MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • అలా అయితేనే పెళ్లి ... మహేష్ కి నమ్రత పెట్టిన కండిషన్స్ ఏమిటో తెలుసా? కీలక విషయాలు వెలుగులోకి!

అలా అయితేనే పెళ్లి ... మహేష్ కి నమ్రత పెట్టిన కండిషన్స్ ఏమిటో తెలుసా? కీలక విషయాలు వెలుగులోకి!

సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ ల వివాహం అప్పట్లో ఓ సెన్సేషన్. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ లవ్లీ కపుల్ ప్రేమ కథలో చాలా మలుపులు ఉన్నాయి. కాగా పెళ్లికి ముందు వీరు ఓ కీలక ఒప్పందం చేసుకున్నారట.  

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 13 2024, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

 మహేష్ ప్రేమ కథలో సినిమాకు మించిన డ్రామా, ట్విస్ట్స్ చోటు చేసుకున్నాయి. చాలా రిజర్వుడుగా ఉండే మహేష్.. హీరోయిన్ నమ్రతను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం అనూహ్య పరిణామం. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

పలు సందర్భాల్లో మహేష్, నమ్రత తమ ప్రేమ, పెళ్లి గురించి స్పందించారు. ఆనాడు జరిగిన ఆసక్తికర సంఘటనలు వివరించారు. హీరోగా మహేష్ మూడవ చిత్రం వంశీ. దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించిన ఈ మూవీలో హీరోయిన్ గా నమ్రత శిరోద్కర్ ని ఎంచుకున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వంశీ షూటింగ్ సమయంలో మహేష్-నమ్రత మధ్య ప్రేమ చిగురించింది. 

39

వంశీ మూవీ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25 రోజులు అక్కడ షూటింగ్ జరిగింది. ఆ సమయంలోనే నమ్రత, మహేష్ ప్రేమలో పడ్డారు. సినిమాకు అదే చివరి షెడ్యూల్ కాగా... షూటింగ్ పూర్తి అయితే ఇకపై కలుస్తామా లేదా? అనే వేదన ఇద్దరిలో ఉంది. ఆలస్యం చేయడం మంచిది కాదని గ్రహించిన నమ్రత ముందుగా మహేష్ తో తన ప్రేమ వ్యక్తీకరించారట. అప్పటికే నమ్రత అంటే ఇష్టం పెంచుకున్న మహేష్ వెంటనే ఓకే చెప్పారట. 

 

49

వంశీ మూవీ 2000లో విడుదల కాగా... ఐదేళ్లు మహేష్-నమ్రత రహస్యంగా ప్రేమించుకున్నారు. వీరి గురించి ఎలాంటి ఎఫైర్ రూమర్స్ బయటికి రాకపోవడం విశేషం. 2005 ఫిబ్రవరి 10న అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం జరిగింది. మహేష్ రహస్యంగా నమ్రతను వివాహం చేసుకున్నారన్న వార్తలు సంచలనం రేపాయి. 

59

అయితే ఎంత ప్రేమించుకున్నప్పటికీ వీరిద్దరి మధ్య కొన్ని అగ్రిమెంట్స్ జరిగాయట. మహేష్ కొన్ని షరతులు నమ్రతకు విధించగా, కొన్ని షరతులు నమ్రత మహేష్ కి విధించిందట. అవేమిటంటే.. 
 

69
Mahesh Babu

Mahesh Babu

పెళ్లయ్యాక సినిమాలు మానేయాలని నమ్రతతో మహేష్ బాబు అన్నారట. గృహిణిగా మారి కుటుంబ బాధ్యలు తీసుకోవాలని చెప్పారట. అందుకు నమ్రత అంగీకరించిందట. అదే సమయంలో ఆమె కూడా మహేష్ కి ఒక కండిషన్ పెట్టిందట. 
 

79

నీ షరతులు నాకు ఓకె, నా షరతులు కూడా ఉన్నాయన్న నమ్రత... మహేష్ కి కొన్ని నిబంధనలు చెప్పారట. నాకు పెద్ద పెద్ద బంగ్లాలో జీవించిన అనుభవం లేదు. కాబట్టి కొన్నాళ్లపాటు మనం మీ కుటుంబానికి దూరంగా చిన్న అపార్ట్మెంట్ లో ఉందాము. నేను అడ్జస్ట్ అయ్యాక బంగ్లాకి మారుదాం అన్నాడట. మహేష్ అనుమతి ఇవ్వడంతో పెళ్ళికి రెడీ అయ్యారట. 
 

89


ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నమ్రత వివాహం జరిగాక సినిమాలు మానేసింది. మహేష్ కాపురం హైదరాబాద్ లోని అపార్ట్మెంట్ లో పెట్టాడట. అదీ సంగతి. 

 

99

మహేష్-నమ్రతలకు ఇద్దరు సంతానం. అబ్బాయి గౌతమ్ టీనేజ్ లో ఉన్నాడు. ఇక అమ్మాయి సితార 11 ఏళ్ల పాప, సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అప్పుడే సెలబ్రిటీ హోదా అనుభవిస్తుంది. టాలీవుడ్ లవ్లీ ఫ్యామిలీ గా మహేష్ కుటుంబాన్ని చెప్పుకుంటారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Injury: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక, షూటింగ్స్ తో ఇక ఫుల్ బిజీ.. ఇవన్నీ మిస్ అవుతా, వైరల్ ఫోటోస్
Recommended image2
Tortoise First Look: అస్సలు గుర్తు పట్టలేని విధంగా రాజ్ తరుణ్, ఇంత వైల్డ్ గా ఉన్నాడేంటి
Recommended image3
Korean Kanakaraju: థియేటర్స్ లో సక్సెస్, ఓటీటీ స్ట్రీమింగ్ వరుణ్ తేజ్ మూవీ రెడీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved