MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 7: శివాజీ, ప్రశాంత్‌ డ్రామాలు బయటపెట్టిన నాగార్జున.. అమర్‌దీప్‌కి స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Bigg Boss Telugu 7: శివాజీ, ప్రశాంత్‌ డ్రామాలు బయటపెట్టిన నాగార్జున.. అమర్‌దీప్‌కి స్ట్రాంగ్‌ వార్నింగ్‌

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో కంటెస్టెంట్లు చేస్తున్న చేష్టలపై నాగార్జున ఫైర్‌ అయ్యాడు. శివాజీతో సహా ప్రశాంత్‌, శోభా శెట్టి, అమర్‌ దీప్‌లపై సీరియస్‌ అయ్యాడు. వారి డ్రామాలను వీడియోలతో సహా బయటపెట్టాడు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 09 2023, 11:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీన్‌ కి ఇంకో వారం మాత్రమే ఉంది. 14వ వారం రేపటితో ముగిపోయబోతుంది. రేపు ఎపిసోడ్‌లో టాప్‌ కంటెస్టెంట్లు ఎవరో తేలబోతుంది. తాజాగా శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున ఆ విషయాన్ని వెల్లడించారు. ఈ వారం సేవింగ్‌ ఉండబోదని, కేవలం ఫైనల్‌ అయ్యేది ఎవరో చెబుతామన్నారు. అంటే ఈ లెక్కన ఈ వారం ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శోభా శెట్టి ఎలిమినేట్‌ అయినట్టు వార్తలొస్తున్నాయి. ఇందులో నిజం ఏంటనేది తెలియాల్సి ఉంది. 
 

27

ఇదిలా ఉంటే శనివారం ఎపిసోడ్‌లో నాగ్‌ ఎంట్రీ ఇచ్చారు. అర్జున్‌ ఆటతీరుని ప్రశంసించారు. బాగా ఆడావని తెలిపారు. అలాగే ప్రియాంక కూడా బాగా ఆడిందని కితాబిచ్చాడు నాగార్జున. వారి ఫోటోలను పగల గొట్లేదు. ఇక మిగిలిన వారికి మాత్రం గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు నాగ్‌. వాళ్లు ఈ వారం చేసిన తప్పులను ఎత్తిచూపుతూ, ఏకంగా వీడియోలు చూపిస్తూ వారిని కడిగి పడేశాడు. 
 

37

ఇందులో శోభా శెట్టి నిజ స్వరూపం బయటపెట్టాడు. యావర్‌ విషయంలో ఆమె మాట్లాడిన మాటలు కానీ, అంతకు ముందు శివాజీ విషయంలో తాను చెప్పిన విషయాలు కానీ, ఫేవరిజం గురించి ఆమె చెప్పిన విషయాలను నాగ్‌ నిలదీశాడు. తప్పుగా మాట్లాడావని చెప్పడంతో మళ్లీ తాను కన్నీళ్లు పెట్టుకుంది. అయితే తాను డౌన్‌లో ఉండటంతో ఆ టెన్షన్‌లో డిస్టర్బ్ అవుతున్నట్టు చెప్పింది. కానీ స్ట్రాంగ్‌గా ఉండాలని, ఆట ఆడి ముందుకెళ్లాలని నాగ్‌ తెలిపారు. 

