మెగా అభిమానులకు నిహారిక బిగ్ షాక్... విడాకులపై ఇండైరెక్ట్ హింట్!
నిహారిక కొణిదెల విడాకుల వార్తలు గత నెల రోజులుగా హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఈ వార్తలను ధృవీకరించే విధంగా నిహారిక మరో చర్యలకు పాల్పడింది.

ఇటీవల విడాకులు, బ్రేకప్ విషయంలో సెలెబ్రిటీలు ఓ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా హింట్ ఇస్తున్నారు. ఫోటోలు డిలీట్ చేయడం, అన్ ఫాలో కావడం చేస్తున్నారు. ప్రొఫైల్ నేమ్ మార్చేస్తున్నారు. సమంత, శ్రీజా వంటి సెలెబ్రిటీలు ఇలాగే తమ విడాకులు కన్ఫర్మ్ చేశారు. నాగబాబు డాటర్ నిహారిక సైతం ఇదే తరహాలో పరోక్షంగా తెలియజేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
గత నెలరోజులుగా నిహారిక-వెంకట చైతన్య విడాకుల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిహారిక భర్త వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు తొలగించారు. అలాగే ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా డిలీట్ చేశారు. ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఈ క్రమంలో వెంకట చైతన్య-నిహారిక మధ్య మనస్పర్థలు తలెత్తాయి. విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారంటూ వరుస కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తలపై నిహారికతో పాటు కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కాంప్రమైజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. వెంకట చైతన్య-నిహారిక మధ్య సమస్యలు తీరాయి. కలిసిపోయారన్న వాదనలు తెరపైకి వచ్చాయి. మెగా ఫ్యాన్స్ లో ఈ వార్తలు ఆనందం నింపాయి.
షాక్ ఇస్తూ... నిహారిక భర్త వెంకట చైతన్య మాదిరి ఇంస్టాగ్రామ్ అకౌంట్లోని తన పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది. కొన్ని అరుదైన జ్ఞాపకాలు మాత్రం ఉంచుకొని... వెంకట చైతన్యతో ఉన్న ఫోటోలు తీసేసింది. అమ్మ నిశ్చితార్థం చీర కట్టుకున్న ఫోటో, హల్దీ ఫంక్షన్ ఫోటో...ఇలా ఒకటి రెండు మాత్రమే అట్టి పెట్టారు. మొత్తం తీసేశారు. ఈ క్రమంలో... నిహారిక పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. ఆమె విడాకులు తీసుకోవడం ఖాయమే అంటూ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
2020 డిసెంబర్ 9న నిహారిక వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఐదు రోజులు ఘనంగా పెళ్లి వేడుక నిర్వహించారు. నిహారిక-వెంకట చైతన్యల వివాహానికి మెగా హీరోలందరూ హాజరు కాగా నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. పెళ్లి తర్వాత నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. నిర్మాతగా వెబ్ సిరీస్లు నిర్మిస్తున్నారు. గతంలో కూడా నిహారిక పింక్ ఎలిఫెంట్ బ్యానర్ లో నాన్న కుచ్చి, మ్యాడ్ హౌస్ వంటి సిరీస్లు నిర్మించారు.