- Home
- Entertainment
- 100 సినిమాలు చేసిన హీరోయిన్, స్టార్ క్రికెటర్ తో అఫైర్, 50 ఏళ్లు దాటినా బ్యాచిలర్ గానే మిగిలిపోయిన బ్యూటీ ఎవరు?
100 సినిమాలు చేసిన హీరోయిన్, స్టార్ క్రికెటర్ తో అఫైర్, 50 ఏళ్లు దాటినా బ్యాచిలర్ గానే మిగిలిపోయిన బ్యూటీ ఎవరు?
ఆ హీరోయిన్ 100 సినిమాలు చేసింది, 50 ఏళ్లు దాటినాఇంకా పెళ్లి చేసుకోలేదు. అఫైర్ వార్తలు తక్కువేం కాదు, ఇంతకీ ఎవరా హీరోయిన్? ఎందుకు పెళ్లి చేసుకోలేదు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు బ్యాచిలర్లుగానే మిగిలిపోయారు. వారు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే రకరకాల కారణాలు, అయితే హీరోయిన్లుగా కొనసాగుతున్న కాలంలో మాత్రం వారిపై రకరకాల అఫైర్ రూమర్లు మాత్రం ఎక్కువగానే వచ్చాయి. ఈక్రమంలోనే ఓ హీరోయిన్ 50 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఈ బ్యూటీ.. స్టార్ క్రికెటర్ తో అఫైర్ రూమర్స్ తో వైరల్ అయ్యింది. ఇంతకీ ఎవరా హీరోయిన్.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలు చేసి స్టార్‌డమ్‌ను అందుకున్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం కొందరు హీరోయిన్లు వివాహ బంధానికి దూరంగా ఉండిపోతుంటారు. అలాంటి వారిలో స్టార్ నటి నగ్మా ఒకరు. ఆమె 50 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే ఆమెపై లవ్ రూమర్లు మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి.
నగ్మా ఒకప్పుడుఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలిగింది. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ సరసన 1990లో విడుదలైన బాగీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ వెంటనే సౌత్ సినిమాల్లోకి కూడా ప్రవేశించింది. మరీ ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో నటించి హిట్ సినిమాలు చేసింది నగ్మ.
తెలుగుతో పాటు సౌత్ లో తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ క్రేజ్ సంపాదించింది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించిన నగ్మా, భాషా, రిక్షావోడు, రౌడీ అల్లుడు వంటి బ్లాక్‌బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది.
నగ్మా కెరీర్‌లో 10 భాషల్లో దాదాపు 100 సినిమాలు చేసింది. నటనలోనే కాదు, భాషా పరిజ్ఞానంలో కూడా ఆమె ప్రత్యేకత చూపింది. ఆమె సినిమాల్లో చాలా తక్కువ ఫ్లాప్‌లు ఉన్నాయి. సౌత్ ఆడియెన్స్‌లో నగ్మా క్రేజ్ ఎలా ఉండేదంటే, అప్పట్లో కొందరు ఆమెకు గుడికూడా కట్టారు. నగ్మాకు అంత క్రేజ్ ఉండేది అప్పట్లో.
నగ్మా కుటుంబ నేపథ్యం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఆమె తండ్రి అరవింద్ మొరార్జీ హిందూ, తల్లి షామా ముస్లిం. తండ్రి ముంబైకి చెందిన వ్యాపారవేత్త కాగా, నగ్మ తల్లి అతనికి విడాకులు ఇచ్చి, సినిమా నిర్మాత చందర్ సదానానితో రెండవ వివాహం చేసుకుంది. నగ్మాకు జ్యోతిక, రోషిణి అనే ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. వీరిలో జ్యోతిక తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకుంది. రోషిణి కూడా కొన్ని సినిమాల్లో నటించింది.
నగ్మా తల్లి సపోర్ట్‌తోనే సినిమాల్లోకి అడుగు పెట్టింది. కానీ తన తండ్రితో ఆమెకు ఎక్కువ అనుబంధం ఉండేది. 2005లో తండ్రి మరణించిన వరకూ అతనిదగ్గరే నగ్మ ఎక్కువగా ఉండేది. కెరీర్ చివర్లో నగ్మా సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె ఇప్పటికీ రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉంది. ఆమెపై ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో అఫైర్ ఉందని గతంలో వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా మరో ఇద్దరు స్టార్స్‌తో కూడా నగ్మా డేటింగ్ చేసిందన్న గాసిప్స్ వినిపించాయి. అయితే ఆమె ఈ విషయాలపై ఎప్పటికప్పుడు స్పందించకుండా మౌనం పాటించడం గమనార్హం.
ప్రస్తుతం నగ్మా వయసు 50 దాటింది. కానీ ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు. ఆమె ఒంటరి జీవితానికి ఆమె అలవాటుపడిపోయారు. అయితే ఆమె మాత్రం రాజకీయాల్లో చాలా చురుకుగా ఉన్నారు. ఇక తన తల్లీ తండ్రీ విడిపోవడం చూసిన నగ్మ పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణించుకున్నట్టు సమాచారం. ఇప్పటికైతే ఆమె ఇండస్ట్రీలో లేదు. మరి తన తోటి హీరోయిన్ల మాదిరిగా మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తుందా? లేక రాజకీయాల్లోనే కెరీర్ కొనసాగిస్తుందా అన్నది వేచి చూడాల్సిన విషయమే.