- Home
- Entertainment
- 'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. పెళ్లి తర్వాత చైతు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసినట్లేనా..
'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. పెళ్లి తర్వాత చైతు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసినట్లేనా..
తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రిలీజ్ కి ముందే ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.

అక్కినేని నాగ చైతన్య, చందూ ముండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన సముద్రపు అడ్వెంచర్ లవ్ స్టోరీ చిత్రం తండేల్. ఈ చిత్రంలో నాగ చైతన్య మత్స్యకార యువకుడిగా నటిస్తున్నారు. నాగ చైతన్యకి జోడిగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. లవ్ స్టోరీ తర్వాత వీళ్ళిద్దరూ మరోసారి కలసి నటిస్తున్నారు.
బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించగా, అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 85 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రిలీజ్ కి ముందే ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినప్పటికీ ఇది అద్భుతమైన ప్రేమ కథ అని డైరెక్టర్ చందూ ముండేటి అంటున్నారు.
తాజాగా ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ఫస్ట్ రివ్యూ లీక్ అయింది. ఈ చిత్రానికి 2.32 గంటల పర్ఫెక్ట్ రన్ టైం లాక్ చేసినట్లు సమాచారం. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యు/ ఏ సర్టిఫికెట్ అందించారు. ఒక్క కట్ కూడా చెప్పలేదు.
సెన్సార్ సభ్యుల నుంచి తండేల్ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. యువతకి నచ్చేలా నాగ చైతన్య, శోభిత మధ్య కెమిస్ట్రీ ఉంటుందని అంటున్నారు. సినిమా బోర్ కొట్టించకుండా సాగుతుందని చెబుతున్నారు. 20 నిమిషాల పాటు పాకిస్తాన్ కి సంబంధించిన సన్నివేశాలు ఉంటాయట. చందూ ముండేటి విజువల్స్ అద్భుతంగా చూపిస్తూ ఈ చిత్రాన్ని ఎంగేజింగ్ గా మలిచినట్లు తెలుస్తోంది.
సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రివ్యూ వచ్చింది అంటే తండేల్ చిత్రానికి మంచి స్టార్ట్ లభించింది అని అర్థం. దీనితో నాగ చైతన్య అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. శోభితతో పెళ్లి తర్వాత నాగ చైతన్య ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు అని అంటున్నారు. మరి ఫిబ్రవరి 7న ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.