- Home
- Entertainment
- రాష్ట్రపతి చేతుల మీదుగా బాలయ్యకి పద్మభూషణ్ అవార్డు, నారా లోకేష్ తో సహా ఫ్యామిలీ మొత్తం హాజరు
రాష్ట్రపతి చేతుల మీదుగా బాలయ్యకి పద్మభూషణ్ అవార్డు, నారా లోకేష్ తో సహా ఫ్యామిలీ మొత్తం హాజరు
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బాలయ్యకి పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Nandamuri Balakrishna
నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా మంచి జోష్ లో ఉన్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుసగా నాలుగు సూపర్ హిట్స్ కొట్టారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ 2లో నటిస్తున్నారు. అటు రాజకీయాల్లో కూడా బాలయ్య రాణిస్తున్న సంగతి తెలిసిందే. హిందూ పురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Nandamuri Balakrishna
గతంలో రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బాలయ్యకి పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా రంగంలో నటుడిగా సేవలందిస్తున్న బాలయ్య.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సేవ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. దీనితో బాలయ్య సేవలని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది.
Nandamuri Balakrishna
కాగా నేడు సోమవారం రోజు రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల వేడుక జరిగింది. ఈ వేడుకలో బాలయ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ కుటుంబ సభ్యులు అంతా హాజరు కావడం విశేషం.
Nandamuri Balakrishna
బాలకృష్ణ సతీమణి వసుంధర, కొడుకు నందమూరి మోక్షజ్ఞ హాజరయ్యారు. అదే విధంగా నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు వారి కొడుకు దేవాన్ష్.. చిన్న కుమార్తె తేజస్విని, చిన్న అల్లుడు భరత్ తో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Nandamuri Balakrishna
బాలకృష్ణ ఈ కార్యక్రమానికి తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో హాజరు కావడం విశేషం. బాలయ్య పద్మ భూషణ్ అందుకోవడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలకృష్ణ సినీ రంగంలో ఇటీవల 50 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్నారు. ఫ్యాన్స్ లో బాలయ్యకి మాస్ ఇమేజ్ ఎక్కువ. కానీ బాలయ్య తన కెరీర్ లో మాస్ చిత్రాలు మాత్రమే కాకుండా పౌరాణికాలు, జానపద చిత్రాల్లో కూడా నటించారు.