- Home
- Entertainment
- పక్కనోడి సినిమాని తొక్కేసే హీరోలు ఉన్నారు, ఎలా కుట్ర చేస్తారో తెలుసా.. ఫస్ట్ టైం ఓపెన్ అయిపోయిన చైతు
పక్కనోడి సినిమాని తొక్కేసే హీరోలు ఉన్నారు, ఎలా కుట్ర చేస్తారో తెలుసా.. ఫస్ట్ టైం ఓపెన్ అయిపోయిన చైతు
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం శుక్రవారం రోజు థియేటర్స్ లోకి వచ్చింది.చైతు, సాయి పల్లవి లవ్ సీన్స్ పై మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే లాంగ్ రన్ లో వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

Naga Chaitanya
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం శుక్రవారం రోజు థియేటర్స్ లోకి వచ్చింది.చైతు, సాయి పల్లవి లవ్ సీన్స్ పై మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే లాంగ్ రన్ లో వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. ఎందుకంటే ఈ చిత్రం 80 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందించబడింది. చందూ ముండేటి దర్శకత్వంలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా వెనుక ఉండి ఈ చిత్రాన్ని నడిపించారు.
Thandel Movie
నాగ చైతన్య తండేల్ ప్రమోషన్స్ లో భాగంగా పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో నాగ చైతన్య టాలీవుడ్ లో జరుగుతున్న నెగిటివ్ పబ్లిసిటీ, పిఆర్ టీమ్స్ హడావిడి, మీమ్ పేజెస్ గురించి నాగ చైతన్య ఓపెన్ అయ్యారు. టాలీవుడ్ లో నెగిటివ్ పిఆర్ సాగుతున్నట్లు చైతు అంగీకరించారు.
Thandel
ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుంటే కావాలనే పిఆర్ టీమ్స్ తో నెగిటివ్ పోస్ట్ లు పెట్టించడం, మీమ్స్ క్రియేట్ చేయడం లాంటివి జెరుగుతున్నాయని చైతు ఓ ప్రశ్నలో భాగంగా అంగీకరించారు. అయితే తాను మాత్రమే ఈ నెగిటివ్ పిఆర్ కి దూరంగా ఉంటానని తెలిపారు. పక్కనోడి సినిమాని తొక్కేసి ఎదగాలనుకునే హీరోలు ఉన్నట్లు చైతు అంగీకరించారు.
ప్రతి హీరో పి ఆర్ టీమ్ కోసం ఖర్చు చేయడం సహజం. అది వాళ్ళ పబ్లిసిటీకి మాత్రమే ఉపయోగపడేలా చూసుకోవాలి. అంతే కానీ పక్కనోడి సినిమాని తొక్కేసేలా ఉండకూడదు అని తెలిపారు. నా వరకు నేను నా చిత్రం రిలీజ్ అయినప్పుడు పిఆర్ కోసం ఖర్చు చేస్తాను అని చైతు తెలిపారు. కొందరు హీరోలు నెగిటివ్ పిఆర్ చేయించకుండా తమ పబ్లిసిటీ కోసం ఖర్చు చేస్తే బావుంటుందేమో.. లేకపోతే ఆ డబ్బుతో హ్యాపీగా వెకేషన్ అయినా వెళ్లిరావచ్చు, లేకుంటే కనీసం యాక్టింగ్ అయినా నేర్చుకుని ఎదగొచ్చు అంటూ చైతు సలహా ఇచ్చారు.
Naga Chaitanya
టాలీవుడ్ లో జరుగుతున్న నెగిటివ్ పబ్లిసిటీ పై చైతు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపేలా ఉన్నాయి. టాలీవుడ్ లో జరుగుతున్న నెగిటివ్ పబ్లిసిటీ గురించి చైతు కామెంట్స్ తో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది.