- Home
- Entertainment
- Samantha: శోభిత-చైతు ఎఫైర్ పై సమంత సంచలన ట్వీట్... నాపై రూమర్స్ మాత్రం నిజమా అంటూ ఎదురుదాడి!
Samantha: శోభిత-చైతు ఎఫైర్ పై సమంత సంచలన ట్వీట్... నాపై రూమర్స్ మాత్రం నిజమా అంటూ ఎదురుదాడి!
మొన్నటి వరకు పరోక్షంగా నాగ చైతన్యను టార్గెట్ చేసిన సమంత ఇప్పుడు ఏకంగా ఎదురుదాడికి దిగింది. నాగ చైతన్య తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళ్లతో సన్నిహితంగా ఉంటున్నారంటూ వార్తలు వస్తుండగా సమంత చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Samantha
సమంత-నాగ చైతన్య (Samantha-Naga Chaitanya) 2021 అక్టోబర్ నెలలో విడాకుల ప్రకటన చేశారు. వీరి విడాకుల అనంతరం అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా సమంతపై అనేక ఆరోపణలు వినిపించాయి. సమంత తన పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో ఎఫైర్ పెట్టుకున్నారనేది ప్రధాన ఆరోపణ. అతనితో సమంత సన్నిహితంగా దిగిన ఫోటోలు బయటకు తీసి వాళ్ళ మధ్య ఎఫైర్ కారణంగానే నాగ చైతన్య విడాకులు ఇచ్చారంటూ ప్రచారం జరిగింది.
అయితే ఈ ప్రచారం వెనుక నాగ చైతన్య హస్తం ఉన్నట్లు అప్పట్లో సమంత పీఆర్ టీం ఆరోపించింది. కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెల్స్ పై ఆమె న్యాయపోరాటం కూడా చేయడం జరిగింది. అలాగే సమంత పరోక్షంగా నాగ చైతన్యపై సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతూ ఉండేవారు. కొన్ని కోట్స్ రూపంలో చైతూకు చురకలేసేవారు.
నాగ చైతన్య మాత్రం మౌనం వహించారు. కొన్నాళ్ళకు సమంత ఆ పరోక్ష పోస్ట్స్ పెట్టడం కూడా మానేశారు. తాజాగా ఆమె ఏకంగా ప్రత్యక్ష దాడికి దిగారు. నేరుగా నాగ చైతన్యను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
హీరోయిన్ శోభిత దూళిపాళ్ల(Shobitha Dhulipala) తో నాగ చైతన్య ఎఫైర్ పెట్టుకున్నారంటూ గత 24గంటలుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ తెలుగు హీరోయిన్ బర్త్ డే ప్రైవేట్ హోటల్ లో గ్రాండ్ గా నాగ చైతన్య నిర్వహించారట. కొన్నాళ్లుగా ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారట. ఇక నాగ చైతన్య కొత్తగా హైదరాబాద్ లో నిర్మించుకుంటున్న ఇంటికి శోభితను పలుమార్లు తీసుకెళ్లారట.
కాగా నాగ చైతన్య(Naga Chaitanya), శోభిత గురించి వస్తున్న ఈ ఎఫైర్ రూమర్స్ వెనుక సమంత పిఆర్ టీం ఉన్నారని నాగ చైతన్య టీం ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సమంత, నాగ చైతన్య పిఆర్ టీమ్స్ పరస్పర ఆరోపణలు గురించి వివరిస్తూ ఓ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ఈ కథనాన్ని ట్యాగ్ చేస్తూ సమంత ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో.. ఓ అమ్మాయి పై రూమర్స్ వస్తే అవి నిజాలు, అదే ఓ అబ్బాయిపై వస్తే మాత్రం కావాలని ఓ అమ్మాయి చేయిస్తున్న దుష్ప్రచారం. ఇకనైనా ఎదగండిరా బాబూ. తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం ఫ్యామిలీ, కెరీర్ గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్లడమే ... అంటూ సమంత తన ట్వీట్ లో కామెంట్ చేశారు. సమంత ఏకంగా నాగ చైతన్య, తన గురించి రాసిన ఆర్టికల్ ట్యాగ్ చేసి ఈ కామెంట్స్ చేయడంతో ప్రత్యక్ష దాడికి దిగినట్లు అయ్యింది.
Samantha
నాపై వచ్చిన రూమర్స్ మాత్రం నిజం.. నాగ చైతన్యపై వచ్చిన రూమర్స్ మాత్రం నేను కావాలని చేయిస్తున్నానా..? అంటూ ఆమె నేరుగా ప్రశ్నించారు. సమంత ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక సమంత ట్వీట్ పై నాగార్జున ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో చూడాలి.
మరోవైపు సమంత, చైతూ ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నాగ చైతన్య థ్యాంక్యూ చేస్తున్నారు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తుండగా... రాశి ఖన్నా, అవికా గోర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే దూత టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు.
సమంత హీరో విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి మూవీ చేస్తున్నారు. ఖుషి చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే యశోద చిత్రం షూటింగ్ జరుపుకుంటుండగా శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సిటాడెల్ వెబ్ సిరీస్ తో పాటు ఓ హిందీ చిత్రం ఆమె ఖాతాలో ఉన్నాయి.