NBK107 leak: లొకేషన్ లో బాలయ్య మ..మ.. మాస్.. గెటప్ అదుర్స్ కదా, పిక్స్ వైరల్
అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK 107(వర్కింగ్ టైటిల్). గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK 107(వర్కింగ్ టైటిల్). గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గోపీచంద్ మలినేని ఈ చిత్రంలో బాలయ్యని నెవర్ బిఫోర్ మాస్ అవతార్ లో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, బాలకృష్ణ లుక్స్ ఫాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ బిజీ షెడ్యూల్ లో జరిగుతోంది. రానున్న వారం రోజుల్లో బాలయ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో షూటింగ్ లో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఆలంపూర్ లో జరుగుతోంది. షూటింగ్ లొకేషన్ నుంచి బాలకృష్ణ పిక్స్ లీక్ అయ్యాయి.
లీకైన పిక్స్ లో బాలయ్య మాస్ లుక్ లో అదరగొడుతున్నారు. వైట్ అండ్ వైట్ లో బాలయ్య తనదైన స్టైల్ లో అదరగొడుతున్నారు. బాలయ్య బ్రేక్ సమయంలో ఫోన్ మాట్లాడుతూ బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు.
మరికొన్ని పిక్స్ లో బాలయ్య నడుస్తూ వస్తుండగా అభిమానులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. ఈ ఫొటోస్ లో బాలయ్య లుక్ నందమూరి ఫ్యాన్స్ కి ట్రీట్ లా మారింది.
రానున్న రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ యాగంటి, కర్నూలు, ఓర్వకల్లు లాంటి ప్రాంతాల్లో జరగనుంది. షూటింగ్ లొకేషన్స్ ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రాంతాలు కనిపిస్తున్నాయి. కథలో దేవాలయాలకి సంబందించిన అంశం ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో బాలయ్యకి హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గోపీచంద్ మలినేని చివరగా క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్నారు. బాలయ్య అఖండతో జోష్ మీద ఉన్నారు. వీరిద్దరి కలయికలో ఈ చిత్రం వస్తుండడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.