అమూల్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు ప్రేమ అక్కడికి వచ్చి అత్తయ్య కంగారు పడడం చూస్తుంది. అలాగే వల్లి కూడా చూస్తుంది. అసలు విషయాన్ని వేదవతి ప్రేమకు చెప్పేస్తుంది. ప్రేమ మాట్లాడుతూ ‘మా అన్న బండిమీద అమూల్య ఎక్కడం ఏంటి? అసలు వాడి బండి తను ఎందుకు ఎక్కుతుంది’ అని ప్రశ్నిస్తుంది. ఇదంతా వల్లి వింటూ ఉంటుంది. ప్రేమ ‘మీరు ఎవరినో చూసి అమూల్య అనుకుని ఉంటారు. పొరపాటు పడి ఉంటారు. అమూల్యకి విశ్వా అంటే చాలా కోపం. కనీసం వాడితో మాట్లాడదు. అలాంటిది వాడి బైక్ ఎందుకు ఎక్కుతుంది’ అని అంటుంది. వేదవతి మాత్రం ఒప్పుకోదు. ఉదయం అమూల్య కాలేజీకి వెళుతూ వేసుకున్న డ్రెస్సు.. విశ్వ బండి మీద ఉన్న అమ్మాయి వేసుకున్న డ్రెస్సు ఒక్కటే అని అంటుంది వేదవతి.
చున్నీ మార్చేసిన వల్లి
ఇదంతా విన్నాక వల్లి.. అమూల్య కు సపోర్ట్ చేసేందుకు సిద్ధమవుతుంది. అమూల్య డ్రెస్ పైన ఉన్న చున్నీని తీసి తెల్ల రంగు చున్ని వేస్తుంది. ‘నువ్వు విశ్వ బండిమీద వెళ్లావు కదా.. ఈ విషయం మీ అమ్మకు తెలిసిపోయింది కాబట్టి నీ డ్రెస్ ను పోల్చేస్తుంది. అందుకే చున్ని మార్చుకో’ అని చెబుతుంది. అమూల్య అలాగే చేస్తుంది. వేదవతి అమూల్యను ‘విశ్వ బండి మీద ఎక్కావా’ అని ప్రశ్నిస్తుంది. కానీ అమూల్య మాత్రం ఒప్పుకోదు. నేను ఎక్కలేదని వాదిస్తుంది. అమూల్యకు సపోర్టుగా వల్లి మాట్లాడుతుంది. ప్రేమ కూడా ఇదే ప్రశ్నను అమూల్యను అడుగుతుంది. దీంతో అమూల్య చాలా ఫీల్ అయిపోతూ ‘నేను ఎందుకు విశ్వ బండి ఎక్కుతాను. మీరు నన్ను బాధ పెడుతున్నారు’ అంటుంది. చివరికి అందరూ ఊరుకోవడంతో అమూల్య ఇంట్లోకి వెళ్లిపోతుంది.
వల్లి.. అమూల్యతో మాట్లాడుతూ ‘నువ్వు విశ్వ బండి ఎక్కవంటే విషయం చాలా దూరం వచ్చిందన్నమాట’ అని అంటుంది. దానికి అమూల్య సిగ్గు పడుతుంది. అమూల్య వెళ్ళిపోయాక మళ్ళీ తనలో తాను ‘సమయానికి చున్నీ తీసుకెళ్లి మార్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నా విషయం కూడా బయటపడి.. నేను కూడా బయటికి పోవాల్సి వచ్చేది. ఇంకా ముందు ముందు ఇలాంటి పనులు ఎన్ని చేయాల్సి వస్తుందో’ అని అనుకుంటుంది వల్లి.
ఉద్యోగం రానందుకు సాగర్ బాధ
మరోపక్క సాగర్ తనకు ఉద్యోగం రానందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. మామయ్య అన్న మాటలను తలుచుకొని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ సమయానికి నర్మద వస్తుంది. అయితే సాగర్ మాట్లాడుతూ ‘నిజంగా నేను చేతకాని వాడిని కదా’ అని అంటాడు. వల్లీ దొంగచాటుగా వచ్చి వారిద్దరి మాటలు వింటూ ఉంటుంది. సాగర్ నర్మదతో ‘మీ నాన్న నా గురించి అన్న మాటలు అన్నీ నిజమే. నా కుటుంబం కోసం నువ్వే మొదట ఉంటావు. కానీ నీకు నీ పుట్టింటిని దగ్గర చేయలేకపోతున్నాను’ అని సాగర్ ఎంతో మదన పడుతూ ఉంటాడు. ‘నేను ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే మీ నాన్న నన్ను అల్లుడిగా అంగీకరిస్తానని చెప్పాడు. అందుకోసం ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ సాధించి ఉంటే నువ్వు మీ వాళ్ళకి దగ్గరయ్యి ఉండే దానివి. తిరిగి వాళ్ళ ప్రేమను పొంది ఉండేదానికి నా భర్తకు జాబ్ వచ్చింది నాన్నా అని గర్వంగా తలెత్తుకొని మీ వాళ్లకు చెప్పుకునే దానివి. నా భార్యకు పుట్టింటికి దగ్గర చేసే అవకాశాన్ని ఇవ్వలేని అసమర్ధుడని కదా’ అని అంటాడు.
సాగర్ హాల్ టికెట్ వల్లీ చేతిలో
వల్లీ ఇదంతా వినేస్తుంది. భార్యాభర్తలిద్దరూ సీక్రెట్ గా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అనుకుంటుంది. ‘మామయ్య గారికి తెలియకుండా నర్మదా ఈ పని చేస్తుంది.. అత్తమామల ముందు ఉత్తమ కోడలుగా నటిస్తూ ఇంత పెద్ద భారీ ప్లాన్ వేసింది. ఈ విషయం మావయ్యకి చెప్పేయాలి’ అని అనుకుంటుంది. కానీ ఎలా నిరూపించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ సంపాదిస్తే మావయ్య గారి ముందు నిరూపించవచ్చని వెతుకుతుంది. ఆ హాల్ టికెట్ వల్లికి దొరుకుతుంది. ఇక్కడితో ఈనాటి ఎపిసోడ్ ముగిసిపోతుంది.

