నాగార్జున.. నిఖిల్ ను విన్నర్ చేయాలని చూస్తున్నారా..? రోహిణి ఎలిమినేట్, రియల్ హీరో గౌతమ్.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో చివరి నుంచి రెండో వీకెండ్ రానే వచ్చింది. కింగ్ నాగార్జున ఎవరి స్కోర్ ఏంటీ అనేది స్కోర్ బోర్డ్ చదివారు. రోహినీ ఎలిమినే అవ్వడంతో పాటు మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో 14 వీకెండ్ రానే వచ్చింది. వచ్చీ రావడంతోనే కంటెస్టెంట్స్ స్కోర్ బోర్డ్ చదివేశాడు కింగ్ నాగార్జున. అంతే కాదు ఎవరి లెక్కలు ఏంటీ అనేది కూడా తేల్చేశారు. ఇన్ని వారాలలో ఎవరు ఏ వారం.. ఏ విషయంలో రీ గ్రేడ్ అవుతున్నారు అని అందరిని అడిగాడు కింగ్. ఇక రోహిణి అవినాశ్ విషయంలో, ప్రేరణ మెగచీఫ్ అయినప్పుడు జరిగిన విషయాలలో, గౌతమ్ నోరు జారిన విషయంలో, నబిల్ తన ఆట తీరు విషమంలొ.. నిఖిల్ గౌతమ్ తో గొడవ విషయంలో రీ గ్రేడ్ అయినట్టు వెల్లడించారు.
ఎవరు ఊహించలేదు రోహిణి ఎలిమినేట్ అయవుతుంది అని. సో సండే ఎపిసోడ్ లో మరొకరు ఎలిమినేట్అవుతారు. దాంతో హౌస్ లో టాప్ 5 మెంబర్స్ ఫైనలిస్ట్ లుగా ఉండబోతున్నారు. మరి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది చూడాలి. ఎవరు ఎలిమినేట్ అవుతారుఅనే విషయాన్ని బట్టి..
టాప్ 5 ఎవరు అనేది తేలుతుంది. అవినాశ్ ఎలాగో టాప్ 5 లో ఉన్నాడు. ఇక అతనితో పాటు నిఖిల్, గౌతమ్ బెర్త్ లు కన్ఫార్మ్ అయినట్టే. నబిల్, విష్ణు, ప్రేరణ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నట్టు సమాచారం. వచ్చే వారం నుంచి గేమ్ మరింత రసవత్తరంగా మారబోతోంది. చూడాలి మరి.
ఇక సంచాలక్ గా ప్రేరణ చేసిన తప్పులకు క్లాస్ పడింది. ఇక తాడు చుట్టే విషయంలోనబిల్ కు క్లాస్ పడింది. ఇక అసలైన ఆటగాళ్ళు నిఖిల్, గౌతమ్ లకు ఇద్దరికి కూడా వారి గొడవ విషమంలో ఇద్దరి తప్పులను చూపిస్తూ.. నాగార్జున గట్టిగానే క్లాస్ పీకారు. ఇక ఈక్రమంలో నిఖిల్ సేఫ్ గేమ్ గురించి సెటైర్లు వేసిన నాగార్జున.. అంతకు ముందు గౌతమ్ చేసిన తప్పులను పదే పదే ఎత్తిచూపుతూ నిఖిల్ ను పైకి లేపే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది.
నాగార్జున మాట్లాడినమాటలకు గౌతమ్ గ్రాఫ్ పడిపోతుందేమో అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. కాని గౌతమ్ చాలా పాజిటీవ్ గా స్పందించడంతో పాటు. నిఖిల్ కు మనస్పూర్తిగా సారి చెపుతూ హగ్ ఇచ్చాడు తన తప్పులు ఒప్పుకోవడంతో అందరిలో నిజంగా హీరో అయ్యాడు. సో గౌతమ్ సారి చెప్పడంతో .. నిఖిల్ కూడా కావాలని గౌతమ్ కు సారి చెప్పి హగ్ ఇచ్చినట్టుగా అనిపిచింది.
ఇక ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ అని చెప్పిన నాగార్జున బాంబ్ పేల్చాడు. ఇక ఫస్ట్ ఎలిమినేట్ అయ్యింది రోహిణి. 14వ వారం హౌస్ నుంచి వెళ్ళిపోయింది. ఇక హౌస్ లో హీరో ఎవరు... విలన్ ఎవరు అనేది వెల్లడించిందిరోహిణి. హీరోలుగా అవినాశ్, గౌతమ్, ప్రేరణ, విలన్స్ కాదు కాని.. కాస్ త తనతోనెగెటీవ్ గా అనుకున్నవారిలో విష్ణు ప్రియ, నిఖిల్, నబిల్ ముగ్గురు గురించి మాట్లాడింది రోహిణి.