బాలకృష్ణ బౌన్సర్లని ఎందుకు పెట్టుకోరో తెలుసా.. ఊహించని కారణం చెప్పిన నందమూరి హీరో
టాలీవుడ్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలంతా బౌన్సర్ల సహాయంతో ఈవెంట్స్ కి హాజరవుతుంటారు. లేకుంటే అభిమానుల నుంచి ఇబ్బంది తప్పదు. సెల్ఫీల కోసం షేక్ హ్యాండ్స్ కోసం ఫ్యాన్స్ ఎగబడుతుంటారు.

టాలీవుడ్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలంతా బౌన్సర్ల సహాయంతో ఈవెంట్స్ కి హాజరవుతుంటారు. లేకుంటే అభిమానుల నుంచి ఇబ్బంది తప్పదు. సెల్ఫీల కోసం షేక్ హ్యాండ్స్ కోసం ఫ్యాన్స్ ఎగబడుతుంటారు. దీనితో స్టార్ హీరోలంతా చుట్టూ బౌన్సర్లతో పబ్లిక్ లోకి ఎంటర్ అవుతుంటారు.
టాలీవుడ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న ఒకే ఒక్క హీరో మాత్రం బౌన్సర్లని పెట్టుకోరు. ఆయన ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ. బాలయ్య చుట్టూ అంతగా బౌన్సర్లు కనిపించరు. ఒకరిద్దరు సెక్యూరిటీ ఉంటారు తప్ప బాలయ్య బౌన్సర్లని పెట్టుకోలేదు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా బాలయ్య అదిరిపోయే సమాధానం ఇచ్చారు.
నాకు బాడీ గార్డ్స్ అవసరం లేదు.. ఎందుకంటే నాకు నేనే బాడీ గార్డ్ అని బాలయ్య తెలిపారు. తాను బాడీ గార్డ్స్ ని పెట్టుకోకపోవడానికి మరో కారణం కూడా ఉందని బాలయ్య తెలిపారు. తన అభిమానులు క్రమశిక్షణ కలిగిన వారని బాలయ్య తెలిపారు. కాబట్టి నాకు బౌన్సర్లు అవసరం లేదని అన్నారు.
ఉన్నపళంగా కొందరు అభిమానులు హీరోల దగ్గరికి వెళ్లి వాళ్ళ కాళ్లపై పడుతుంటారు. ఈవెంట్స్ లో ఇలాంటి దృశ్యాలు చూస్తుంటాం. వెంటనే బౌన్సర్లు స్పందించి వాళ్ళని పక్కకి నెట్టివేస్తుంటారు. బాలయ్యతో అలా ప్రవర్తించి ఆయన చేతిలో ఫ్యాన్స్ దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. బహుశా బాలయ్య కొడతారని భయంతో కూడా ఫ్యాన్స్ క్రమశిక్షణ పాటిస్తూ ఉండొచ్చు.
బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రంతో బాలయ్య ఖాతాలో మరో సంక్రాంతి హిట్ పడింది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ నటించారు. ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది.