MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వరుసగా 4 హిట్లు, బాలయ్యలో మార్పు వచ్చింది.. ఈ జోరుకి కారణం ఎవరు ?

వరుసగా 4 హిట్లు, బాలయ్యలో మార్పు వచ్చింది.. ఈ జోరుకి కారణం ఎవరు ?

నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా ప్రస్తుతం మంచి జోరు ప్రదర్శిస్తున్నారు. బాలయ్య కెరీర్ లో పీక్ స్టేజి అంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు విడుదలైన టైం అనే చెప్పాలి. ఆ రేంజ్ లో కాకున్నా ప్రస్తుతం బాలయ్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రాణిస్తున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 12 2025, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా ప్రస్తుతం మంచి జోరు ప్రదర్శిస్తున్నారు. బాలయ్య కెరీర్ లో పీక్ స్టేజి అంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు విడుదలైన టైం అనే చెప్పాలి. ఆ రేంజ్ లో కాకున్నా ప్రస్తుతం బాలయ్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రాణిస్తున్నాయి. సీనియర్ హీరోల్లో బాలయ్య వరుసగా నాలుగు హిట్లు కొట్టడం అంటే రేర్ ఫీట్ అని చెప్పొచ్చు. 

 

25

అఖండతో మొదలైన బాలయ్య తాండవం తాజాగా విడుదలైన డాకు మహారాజ్ చిత్రంతో కూడా కొనసాగుతోంది. నేడు విడుదలైన డాకు మహారాజ్ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సెకండ్ హాఫ్ కొంత స్లోగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఉందని అంటున్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా బాలయ్య నాలుగు హిట్లు అందుకున్నారు. 

 

 

35

కొన్నేళ్ల క్రితం బాలయ్య నటించిన సినిమాలు గమనిస్తే ట్రోలింగ్ స్టఫ్ గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. సింహా ముందు వరకు బాలయ్య నటించిన చాలా చిత్రాలు ట్రోలింగ్ కి గురయ్యాయి. సింహా తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడింది. పూర్తిగా కాదు. అఖండ తర్వాత బాలయ్యలో స్పష్టమైన మార్పు మొదలయింది. బాలయ్య లో ఇంత మార్పుకి కారణం ఏంటి ? వరుస హిట్లు ఎలా సాధ్యం అవుతున్నాయి అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. 

 

45

బాలకృష్ణ గతంలో డైరెక్టర్లని గుడ్డిగా నమ్మేవారు. అందుకు ఉదాహరణ ఒక్క మగాడు చిత్రం. కథ కూడా వినకుండా వైవిఎస్ చౌదరి తమ ఫ్యామిలీకి అభిమాని అని బాలయ్య ఆ చిత్రం చేశారు. రిజల్ట్ ఏంటో అందరికీ తెలుసు. ఆలాంటి సిల్లీ కథలతో బాలయ్య చాలా చిత్రాలు చేశారు. కానీ అఖండ నుంచి బాలయ్య దర్శకులని గుడ్డిగా నమ్మడం లేదు. బాలయ్యలో వచ్చిన ప్రధానమైన మార్పు ఇదే. కథా చర్చల్లో బాలయ్య బాగా ఇన్వాల్వ్ అవుతున్నారట. భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాల్లో బాలయ్య స్వయంగా కొన్ని ఐడియాలు ఇచ్చారట. అవసరమైన మార్పలు సూచించారు. తన ఫ్యాన్స్ కి ఏమి కావాలి అనేది బాలయ్య డైరెక్టర్లకి చెబుతున్నారు. 

 

55

బాలయ్యలో వచ్చిన మరో మార్పు ఏంటంటే.. ట్రెండుకి తగ్గట్లుగా యువ దర్శకులని ఎంచుకోవడం. అవుట్ డేటెడ్ డైరెక్టర్లని పక్కన పెట్టేసి తన బాడీ లాంగ్వేజ్ పూర్తిగా తెలిసిన బోయపాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే విధంగా గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బాబీ లాంటి యువ దర్శకులని బాలయ్య ఎంచుకుంటున్నారు. తాను ఎంచుకునే కథల విషయంలో బాలయ్య తన చిన్న కుమార్తె తేజస్విని అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నారట. ఇటీవల తేజస్విని తన తండ్రి సినిమాల కథల ఎంపిక, ఇతర విషయాలని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బాలయ్య వరుస హిట్లు కొడుతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ
Latest Videos
Recommended Stories
Recommended image1
మణిరత్నం సంచలనం.. 34 ఏళ్ల బంధానికి బ్రేక్.. రెహమాన్‌ను కాదని కుర్రాడికి ఛాన్స్
Recommended image2
Ustaad Bhagat Singh Movie Review: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీ రివ్యూ, పవన్‌ కళ్యాణ్‌ విశ్వరూపం చూపించాడా?
Recommended image3
ధురంధర్ స్టార్ రణ్‌వీర్ సింగ్ 100 కోట్ల ఇల్లు, అరేబియా సముద్రం కనిపించేలా అద్భుత భవనం ఎలా ఉందో చూశారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved