Bangarraju : బంగార్రాజు ట్విట్టర్ రివ్యూ.. అంతా ఓకె, కానీ
2016లో విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు తెరకెక్కుతోంది. నేడు భోగి పండుగ రోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
సంక్రాంతి సందడి మొత్తం బంగార్రాజు చుట్టూనే నెలకొంది. ఫెస్టివల్ వైబ్స్ ఉన్న మూవీ కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. నాగార్జున తో పాటు ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. 2016లో విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు తెరకెక్కుతోంది. నేడు భోగి పండుగ రోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ట్విట్టర్ లో టాక్ ఎలా ఉందో చూద్దాం.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోగ్గాడే.. కథ ముగిసిన దగ్గర నుంచే బంగార్రాజుని ప్రారంభించారు. ఫస్ట్ హాఫ్ కలర్ ఫుల్ గా విలేజ్ సెటప్ లో జరుగుతుంది. నాగ చైతన్య మాస్ లుక్ లో కనిపిస్తూ విలేజ్ అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక కృతి శెట్టి ట్రైలర్ లో చూపిన విధంగా విలేజ్ సర్పంచ్ పాత్రలో ఎంట్రీ ఇస్తుంది. దర్శకుడు విలేజ్ రొమాంటిక్ సీన్స్, కామెడీ సన్నివేశాలని చక్కగా తీర్చిదిద్దాడు.
నాగార్జున తిరిగి భూమిపైకి వచ్చాక కథలో మలుపులు మొదలవుతాయి. నాగార్జునని, నాగ చైతన్యని సింగల్ ఫ్రేమ్ లో చూడడం ఫ్యాన్స్ కి ట్రీట్ అనే చెప్పాలి. కథని లైట్ గా టచ్ చేస్తూ ఫన్నీ సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించే విధంగా సాగుతుందని ట్విట్టర్ జనాలు అంటున్నారు.
ఫస్ట్ హాఫ్ లో నాగచైతన్య తన పెర్ఫామెన్స్ తో మెప్పించగా.. సెకండ్ హాఫ్ లో నాగార్జున కంప్లీట్ మాస్ గా కనిపిస్తాడని, ఆ సన్నివేశాలు ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంటాయని అంటున్నారు. ఇక క్లైమాక్స్ చాలా బాగా వర్కౌట్ అయిందని అంటున్నారు.
ఇదిలా ఉండగా బంగార్రాజు చిత్రంపై ట్విట్టర్ లో నెగిటివ్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. కథ కథనాలు బలంగా లేవని అంటున్నారు. నాగ చైతన్య, నాగార్జున ని కళ్యాణ్ కృష్ణ ప్రజెంట్ చేసిన విధానం బావుంది. కానీ బలమైన సన్నివేశాలతో కథని నడిపించలేకపోయారు అని అంటున్నారు.
కంటెంట్ యావరేజ్ గా ఉన్నప్పటికీ సంక్రాంతి పండక్కి కావాల్సిన అంశాలు అన్ని బంగార్రాజులో ఉన్నాయని, సినిమా బాక్సాఫీస్ విజయం గ్యారెంటీ అనే టాక్ కూడా వినిపిస్తోంది. చిత్రంలోని పాటల చిత్రీకరణ కూడా బావుందని అంటున్నారు. సినిమాలో అన్ని పాత్రల పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.