'గుంటూరు కారం' చిత్రానికి అందువల్లే డ్యామేజ్ జరిగింది.. నిర్మాత ఓపెన్ కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చివరి చిత్రం గుంటూరు కారం. మహేష్ బాబు తదుపరి రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. గుంటూరు కారం చిత్రం మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చివరి చిత్రం గుంటూరు కారం. మహేష్ బాబు తదుపరి రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. గుంటూరు కారం చిత్రం మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. త్రివిక్రమ్ మరోసారి తల్లి కొడుకుల సెంటిమెంట్ తో సినిమా చేశారు అంటూ కామెంట్స్ వినిపించాయి.
ఈ చిత్రంపై మహేష్ బాబు ఫ్యాన్స్ సైతం పెదవి విరిచారు. అంచనాలకు తగ్గట్లుగా సినిమాలేదని టాక్ వచ్చింది. దీనిపై రీసెంట్ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ ఓపెన్ అయ్యారు. ఈ చిత్రానికి గుంటూరు కారం అని టైటిల్ పెట్టడం వల్లే డ్యామేజ్ జరిగింది అని నాగవంశీ ఓపెన్ గా కామెంట్స్ చేశారు.
గుంటూరు కారం చిత్రం కంప్లీట్ గా ఫ్యామిలీ మూవీ. అలాంటి చిత్రానికి మాస్ చిత్రం అన్నట్లుగా గుంటూరు కారం టైటిల్ పెట్టడం వల్ల అంచనాలు రాంగ్ వేలో వెళ్లాయి. దీనితో సినిమా బావున్నప్పటికీ ఆడియన్స్ కొందరు డిసప్పాయింట్ అయ్యారు అని నాగవంశీ తెలిపారు.
కంటెంట్ పరంగా గుంటూరు కారం చిత్రంలో ఎలాంటి తప్పు లేదు. మహేష్, రమ్యకృష్ణ మధ్య సెంటిమెంట్ సీన్లు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఒక్క నైజాం ఏరియాలో మాత్రం బాగా డ్యామేజ్ జరిగింది. మిగిలిన అన్ని చోట్ల గుంటూరు కారం చిత్రం సేఫ్ అని నాగవంశీ తెలిపారు.