MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Naga Chaitanya:ఏపీ టిక్కెట్ రేటుపై చైతూ..ఇలా అంటాడని అసలు ఊహించం

Naga Chaitanya:ఏపీ టిక్కెట్ రేటుపై చైతూ..ఇలా అంటాడని అసలు ఊహించం

ధరలు తగ్గించాల్సిందేనని ఏపీ ప్రభుత్వం చెబుతుంటే… రేట్లు పెంచుకోవడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే అదే సమయంలో నాగార్జున...ఏపి ప్రభుత్వ విధానానికి సపోర్ట్ గా ఉన్నట్లు మాట్లాడారు.  

3 Min read
Author : Surya Prakash
Published : Jan 13 2022, 07:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19


గత కొద్ది కాలంలో ఆంధ్రాలో  టిక్కెట్ రేట్ల వ్యవహారంపై తీవ్రమైన చర్చ జరుగుతన్న సంగతి తెలిసిందే.  సినిమా టిక్కెట్ల ధరలపై ఏపీ సర్కార్‌ కఠినంగా వ్యవహరిస్తుండటం.. దుమారానికి కారణమవుతోంది. మరో ప్రక్క అందుకు పూర్తి భిన్నంగా తెలంగాణ సర్కార్‌ వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ధరలు తగ్గించాల్సిందేనని ఏపీ ప్రభుత్వం చెబుతుంటే… రేట్లు పెంచుకోవడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే అదే సమయంలో నాగార్జున...ఏపి ప్రభుత్వ విధానానికి సపోర్ట్ గా ఉన్నట్లు మాట్లాడారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29


ఎన్ని విమర్శలు,ట్రోలింగ్ వచ్చినప్పటికి ఆయన వెనకాడలేదు. మీడియా కూడా దాన్నే బూతద్దంలా చూపెట్టాలని ప్రయత్నిస్తోంది. తాజాగా బంగార్రాజు ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు నాగ చైతన్య. ఆయనను సైతం ఇదే విషయమై మీడియా వారు ప్రశ్నించారు. దానికి నాగచైతన్య చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. ఇంతకీ చైతూ ఏమన్నారో చూద్దాం.

39


నాగచైతన్య మాట్లాడుతూ... టికెట్ రేట్స్ గురించి నాన్నతో చాలా డిస్కషన్ జరిగింది. ఏప్రిల్‌లో టికెట్ రేట్స్ జీవో విడుద‌ల చేశారు. మేం ఆ త‌ర్వాత సినిమా స్టార్ట్ చేశాం. ఏపీలో ఉన్న టికెట్ రేట్స్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా బడ్జెట్ వేసుకుని ముందుకు వెళ్లాం. రేపు టికెట్ రేట్స్ పెరిగితే మాకు బోనస్ అన్నారు. 

49
Bangarraju

Bangarraju


అలాగే..టికెట్ రేట్స్ విషయంలో మీకు ప్రాబ్లమ్ ఏమీ లేదా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ...నేను యాక్టర్ అండి. స్టార్టింగ్ నుంచి నటించి రావడం నాకు అలవాటు. సినిమా స్టార్ట్ చేసే ముందు నిర్మాతతో మాట్లాడతాను. 'మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? నా వైపు నుంచి నేను ఏమైనా చేయనా?' అని అడుగుతా. నిర్మాతకు కంఫర్ట్ అయితే... నాకు కంఫర్ట్. నిజంగా ఏదో ఒక కారణంగా డిసైడ్ చేస్తారు. అన్నీ టైమ్‌కు జ‌రుగుతాయి. పరిస్థితులకు తగ్గట్టు ముందుకు వెళ్లాలి అన్నారు.

59


ఇక దీనికి ముందు చేసిన ధాంక్యూ సినిమాలకు ప్రాబ్లమ్ అవుతుందా? అన్నదానికి సమాధానం ఇస్తూ....'దిల్' రాజుగారు (థాంక్యూ సినిమా నిర్మాత) ఉన్నారు. డిస్కస్ చేశాం. ఆయన నిర్ణయం తీసుకుంటారు అని చెప్పారు.

69
Bangarraju teaser

Bangarraju teaser

. “నేను ఒక యాక్టర్ ని అండీ.. నాకేమీ సమస్య లేదు. కానీ నా నిర్మాతలు బాగున్నారా లేదా అని అడుగుతాను. వాళ్లకు ఇబ్బంది లేకపోతే నేను ఏమైనా చేయగలుగుతాను. నేను ఈ సమస్య గురించి నాన్నతో తరచుగా మాట్లాడుతుంటాను. గతేడాది ఏప్రిల్ 9న జీవో వచ్చింది.. మా సినిమా ఆగస్ట్ లో మొదలైంది. మేము ఆ రేట్ల ప్రకారం మా బడ్జెట్ వేసుకున్నాం. కాబట్టి మాకు ఎలాంటి సమస్య లేదు. అవి పెరిగితే మాకు ఇంకా బోనస్ అవుతుంది'' అని నాగచైతన్య చెప్పారు.

79

జీవో రాకముందే ప్రారంభమైన 'థాంక్యూ' సినిమాకి ఇది సమస్య కాదా? అని చైతన్య ని ప్రశ్నించగా.. “అది దిల్ రాజు గారు చూసుకుంటారు. మేము దీని గురించి చర్చించాం. దిల్ రాజు గారు చూసుకుంటారని నమ్ముతున్నాను. నేను యాక్టర్ ని. నేను కేవలం నటించి తిరిగి వచ్చేస్తాను. రాజకీయ నిర్ణయాలు కొన్ని కారణాల వల్ల తీసుకుంటారు. అవి మారుతుంటాయి” అని నాగచైతన్య బదులిచ్చారు.

89
Bangarraju

Bangarraju

 
 గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందింది. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్స్. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించటం, ‘సోగ్గాడే..’కి ప్రీక్వెల్‌ కావటంతో ‘బంగార్రాజు’ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.   ''బంగార్రాజు''  నుంచి ఇప్పటికే విడుదలైన- పాటలు - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది.

99
Bangarraju

Bangarraju

'థాంక్యూ' తర్వాత ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ...అమెజాన్ కోసం విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో హారర్ వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి అది ఒక్కటే కమిట్ అయ్యాను. హారర్ నాకు భయం అయినా... కొత్తగా ట్రై చేస్తున్నాను. హిందీలో చేసిన 'లాల్ సింగ్ చద్దా' ఏప్రిల్ 14న విడుదల అవుతుంది. ఆ సినిమా చేసేటప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. నా కెరీర్ కు సరిపడా తెలుసుకున్నాను. అవకాశం వస్తే ప్రతి యాక్టర్ ఆయనతో ఒక్క సినిమా చేయాలి. ఆయనతో చేయడం వల్ల చాలా ఇంప్రూవ్ అవుతాం అన్నారు.  
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Recommended image2
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved