- Home
- Entertainment
- వెంకటేష్, నాగార్జున కలిసి నటించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? బామ్మర్ది కోసం బావ పెద్ద మనసు
వెంకటేష్, నాగార్జున కలిసి నటించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? బామ్మర్ది కోసం బావ పెద్ద మనసు
నాగార్జున, వెంకటేష్ కలిసి పూర్తిస్థాయిలో ఒక్క మూవీ కూడా చేయలేదు. వరుసకి బావ, బామ్మర్దులు అయినా సినిమాలు మాత్రం చేయలేదు. అయితే వెంకీ కోసం నాగ్ ఓ మూవీలో మెరిశారు.

వెంకటేష్ చెల్లిని పెళ్లి చేసుకున్న నాగార్జున
నాగార్జున, వెంకటేష్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు. అంతేకాదు ఇద్దరు బావబామ్మర్దులు కూడా. వెంకీ చెల్లి లక్ష్మిని నాగార్జునకి ఇచ్చి పెళ్లి చేశారు. వారికి జన్మించిన అబ్బాయే నాగచైతన్య. ఆ తర్వాత నాగ్, లక్ష్మి విడిపోయారు. కొంత గ్యాప్‌తో హీరోయిన్ అమలని పెళ్లి చేసుకున్నారు నాగార్జున. అయితే పేరుకి బావ బామ్మర్దులే అయినా నాగార్జున, వెంకటేష్ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. కాకపోతే ఓ మూవీలో మాత్రం ఇద్దరూ మెరిశారు. బామ్మర్ది కోసం బావ పెద్దమనసు చేసుకున్నారు.
`త్రిమూర్తులు` సినిమాలో మెరిసిన వెంకీ, నాగ్
వెంకటేష్, నాగార్జున కలిసి కనిపించిన సినిమా `త్రిమూర్తులు`. వెంకటేష్, అర్జున్, రాజేంద్రప్రసాద్ హీరోలుగా నటించిన చిత్రమిది. కె మురళీ మోహనరావు దర్శకత్వం వహించారు. 1987లో ఈ మూవీ విడుదలైంది. ఇందులో ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలు, హీరోయిన్లంతా కలిసి కనిపించారు. ఓ సీన్ కోసం ఇండస్ట్రీని దించారు. అలా బామ్మర్ది వెంకటేష్ కోసం బావ నాగార్జున కూడా ఇందులో నటించేందుకు ఒప్పుకున్నారు.
వెంకటేష్ `త్రిమూర్తులు`లో గెస్ట్ రోల్ చేసిన నాగార్జున
ఈ సినిమాలో వెంకటేష్, అర్జున్, రాజేంద్రప్రసాద్‌తోపాటు నాగార్జున గెస్ట్ రోల్ చేశారు. వీరే కాదు చిరంజీవి, బాలయ్య, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్‌బాబు, విజయశాంతి, చంద్రమోహన్, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, రాధ, భాను ప్రియ, రాధిక, శారద, జయమాలిని, అనురాధ, వై విజయ వంటి వారు మెరిశారు. వీరంతా ఓ పాటలో గెస్ట్ రోల్స్ చేశారు. ఓ పార్టీ సాంగ్‌లో ఈ హీరోలంతా తమ జంటలతో వచ్చి అలా తళుక్కున మెరిశారు. వీరికి వెంకటేష్ సర్వెంట్‌గా సపర్యాలు చేయడం విశేషం.
బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసిన `త్రిమూర్తులు`
అప్పట్లో ఇలా ఇండస్ట్రీ మొత్తం నటించిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. సంచలనంగానూ మారింది. ఇండస్ట్రీలో అందరి చూపు ఈ చిత్రంపైనే పడింది. కానీ 1987లో విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. పాటలో స్టార్స్ హడావుడి ఉంది తప్ప, సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. సినిమా ఘోరంగా పరాజయం చెందింది. ఇలా నాగార్జున, వెంకటేష్ కలిసి ఈ ఒక్క మూవీలోనే నటించారు.
`ప్రేమమ్`లోనూ వెంకీ, నాగ్.. కానీ
ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత `ప్రేమమ్`(2016) సినిమాలో మెరిశారు. నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకుడు. ఈ సినిమాలో చైతూ తండ్రిగా మెరిశాడు నాగ్. అలాగే చైతూ అంకుల్‌గా ఏసీపీ రామచంద్ర పాత్రలో వెంకటేష్ కనిపించారు. కానీ ఇందులో నాగార్జున, వెంకటేష్‌కి మధ్య సీన్లు లేవు. ఇద్దరూ ఒక్కో సీన్లో జస్ట్ అలా కనిపించారు.