అంతా సెట్ చేయడానికి హీరో జైలు నుంచి బయటకి రావాలి.. బాలయ్య 'అన్‌స్టాపబుల్' పొలిటికల్ హీట్
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఓటీటీ వేదికపై అదరహో అనిపిస్తున్నాడు. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. సీజన్ 1 ని మించేలా సీజన్ 2 సూపర్ సక్సెస్ అయింది.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఓటీటీ వేదికపై అదరహో అనిపిస్తున్నాడు. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. సీజన్ 1 ని మించేలా సీజన్ 2 సూపర్ సక్సెస్ అయింది. టాక్ షోలలో నంబర్ 1 షోగా నిలిచింది. ఆహా వేదికపై ఈ షోకి అల్లు అరవింద్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
సీజన్ 1, సీజన్ 2 సూపర్ సక్సెస్ తర్వాత బాలయ్య సీజన్ 3కి రెడీ అవుతున్నారు. సీజన్ 3 చిన్న లిమిటెడ్ ఆడిషన్ లాగా ఉంటుంది. తొలి ఎపిసోడ్ ని భగవంత్ కేసరి ప్రమోషన్స్ కోసమే ప్లాన్ చేశారు. అక్టోబర్ 17న ప్రసారం కాబోతున్న ఈ తొలి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు.
ఈ ఎపిసోడ్ లో భగవంత్ కేసరి చిత్ర యూనిట్ బాలయ్యతో కలసి సందడి చేసింది. తొలి ఎపిసోడ్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి, చందమామ కాజల్ అగర్వాల్, సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల, అలాగే విలన్ గా నటించిన అర్జున్ రాంపాల్ ఈ షోలో పాల్గొన్నారు.
ప్రోమో చూస్తే బాలయ్య పరోక్షంగా కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా చేసినట్లు అర్థం అవుతోంది. మేము ఏ తప్పు చేయము అని మీకు తెలుసు, ఎవ్వరికి తల మంచం అని మీకు తెలుసు.. మమ్మల్ని ఆపడానికి ఎవ్వరూ రాలేరని మీకు తెలుసు అంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ తో అన్ స్టాపబుల్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు.
బాలయ్య తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ సందడి చేశారు. అనిల్ రావిపూడి కళ్ళజోడు పెట్టుకుంటుంటే.. ఏంటి ఇంటెలిజెంట్ లాగా కళ్ళజోడు పెట్టుకుంటున్నావ్ అని బాలయ్య అంటారు. లేదు బాబు మడిచి పాకెట్ లో పెట్టేసుకుంటా అని అనిల్ రావిపూడి అనడం.. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో నాకెందుకు అని బాలయ్య సమాధానం ఇవ్వడం చాలా ఫన్నీగా ఉంది.
ఇక హీరోయిన్లు కాజల్, శ్రీలీల ఎంతో బ్యూటిఫుల్ గా ఎంట్రీ ఇచ్చారు. బాలయ్య కాజల్ ని ప్రశంసలతో ముంచెత్తారు. నందమూరి హీరోలందరితో చేశావ్.. కొణిదెల హీరోలతో చేశావ్.. మోక్షజ్ఞతో సినిమా చేస్తావా అని బాలయ్య కాజల్ ని ఫన్నీగా అడిగారు. 100 పెర్సెంట్ అంటూ కాజల్ ఎనెర్జిటిక్ ఆన్సర్ ఇచ్చింది. బాలయ్య ఇద్దరు హీరోయిన్లతో వేదికపై తెగ అల్లరి చేసినట్లు ఉన్నారు. ఇక శ్రీలీల గురించి బాలయ్య మాట్లాడుతూ.. నిర్మాతలు, దర్శకులు సినిమా చేస్తే బాలయ్యతో చేయాలి లేదా శ్రీలీల తో చేయాలి అని అంటున్నారు అని సరదాగా ఆమె జోరు గురించి అన్నారు. దీనికి శ్రీలీల సిగ్గు పడిపోయింది.
భగవంత్ కేసరి చిత్రం గురించి మాట్లాడుతూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత ఏపీ లో జరుగుతున్న పరిణామాలని ప్రతిభింబించే విధంగా ఉన్నాయి. సినిమా అయినా, జీవితం అయినా అంతా బావున్నప్పుడు మొత్తం నాశనం చేయడానికి ఒకడు దిగుతాడు. మళ్ళీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటకి రావాలి అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.