47

మరోవైపు యావర్‌ని కూడా పిలిచి క్లాస్‌ పీకాడు నాగ్‌. శోభా శెట్టితో అతను `ఛీ ఛీ ` అంటూ మాట్లాడిన తీరు, కోపం అరుస్తున్న తీరుపై నాగ్‌ ఫైర్‌ అయ్యాడు. గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చాడు. ఇక పల్లవి ప్రశాంత్‌, శివాజీల డ్రామాలను బయటపెట్టాడు నాగార్జున. పల్లవి ప్రశాంత్‌.. అమర్‌ దీప్‌పై తన చేయి కొరికాడని చెసిన ఆరోపణలను నిలదీశాడు. ఎంత కొరికాడు,నిజంగానే రక్తం వచ్చిందా అంటూ ప్రశ్నించాడు. డాక్టర్‌ మాత్రం అదేమీ లేదని చెప్పినట్టు వెల్లడించారు. దీంతో తన అతిని కవర్‌ చేసుకునేందుకు ప్రశాంత్‌ రకరకాలుగా టాపిక్‌ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసినా, నాగ్‌ మాత్రం ఫైర్‌ అవుతూ క్లాస్‌ పీకాడు. ఇలాంటివి చేసి డౌన్‌ అవుతున్నావని హెచ్చరించాడు. 
 

57

ఇక శివాజీ డ్రామాలు సైతం నాగ్‌ వెల్లడించారు. శోభా, ప్రియాంకలను ఉద్దేశించి ఆయన సోఫాలో కూర్చొని మాట్లాడిన మాటలను నిలదీశాడు. తాను మా ఇంట్లో అయితే మెడపై తొక్కి చంపేవాడిని అంటూ మాట్లాడిన వ్యాఖ్యలను తీసి నిలదీశాడు నాగ్‌. కానీ శివాజీ దాన్ని సమర్థించుకుంటూ వారి ప్రవర్తనతో అలా మాట్లాడానని, వాళ్లు అలా చేస్తున్నారని దీంతో అలా అనాల్సి వచ్చిందని, కానీ ఆ వ్యాఖ్యలు వారిని ఉద్దేశించి కాదని, తన ఇంట్లో ఇలాంటి వాళ్లు ఉంటే తొక్కేవాడిని అంటూ కవర్‌ చేసుకున్నారు శివాజీ. కానీ ఆడపిల్లలను ఎవరినైనా అలా మాట్లాడటం తప్పు అంటూ వారి సారీ చెప్పించాడు నాగ్‌. 
 

67

ఇక అమర్‌ దీప్‌కి మాత్రం సుధీర్ఘంగా క్లాస్‌ పీకాడు నాగ్‌. పల్లవి ప్రశాంత్‌ విషయంలో ఆయన చేసిన ప్రవర్తనిచూపించి మరీ ఫైర్‌ అయ్యాడు నాగార్జున. ప్రశాంత్‌ని కొరకడం, బెడ పిసకడం, పైగా మెడికల్‌ రూమ్‌కి పదా అంటూ నెట్టుకుంటూ వెళ్లడం వంటి ప్రవర్తనపై సీరియస్‌ అయ్యాడు నాగ్‌. అంతేకాదు అమర్‌ దీప్‌ పిచ్చివాడిలా ప్రవర్తించడం గురించి చెబుతూ, పిచ్చోడివి నువ్వు అని, పిచ్చి పట్టిందని, నీ ప్రవర్తన అదుపు తప్పిందని ఫైర్ అయ్యాడు. 
 

77

అంతేకాదు ప్రియాంకని పిలిపించి మరీ తన తప్పులను చూపించాడు నాగ్‌. ప్రశాంత్‌ని పర్సనల్‌గా టార్గెట్‌ చేస్తున్నావని చెప్పారు. దీంతో కంగుతిన్న అమర్‌.. సారీ చెప్పాడు. మొత్తంగా ఈ శనివారం ఎపిసోడ్‌ మొత్తం కంటెస్టెంట్లకి క్లాస్‌ పీకడాలు, వారిపై సీరియస్‌ కావడం విశేషం. మొత్తంగా శనివారం ఎపిసోడ్‌ చాలా హాట్‌ హాట్‌ గా సాగింది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన టాప్ 10 ఫొటోలు.. ఏ పోస్టుకు ఎన్ని లక్షల లైక్స్?
Recommended image2
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా? ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు?
Recommended image3
Triptii Dimri Movies: యానిమల్ బ్యూటీ చేతిలో 5 సినిమాలు.. రెండు నేరుగా ఓటీటీలోనే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved