- Home
- Entertainment
- నాగ చైతన్య లైఫ్ లో అతి ముఖ్యమైంది ఎత్తుకుపోయిన సమంత... దాన్ని తలచుకొని చైతూ ఎమోషనల్!
నాగ చైతన్య లైఫ్ లో అతి ముఖ్యమైంది ఎత్తుకుపోయిన సమంత... దాన్ని తలచుకొని చైతూ ఎమోషనల్!
నాగ చైతన్య లేటెస్ట్ మూవీ థ్యాంక్ యూ(Thank You). జులై 22న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. కాగా థ్యాంక్ యూ అనే పదాన్ని వివరిస్తూ నాగచైతన్య చేసిన సోషల్ మీడియా పోస్ట్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. విడాకుల కారణంగా సమంతతో పాటు తనకు ప్రియమైనది ఒకటి దూరమైనట్లు క్లారిటీ వచ్చింది.

Samantha Naga Chaitanya
సమంత, నాగ చైతన్య(Naga Chaitanya) నాలుగేళ్లు కలిసి కాపురం చేశారు. ఈ ప్రయాణంలో ఇద్దరు ఇష్టపడే కామన్ థింగ్స్ ఉండడం అనేది సర్వసాధారణం. ఇంట్లో వస్తువులు, స్థలాలు, అలాగే పెట్ డాగ్స్. ముఖ్యంగా పెట్ డాగ్స్ తో యజమానులకు గట్టి బంధం ఏర్పడి ఉంటుంది. కుటుంబ సభ్యులందరితో అవి అనుబంధం కలిగి ఉంటాయి. అలా సమంత తీసుకొచ్చిన పెట్ డాగ్ హ్యాష్ తో నాగ చైతన్యకు మంచి బాండింగ్ ఏర్పడింది.
Naga Chaitanya
హ్యాష్ సైతం నాగచైతన్యను ఎంతగానో ఇష్టపడేది. సమంత(Samantha), నాగ చైతన్యలకు విడాకుల తర్వాత సమంత హ్యాష్ ని తనతోపాటు తీసుకుపోయింది. చైతు అభిమానించే హ్యాష్ తనకు దూరమైంది. సమంత, నాగ చైతన్య ఇకపై కలిసేది లేదు కాబట్టి... హ్యాష్ కూడా నాగ చైతన్యకు శాశ్వతంగా దూరమైనట్లే.
Naga Chaitanya
సమంత, నాగ చైతన్య మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా పెట్ డాగ్ హ్యాష్ కి నాగ చైతన్య థ్యాంక్ యూ చెప్పడం విశేషంగా మారింది. ఇంస్టాగ్రామ్ లో నాగ చైతన్య ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన జీవితంలో అతి ముఖ్యమైన ముగ్గురికి థ్యాంక్ యూ చెప్పాడు. మొదటి రెండు స్థానాలు అమ్మ, నాన్నలకు ఇచ్చిన నాగ చైతన్య మూడో స్థానం సమంత పెట్ డాగ్ హ్యాష్ కి ఇచ్చాడు.
Naga Chaitanya
అన్నీ తానైన అమ్మకు, మార్గదర్శకత్వం చేసిన నాన్నకు థ్యాంక్ యు. ఇక ప్రేమించడం నేర్పి, మనిషిగా మార్చిన హ్యాష్ కి కృతజ్ఞతలు అంటూ నాగ చైతన్య ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. తన జీవితంలో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరిగా పెట్ డాగ్ హ్యాష్ కి స్థానం ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీన్ని బట్టి హ్యాష్ అంటే చైతూకు ఎంత ఇష్టమో తెలిసొచ్చింది.
మనస్పర్థలతో విడిపోయిన నాగ చైతన్య, సమంత 2021 అక్టోబర్ లో విడాకుల ప్రకటన చేశారు. చట్టపరంగా విడిపోయిన ఈ జంట మధ్య మానసిక యుద్ధం నడుస్తుంది. ఒకరిపై మరొకరు పుకార్లు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విడాకుల సమయంలో సమంతపై కొన్ని రూమర్స్ ప్రచారం అయ్యాయి. వాటి వెనుక నాగ చైతన్య పీఆర్ టీం ఉన్నట్లు సమంత పీఆర్ టీం ఆరోపించింది.
ఇటీవల నాగ చైతన్య, హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. సమంత తన పీఆర్ టీం తో ఈ పుకార్లను తెరపైకి తెచ్చిదంటూ చైతూ పీఆర్ టీమ్ ఆరోపించారు. తమ తమ కెరీర్స్ లో బిజీగా ఉన్న సమంత, చైతూ ఒకవైపు ఈ కోల్డ్ వార్ కొనసాగిస్తున్నారు.
కాగా థ్యాంక్ యూ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకుడు. రాశి ఖన్నా, అవికా గోర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. ఈ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది.