MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొడుకు వరుణ్ కెరీర్ కి నాగబాబు కొరివి... చిరు, బన్నీ, చరణ్ వల్లే కాలేదు పసివాడు తట్టుకోగలడా!

కొడుకు వరుణ్ కెరీర్ కి నాగబాబు కొరివి... చిరు, బన్నీ, చరణ్ వల్లే కాలేదు పసివాడు తట్టుకోగలడా!

మెగా ఫ్యామిలీలో అత్యంత దురదృష్టవంతుడిగా నాగబాబును వర్ణిస్తారు. చిరంజీవి కష్టపడి సాధించిన ఇమేజ్ తాలూకు అదృష్టం ఒక్క నాగబాబుకు మాత్రం అంటలేదు. టాలీవుడ్ రారాజు చిరంజీవి కూడా నాగబాబు ఫేట్ మార్చలేకపోయాడు.

2 Min read
Author : Sambi Reddy
Published : May 27 2022, 06:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

90లలో చిరంజీవి (Chiranjeevi) డేట్స్ దొరికితే జాక్ పాట్ కొట్టినట్లే. సినిమా టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నా నిర్మాతలకు లాభాల పంట పండేది. హీరోగా ఎదగాలనుకున్న నాగబాబు సక్సెస్ కాలేదు. దీంతో నిర్మాత అవతారం ఎత్తాడు. తల్లి పేరుతో అంజనా ప్రొడక్షన్స్ స్థాపించి రుద్రవీణ మూవీ ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఆడలేదు.

26

ఈ చిత్రం తర్వాత త్రినేత్రుడు దారుణ పరాజయం ఎదుర్కొంది. చిరంజీవి-కోదండరామిరెడ్డి కాంబినేషన్ కూడా నాగబాబును కాపాడలేదు. ఆ దెబ్బతో ఆరేళ్ళ గ్యాప్ తర్వాత 1994లో ముగ్గురు మొనగాళ్లు తీశారు. ఇది యావరేజ్ కాగా, 1998లో విడుదలైన బావగారు బాగున్నారు మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది.

36

ఇక నాగబాబు (Nagababu) నిర్మాతగా తెరకెక్కిన గుడుంబా శంకర్, స్టాలిన్ నిరాశపరిచాయి. ఆరెంజ్ మూవీ అయితే నాగబాబుకు ఓ రేంజ్ లో ఝలక్ ఇచ్చింది. ఉన్న ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడేసింది. పట్టు వదలని విక్రమార్కుడిగా ప్రయత్నాలు చేస్తున్న నాగబాబు అల్లు అర్జున్ తో నాపేరు సూర్య ట్రై చేశాడు. ఆ చిత్ర నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.

46

బన్నీ (Allu Arjun) కెరీర్ లో అట్టర్ ప్లాప్ గా నాపేరు సూర్య మిగిలిపోయింది. ఆ సినిమా దెబ్బకు అల్లు అర్జున్ రెండేళ్లు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. నాగబాబు నిర్మాతగా సినిమా అంటే అది అట్టర్ ప్లాప్ అవుతుందనే సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. ప్రతిసారి జరుగుతుంటే ఎవరైనా నమ్మాల్సిందే. ఓ ప్రక్క చిరంజీవి, పవన్ (Pawan Kalyan), చరణ్ లతో చిత్రాలు చేసి గీతా ఆర్ట్స్ ఎక్కడికో వెళ్ళిపోయింది.

56


కాగా ఈసారి సొంత కొడుకుపైనే తన సెంటిమెంట్ ప్రయోగించడానికి సిద్దమయ్యాడట. వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీకి నాగబాబు నిర్మాణ భాగస్వామి ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వరుణ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నట్లు ప్రకటించారు. 

66
Nagababu -Varun tej

Nagababu -Varun tej


ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా... నాగబాబు కూడా భాగం అవుతున్నాడట. ఈ క్రమంలో వరుణ్ కెరీర్ కి నాగబాబు ఎసరు పెట్టాడు అనుకుంటున్నారు. చక్కగా టీవీ షోలు చేసుకుంటూ టెన్షన్ లేకుండా గడపకుండా కలిసి రాని పనులు ఎందుకు అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉండగా... వరుణ్ ఫ్యాన్స్ వద్దు మహాప్రభో అంటున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Aamir Khan: నా సికందర్ నువ్వే.. మాజీ భార్య స్పెషల్ విషెస్! 'లగాన్' కథ విననని చెప్పాడట
Recommended image2
Ananya Panday: అతడి కోసం నన్ను నేను తగ్గించుకున్నా.. బ్రేకప్స్ పై నోరు విప్పిన అనన్య పాండే!
Recommended image3
Lokesh Kanagaraj: బ్యాంక్ ఆఫీసర్ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ వరకు.. లోకేష్ కనగరాజ్ ఆస్తి ఎన్ని కోట్లంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved