MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ 6 పెద్ద డిజాస్టర్.. దారుణాతి దారుణంగా పడిపోయిన టీఆర్పీ, ఆరు సీజన్స్ లో ఇదే లోయెస్ట్..

బిగ్ బాస్ 6 పెద్ద డిజాస్టర్.. దారుణాతి దారుణంగా పడిపోయిన టీఆర్పీ, ఆరు సీజన్స్ లో ఇదే లోయెస్ట్..

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 6 ఇటీవలే ప్రారంభం అయింది. ఈసారి సీజన్ లో ఏకంగా 20 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. నాగార్జున తన హోస్టింగ్ స్కిల్స్ తో ఎలాగోలా షోని నెట్టుకొస్తున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 16 2022, 02:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 6 ఇటీవలే ప్రారంభం అయింది. ఈసారి సీజన్ లో ఏకంగా 20 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. నాగార్జున తన హోస్టింగ్ స్కిల్స్ తో ఎలాగోలా షోని నెట్టుకొస్తున్నారు. బిగ్ బాస్ షోపై ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఈ షోని చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తోనే ఉన్నారు. ప్రతి సీజన్ లో చెప్పుకోదగ్గ టిఆర్పి నంబర్స్ నమోదు కావడం చూస్తూనే ఉన్నాం. 

26

కానీ సీజన్ 6లో పరిస్థితి ఊహించని విధంగా మారిపోయింది. ప్రతి సీజన్ లో లాంచ్ ఎపిసోడ్ కి అద్భుతమైన టీఆర్పీ రేటింగ్ నమోదు కావడం చూస్తూనే ఉన్నాం. కానీ ఈసారి లాంచింగ్ ఎపిసోడ్ డిజాస్టర్ గా మారిపోయింది. దారుణమైన టిఆర్పితో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతోంది. 

36

సెప్టెంబర్ 4న బిగ్ బాస్ సీజన్ 6 లాంచ్ అయింది. ఆ ఎపిసోడ్ కి దారుణాతి దారుణంగా 8.8 టిఆర్పి రేటింగ్ నమోదైంది. నిర్వాహకులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. గత ఐదు సీజన్స్ లో టిఆర్పి రేటింగ్ గమనిస్తే.. 

 

సీజన్ 1: 16.18

సీజన్ 2: 15.05

సీజన్ 3: 17.09                        సీజన్ 6: 8.8

సీజన్ 4: 18.05

సీజన్ 5: 15.71. 

ఇలా ప్రతి సీజన్ లో 15 రేటింగ్ తగ్గకుండా నమోదువుతూ వస్తోంది. నాగార్జున మూడవ సీజన్ నుంచి హోస్ట్ గా చేస్తున్నారు. ఎప్పుడూ ఇంత దారుణమైన రేటింగ్ నమోదు కాలేదు. 

46

ఈ పరిస్థితికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ కి వస్తున్న ఆదరణతో ఓటిటిలో కూడా కొత్తగా బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ప్రారంభించారు. దీనివల్ల ప్రేక్షకులకు బిగ్ బాస్ మజా పోతోంది. రిపీట్ అవుతున్న టాస్క్ లు, గొడవలతో ప్రేక్షకులు బిగ్ బాస్ అంటే విసిగిపోతున్నారు. ఇక హౌస్ లోకి ఎంటర్ అయిన 21 మంది సభ్యులలో కేవలం నలుగురు ఐదుగురు మాత్రమే ప్రేక్షకులకి తెల్సిన వాళ్ళు ఉన్నారు. మిగిలిన వారంతా ఎవరో కూడా ఆడియన్స్ కి తెలియదు. 

56
Star maa/Hotstar

Star maa/Hotstar

ఇక బిగ్ బాస్ 6 టిఆర్పి ఈ రేంజ్ లో దారుణంగా పడిపోవడానికి ప్రధాన కారణం మరొకటి ఉంది. అదే రోజున ఆసియా కప్ లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య టి 20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ బిగ్ బాస్ 6 రేటింగ్ పై బాగా దెబ్బేసింది. 

66
Star maa/Hotstar

Star maa/Hotstar

మరి రానున్న రోజుల్లో అయినా బిగ్ బాస్ 6 రేటింగ్ పుంజుకుంటుందేమో చూడాలి. గత ఐదు సీజన్స్ తో పోల్చితే ఇప్పటికి సీజన్ 6 లో కొత్తగా ఏమీ కనిపించడం లేదు. పాత టాస్క్ లనే రిపీట్ చేస్తూ కాస్త మసాలా జోడించి చూపిస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Aamir Khan: నా సికందర్ నువ్వే.. మాజీ భార్య స్పెషల్ విషెస్! 'లగాన్' కథ విననని చెప్పాడట
Recommended image2
Ananya Panday: అతడి కోసం నన్ను నేను తగ్గించుకున్నా.. బ్రేకప్స్ పై నోరు విప్పిన అనన్య పాండే!
Recommended image3
Lokesh Kanagaraj: బ్యాంక్ ఆఫీసర్ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ వరకు.. లోకేష్ కనగరాజ్ ఆస్తి ఎన్ని కోట్లంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved