- Home
- Entertainment
- ఆ వార్తలు నన్ను ఇబ్బంది పెట్టలేవు, నాకు కాబోయేవాడు అతడే... చైతన్యతో ఎఫైర్ రూమర్స్ నేపథ్యంలో శోభిత కామెంట్స్
ఆ వార్తలు నన్ను ఇబ్బంది పెట్టలేవు, నాకు కాబోయేవాడు అతడే... చైతన్యతో ఎఫైర్ రూమర్స్ నేపథ్యంలో శోభిత కామెంట్స్
ఒక ప్రక్క నాగ చైతన్యతో ఎఫైర్ రూమర్స్ పెద్ద ఎత్తున వినిపిస్తుండగా శోభిత ధూళిపాళ్ల కాబోయే వాడు ఇలా ఉండాలంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఏడాది కాలంగా నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల ఎఫైర్ లో ఉన్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. నాగ చైతన్య తాను కొత్తగా నిర్మించుకునే ఇంటికి పలుమార్లు శోభిత దూళిపాళ్లను తీసుకొచ్చారట. వీరిద్దరూ ఎఫైర్ లో ఉన్న మాట నిజమే అంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను నాగ చైతన్య టీమ్ ఖండించింది. అవన్నీ నిరాధార కథనాలు, ఎవరో కావాలని చేస్తున్న కుట్ర అని చెప్పుకొచ్చారు.
ఇటీవల వీరి ఎఫైర్ ని బలపరుస్తూ ఓ ఆధారం లభించింది. లండన్ లోని ఒక రెస్టారెంట్ కి చైతు, శోభిత జంటగా వెళ్లారు. ఆ రెస్టారెంట్ చెఫ్ చైతుతో సెల్ఫీ దిగి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అనుకోకుండా ఆ ఫొటోలో దూరంగా శోభిత కూడా కనిపించింది. దీనిపై వార్తలు రాగా... సదరు చెఫ్ ఆ ఫోటో అకౌంట్ నుండి డిలీట్ చేశాడు.
నాగ చైతన్యతో ఆమె వ్యవహారం నడుపుతుందని జనాలు గట్టిగా నమ్ముతున్నారు. తాజాగా ఈ పుకార్ల మీద మరోసారి ఆమె స్పందించారు. ది నైట్ మేనేజర్ 2 ప్రొమోషన్స్ లో పాల్గొన్న శోభిత మాట్లాడుతూ... నాకు కాబోయేవాడు చాలా సింపుల్ గా ఉండాలి. మంచి మనసు, దయ కలిగిన వ్యక్తి అయ్యుండాలి. జీవితం చాలా చిన్నది, ప్రతి నిమిషం ఆస్వాదించాలని నమ్మాలి. ప్రకృతిని ప్రేమించాలి. అలాంటి వాడిని భర్తగా కోరుకుంటాను అన్నారు.
ఇక చైతూతో ఎఫైర్ రూమర్స్ ని ఉద్దేశిస్తూ... నేను అలాంటి వార్తలను పట్టించుకోను. ఎన్నో ఆడిషన్స్ ఇస్తే కానీ నేను హీరోయిన్ కాలేకపోయాను. ఇప్పటికీ ప్రతి క్షణం కష్టపడుతున్నాను. ఎవరైనా నా వర్క్ గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పుకొచ్చారు. శోభిత ధూళిపాళ్ల లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ల బాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. నవాజుద్దీన్ సిద్దిఖీ హీరోగా తెరకెక్కిన రామన్ రాఘవ్ 2.0 చిత్రంతో ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. హీరో అడివి శేష్ ఆమెను టాలీవుడ్ కి తీసుకొచ్చారు. ఆయన హీరోగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ గూఢచారి చిత్రంలో శోభిత హీరోయిన్ గా నటించారు. గూఢచారి సూపర్ హిట్ కొట్టింది. అడివి శేష్ తన పాన్ ఇండియా చిత్రం మేజర్ లో మరో ఛాన్స్ ఇచ్చారు. బయోపిక్ గా తెరకెక్కిన మేజర్ విజయం సాధించింది.
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ సిరీస్లో శోభిత ఓ కీలక రోల్ చేశారు. ది నైట్ మేనేజర్ 2 విడుదలకు సిద్ధం అవుతుంది. మంకీ మాన్ టైటిల్ తో ఓ హాలీవుడ్ మూవీలో శోభిత నటిస్తుంది.