- Home
- Entertainment
- బిగ్ బాస్ తెలుగు 9 లో టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో, నాగార్జున క్లోజ్ ఫ్రెండ్ కు లైన్ క్లియర్ అయ్యిందా?
బిగ్ బాస్ తెలుగు 9 లో టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో, నాగార్జున క్లోజ్ ఫ్రెండ్ కు లైన్ క్లియర్ అయ్యిందా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలో స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే ప్రోమోలు కూడా సందడి చేస్తున్నాయి. కంటెస్టెంట్స్ విషయంలో రకరకాల ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ఈసారి బిగ్ బాస్ లోకి ఓ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రాబోతున్నట్టు సమాచారం. ఎవరా హీరో .

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కి రెడీ
బుల్లితెరపై భారీ రియాలిటీ షో బిగ్ బాస్. దేశంలో పలు భాషల్లో కోనసాగుతున్న ఈ పాపులర్ షో, తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. కాగా తెలుగుతో త్వరలో 9వ సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ సీజన్‌కు సంబంధించి ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ షోకి యూజువల్ గా ఉండే హైప్‌తో పాటు ఈసారి ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో బిగ్ బాస్ యాజమాన్యం చాలా డిపరెంట్ గా పనిచేస్తోంది. అందుకోసం వింత వింత రూల్స్ ను కూడా సెట్ చేసే పనిలో ఉన్నారు టీమ్.
KNOW
అగ్ని పరీక్ష పెడుతున్న బిగ్ బాస్
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరిట ఓ ప్రత్యేక పోటీ నిర్వహిస్తున్నారు. ఈ పోటీ ద్వారా ఐదుగురు సామాన్యులను బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో పలు బుల్లితెర సెలబ్రిటీలు, జబర్దస్త్ కమెడియన్లు, యూట్యూబ్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి హ్యాండ్సమ్ హీరో
అయితే, ఈ లిస్ట్‌లో ఒక పేరు చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆ పేరు ఏదో కాదు ఒకప్పటి టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వెంకట్. బిగ్ బాస్ సీజన్ 9లో ఈ టాలెంటెడ్ యాక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ షోలో ఒకప్పుడు పాపులర్ అయిన హీరోలు, నటులకు అవకాశం ఇస్తున్నారు. దాంతో వారికి మళ్లీ గుర్తింపు తీసుకొచ్చే వేదికగా బిగ్ బాస్ నిలుస్తోంది. లాస్ట్ సీజన్ లో ఆదిత్య అలాగే బిగ్ బాస్ లో అడుగు పెట్టాడు. అలాంటి పరిస్థితుల్లో వెంకట్ బిగ్ బాస్ హౌస్‌లో కనిపిస్తే, ఇది ఆయన కెరీర్‌కు మరో మలుపు కావొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
తెలుగులో పాపులర్ నటుడు
వెంకట్ నటుడిగా సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. అదే సమయంలో వెంకట్‌కు నాగార్జునతో సన్నిహిత సంబంధం కూడా ఏర్పడింది. అప్పటి నుంచి వారు ఫ్రెండ్స్ అయ్యారు. ఇక ఆతరువాత వెంకట్ నటించిన ఆనందం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హీరోగా, సహాయక పాత్రల్లో, విలన్‌గా కూడా ఆయన పలు చిత్రాల్లో నటించి టాలెంట్ చూపారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ (OG) సినిమాలో వెంకట్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే వెంకట్ బిగ్ బాస్ షో ద్వారా మళ్లీ ప్రజల ముందు కనిపించబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అధికారికంగా రాని ప్రకటన
అయితే వెంకట్ బిగ్ బాస్ ఎంట్రీపై ఇంకా అధికారికంగా బిగ్ బాస్ టీమ్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కానీ నాగార్జునకు సన్నిహితుడిగా ఉండటం, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో కెరీర్ ప్రారంభించటం వంటి అంశాల నేపథ్యంలో వెంకట్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వవచ్చన్న వార్తలు ఊపందుకున్నాయి. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కాని. వెంకట్ ఒకప్పుడు హ్యాండ్సమ్ హీరోగా చాలామంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. వారు బిగ్ బాస్ లో వెంకట్ ను చూసి హ్యాఫీ ఫీల్ అవుతారు.