- Home
- Entertainment
- చిన్న కారణంతో... సూపర్ హిట్ సినిమాలు వదులుకున్న నాగచైతన్య, ఇంతకీ ఆ హిట్ సినిమాలేంటి..?
చిన్న కారణంతో... సూపర్ హిట్ సినిమాలు వదులుకున్న నాగచైతన్య, ఇంతకీ ఆ హిట్ సినిమాలేంటి..?
చాల మంది హీరోలు వద్దు అని వదులుకున్న సినిమాలే.. సూపర్ హిట్ అయ్యి సెన్సేషన్ అవుతుంటాయి. ఆతరువాత బాధపడినా లాభం ఉండదు. అటువంటి సందర్భాలు ప్రతీ హీరో లైఫ్ లో ఉంటాయి. కాని ఇలాంటి సిచ్యూవేషన్లు .. అక్కినేని హీరో నాగచైతన్యకు ఎక్కువగా ఎదురయ్యాయి.. చైతూ వద్దనుకుని సూపర్ హిట్ అయిన సినిమాలేంటంటే..?

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య కెరీర్ లో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డాడు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కాని నాగ చైతన్యను యాక్సెప్ట్ చేయడానికి టైం తీసుకున్నారు ఆడియన్స్. చైతూ కూడా తన సొంత టాలెంట్ తో ఈ స్థాయికి వచ్చాడు.
నాగచైతన్య సినిమాల్లో ఫ్లాప్స్ ఎక్కువ ఉన్నప్పటికీ.. యంగ్ హీరో సెలక్ట్ చేసుకునే కధలు మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి. సినిమా ప్లాప్ అయినా.. అలా అనిపించదు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే సినిమాలు చేస్తుంటాడు నాగ చైతన్య. కొన్ని కొత్త కధలను ఎంచుకోవడం వలన కూడా ఆయనకు ఫ్యాన్స్ లో క్రేజ్ ఏర్పడింది.
ఇక ఈ క్రమంలోనే కొన్ని రాంగ్ డెసిషన్స్ వల్ల నాగ చైతన్య తన కెరీర్ లో చాల మంచి మంచి సినిమాలనే రిజెక్ట్ చేసారు. ఏ మాయ చేసావే మంచి హిట్ టాక్ తీసుకురావడంతో పాటు నాగ చైతన్యకు లవర్ బాయ్ ఇమేజ్ ను కూడా తీసుకొచ్చింది. అయితే.. ఆ ఇమేజ్ ను కాపాడుకుంటూనే.. మాస్ హీరోగా కూడా ఎదగాలని ఆరాటపడ్డాడు.
అయితే మాస్ సినిమాలు మాత్రం నాగ చైతన్యకు అంతగా అచ్చిరాలేదనే చెప్పాలి. అయితే.. కొన్ని చిన్న చిన్న కారణాలతోనే నాగ చైతన్య మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను వదిలేసుకున్నారట.
నేచురల్ స్టార్ నాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమా ఆఫర్ తొలుత నాగ చైతన్యను వరించింది. కానీ, మతిమరుపు ఉన్న అబ్బాయిగా నటిస్తే ఇమేజ్ డామేజ్ అవుతుంది అనుకున్న చైతు ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. దాంతో అది నానీ దగ్గరకు వెళ్లడం సినిమా సూపర్ హిట్ అవ్వడం జరిగిపోయాయి.
అంతే కాదు టీనేజ్ లవ్ స్ట్రోరీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కొత్తబంగారు లోకం సినిమా కథని కూడా మొదట చైతూకి చెప్పారట. కానీ, కాలేజీ కుర్రాడి గెటప్ సూట్ అవ్వదు అని భావించిన చైతు ఈ సినిమా రిజెక్ట్ చేశారట. వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఈమూవీ ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే..
ఇక సమంత, నితిన్ నటించిన అ ఆ సినిమా ఆఫర్ కూడా చైతూ దగ్గరకే వెళ్లింద. అయితే ఈసినిమా చేద్దాం అనుకున్నా.. అప్పుడు నాగ చైతన్య దగ్గర డేట్స్ ఖాళీ లేక.. ఇతర సినిమా కాల్ షీట్స్ లో బిజీగా ఉండటంతో.. చైతూ ఈ సినిమాలను రిజెక్ట్ చేశారట. ఇలా నాగచైనత్య ఖాతా నుంచి ఈ మూడు సూపర్ హిట్ సినిమాలు మిస్అయ్యాయి.